Telangana

News April 19, 2025

BREAKING: గద్వాలలో యాక్సిడెంట్.. భార్యాభర్తలు మృతి

image

గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ధర్మారెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి నంద్యాలకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ప్రియదర్శి హోటల్ ముందు జాతీయ రహదారిపై వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మొత్తం ఆరుగురు ఉండగా అందులో పుల్లారెడ్డి, లక్ష్మీసుబ్బమ్మ భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు.

News April 19, 2025

కంచన్‌బాగ్‌లో అత్యధికం.. ముషీరాబాద్‌లో అత్యల్పం

image

నగర వ్యాప్తంగా నిన్న సాయంత్రం కురిసిన వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. ఒక చోట ఎక్కువ వర్షం ఉంటే.. మరో చోట తక్కువ వర్షపాతం నమోదైంది. కంచన్‌బాగ్‌లో అత్యధిక వర్షపాతం 8.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ముషీరాబాద్‌లో 2.40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్‌పురలో 7.88 సెం.మీ యాకుత్‌‌పురలో 7.63, బేగంబజార్లో 6.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News April 19, 2025

HYD: ఏడాదికి 2 సార్లు పీహెచ్డీ నోటిఫికేషన్..!

image

కూకట్‌పల్లి JNTUH యూనివర్సిటీలో ఇక నుంచి ఏటా 2 సార్లు PhD ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. అంతేకాక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థుల పర్యవేక్షణకు సూపర్వైజర్లను అందించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు JNTUH అఫిలియేటెడ్ కాలేజీల్లో IIT, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో PhD పూర్తి చేసిన వారిని సెలెక్ట్ చేయనున్నారు.

News April 19, 2025

HYD: ఏడాదికి 2 సార్లు పీహెచ్డీ నోటిఫికేషన్..!

image

కూకట్‌పల్లి JNTUH యూనివర్సిటీలో ఇక నుంచి ఏటా 2 సార్లు PhD ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. అంతేకాక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థుల పర్యవేక్షణకు సూపర్వైజర్లను అందించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు JNTUH అఫిలియేటెడ్ కాలేజీల్లో IIT, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో PhD పూర్తి చేసిన వారిని సెలెక్ట్ చేయనున్నారు.

News April 19, 2025

ఖమ్మం: బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

image

బావిలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మండలం మేడిదపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని వ్యక్తి బావిలో పడి మృతి చెందినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News April 19, 2025

నల్గొండ: రూ.300 కోట్లు మోసం చేశారని ఆందోళన

image

విప్స్ కంపెనీ డైరెక్టర్లమని తమను నమ్మించి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విప్స్ కంపెనీ బాధితులు కోరారు. ఈ మేరకు శుక్రవారం నల్గొండ డీఎస్పీ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ.. కంపెనీలో డైరెక్టర్లమని ప్రజలను మభ్యపెట్టి జిల్లాలో దాదాపు రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టించి మోసం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

News April 19, 2025

ధరణితోనే కాంగ్రెస్‌కు అధికారం: మంత్రి పొంగులేటి

image

BRS అమలు చేసిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం అన్నందుకే రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని, తొలగించి భూ భారతిని తీసుకొచ్చామని పేర్కొన్నారు.

News April 19, 2025

ADB: మహిళ కడుపులో 3.5కిలోల గడ్డ.. అరుదైన చికిత్స

image

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గ్రామానికి ఓ మహిళ కడుపులో నుంచి ముడున్నర కిలోల ఫైబ్రాయిడ్ గడ్డను వైద్యులు తొలగించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు. మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. మహిళ కుటుంబీకులు వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు.

News April 19, 2025

మన ‘పాకాల’ నీరు.. సముద్రంలో కలుస్తోందిలా!

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు వరద నీరు 192 కి.మీ ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ‘పాకాల’ వాగు.. ప్రవాహ క్రమేణా ‘మున్నేరు’గా మారి ఏపీలోని కంచికచర్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా బంగాళాఖాతం సముద్రంలో కలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంత రైతులకు, ప్రజలకు పాకాల నీరు జలవనరుగా ఉంది.

News April 19, 2025

ADB: అమ్మాయిని వేధించాడు.. అరెస్టయ్యాడు

image

సోషల్ మీడియా ద్వారా బోథ్ పట్టణానికి చెందిన ఒక అమ్మాయిని వేధించిన కేసులో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తికి చెందిన అలీమ్ బేగ్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు SI ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అతడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. నిందితుడిపై రెంజల్ పోలీస్ స్టేషన్‌లో ఇదివరకే నాలుగు కేసులు, రౌడీ షీట్ ఉన్నాయని తెలిపారు.