Telangana

News July 7, 2024

మంచిర్యాల: బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్‌.. మహిళ మృతి

image

శ్రీరాంపూర్ పట్టణంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందింది. స్థానిక కృష్ణ కాలనీకి చెందిన శారద ఇంటి ఆవరణలో బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News July 7, 2024

రైతు భరోసా స్కీమ్‌కు సవాల్‌గా కౌలు రైతులు

image

రైతు భరోసా స్కీమ్ను కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. దీంతో కౌలు రైతులను గుర్తించడం సమస్యగా మారింది. ఈ క్రమంలో కౌలు చేస్తున్న రైతు ఇచ్చిన సమాచారం సరిపోదని, భూ యజమాని తన భూమిని ఫలాన రైతుకు కౌలుకు ఇచ్చినట్టు అఫడవిట్ సమర్పిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ అంశంపై జోరు చర్చలు జరుగుతున్నాయి.

News July 7, 2024

చౌటుప్పల్: చోరీకి వచ్చి పోలీసులకు దొరికారు

image

చోరీకి వెళ్లిన ఇద్దరు దొంగలు పోలీసులకు చిక్కిన ఘటన పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం జరిగింది. చౌటుప్పల్ సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాలు.. మల్కాజిగిరిలో నివాసముంటున్న పవన్ (24), MBNR జిల్లా జడ్చర్ల మండలం పెద్దఅడవిరాళ్లకు చెందిన బరిగల శివకుమార్(23)లు పాత నేరస్థులు. చౌటుప్పల్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా కత్తులతో దాడి చేసేందుకు యత్నించారు. విచారించగా చోరీ చేసేందుకు వెళ్తున్నట్లు ఒప్పుకున్నారు. 

News July 7, 2024

ALERT: TS-SET APPLYకి.. రేపటి వరకు గడువు

image

రాష్ట్రంలో యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే TS-SET 2024 పరీక్షకు MAY4న నోటిఫికేషన్ వెలుబడిన విషయం తెలిసిందే. MAY14న ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తు…JULY8 వరకు ఏలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
✓అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణుడై ఉండాలి
✓పరీక్ష: AUGUST28,29,30,31
✓www.telanganset.org

News July 7, 2024

భార్య మరణించిన పదిహేను రోజులకే భర్త మృతి

image

భార్య మరణించిన పదిహేను రోజులకే భర్త మృతి చెందిన సంఘటన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం జగ్యాతండాలో శనివారం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. తేజావత్ సంగ్యా(60), కౌసల్య దంపతులు. తీవ్ర అనారోగ్యానికి గురైన కౌసల్య చికిత్స పొందుతూ జూన్ 22న మృతి చెందింది. ఆమెను తలుచుకుంటూ నిత్యం మనోవేదనకు గురైన తేజావత్ సంగ్యా శనివారం మృతి చెందాడు.

News July 7, 2024

సంగారెడ్డి: నాటి పూర్వ విద్యార్థులే.. నేడు టీచర్లు

image

సంగారెడ్డి జిల్లా జోగిపేట బాలుర ఉన్నత పాఠశాల నాటి(పూర్వ) విద్యార్థులే నేడు టీచర్లు అయ్యారు. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మది మందికి ఆ ఛాన్స్ వచ్చింది. ఇటీవలి పదోన్నతులు, బదిలీల్లో వీరంతా జోగిపేటకు వచ్చారు. చిన్నప్పుడు చదువుకున్న బడిలోనే ఇప్పుడు పాఠాలు నేర్పే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఇలాంటి ఓ రోజు వస్తదని ఉహించలేదని టీచర్లు మాణయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్(PD), రమేశ్ కుమార్ అన్నారు.

News July 7, 2024

KNR: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఓవ్యక్తి మృతి చెందాడని కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాలు.. కేశవపట్నం మండలం గడ్డపాకకు చెందిన చిత్తారి రత్నం సుభాష్‌నగర్‌లో అద్దెకు ఉంటూ కరెంట్ పోల్స్‌ సబ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. అర్దరాత్రి అతడి నోట్లో నురుగులు రావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. మృతుడి సోదరుడు రాజు ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News July 7, 2024

ఆదిలాబాద్: పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జులై 7 వరకు గడువు ఉండగా ఈనెల 12 వరకు పొడగించినట్లు తెలిపారు. మీసేవ, TG ఆన్‌లైన్ సెంటర్‌లోనే ఫీజు చెల్లించాలన్నారు. PG రెండో సంవత్సర పరీక్షలు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు, PG మొదటి సంవత్సరం పరీక్షలు ఆగస్టు 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News July 7, 2024

వరంగల్: SI మరణ వార్త విని మేనత్త గుండెపోటుతో మృతి

image

ఆత్మహత్యాయత్నం చేసిన అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ మరణ వార్త విన్న ఆయన మేనత్త రాజమ్మ గుండెపోటుతో మృతి చెందింది. WGL జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన రాజమ్మకు ఆదివారం గుండెపోటు రాగా వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకే రోజున ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

News July 7, 2024

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు: డీకే అరుణ

image

జడ్చర్లలోని పెద్దగుట్టపై పురాతన శ్రీశ్రీశ్రీ రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేత ఘటనపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. అనుమతులు లేకుండా ఎలా కూల్చివేస్తారని జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులకు పోన్ చేసి ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.