Telangana

News July 7, 2024

ఖమ్మంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడి ఆత్మహత్యాయత్నం

image

నిద్రమాత్రలు మింగి జిల్లా టీఎన్జీవో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం ఖమ్మంలో జరిగింది. జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అబ్దుల్ హాసన్ తన ఇంట్లో భారీ మొత్తంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతనిని కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సంతకాల ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్టైన ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

News July 7, 2024

సంగారెడ్డి: నాటి పూర్వ విద్యార్థులే.. నేడు టీచర్లు

image

సంగారెడ్డి జిల్లా జోగిపేట బాలుర ఉన్నత పాఠశాల నాటి(పూర్వ) విద్యార్థులే నేడు టీచర్లు అయ్యారు. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మందికి ఆ ఛాన్స్ వచ్చింది. ఇటీవలి పదోన్నతులు, బదిలీల్లో వీరంతా జోగిపేటకు వచ్చారు. చిన్నప్పుడు చదువుకున్న బడిలోనే ఇప్పుడు పాఠాలు నేర్పే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఇలాంటి ఓ రోజు వస్తుందని ఊహించలేదని టీచర్లు మాణయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్(PD), రమేశ్ కుమార్ అన్నారు.

News July 7, 2024

జడ్చర్ల: చోరీకి వెళ్లి పోలీసులకు దొరికారు

image

చోరీకి వెళ్లిన ఇద్దరు దొంగలు పోలీసులకు చిక్కిన ఘటన పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం జరిగింది.యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాలు.. జడ్చర్ల మండలం పెద్దఆదిరాలకు చెందిన బరిగల శివకుమార్(23), మల్కాజిగిరిలో ఉంటున్న పవన్(24)లు పాత నేరస్థులు. చౌటుప్పల్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా కత్తులతో దాడి చేసేందుకు యత్నించారు. విచారించగా చోరీ చేసేందుకు వెళ్తున్నట్లు ఒప్పుకున్నారు.

News July 7, 2024

పెంచికల్పేట్‌లో బొలెరో బోల్తా.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెంచికల్పేట్‌లోని మురళిగూడ వద్ద గుట్ట ఎక్కుతున్న క్రమంలో బొలెరో బోల్తా పడింది. అందులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బెజ్జూర్ నుంచి సిమెంట్, రేకులు, సిలెండర్లతో పాలు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు, తల్లిదండ్రులతో వాహనం గ్రామానికి వస్తోంది. ఈ క్రమంలో గుట్ట ఎక్కుతుండగా బొలేరో బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది.

News July 7, 2024

NLG: అంగన్వాడీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

image

నల్లగొండ జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న 96 టీచర్ల పోస్టులు, 381 ఆయాల పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుందని జిల్లా సంక్షేమ అధికారి సక్కుబాయి తెలిపారు.

News July 7, 2024

శివంపేట మండలంలో కుళ్లిన స్థితిలో మృతదేహం

image

మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టి ముక్కుల గ్రామ శివారులోని కమ్మరివారి కుంట వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చెరువు సమీపంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు ఎలా చనిపోయారు అనేది తెలియాల్సి ఉంది. మృతుడి ఆచూకీ తెలిస్తే చెప్పాలని పోలీసులు సూచించారు.

News July 7, 2024

ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన డిప్యూటీ సీఎం

image

ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా కార్యాలయానికి విచ్చేసిన ప్రజల నుంచి డిప్యూటీ సీఎం దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలనుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

News July 7, 2024

భద్రాచలం వద్ద గోదావరిలో యువకుడి గల్లంతు

image

గోదావరిలో ఓ యువకుడు గల్లంతైన ఘటన భద్రాచలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువకులు ఈరోజు ఉదయం గోదావరిలో స్నానానికి వెళ్లాకం. ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. 

News July 7, 2024

WGL: ఎస్ఐ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

image

అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీను మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆయన మృతదేహానికి తనతో పాటు విధులు నిర్వహించిన పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు నివాళులర్పించారు. అనంతరం శ్రీరాముల మృతికి కారణమైన సీఐ, కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధుమిత్రులు డిమాండ్ చేశారు.

News July 7, 2024

ఆలయంలో కోనేరు పూడ్చివేతపై MP డీకే అరుణ ఫైర్

image

జడ్చర్లలోని పెద్దగుట్టపై పురాతన శ్రీశ్రీశ్రీ రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేత ఘటనపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. అనుమతులు లేకుండా ఎలా కూల్చివేస్తారని జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.