Telangana

News July 7, 2024

పాలమూరులో 13కు పెరిగిన కాంగ్రెస్ బలం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే MLAలుగా గెలుపొందారు. గద్వాల, అలంపూర్ BRSకు చెందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు విజయం సాధించారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడంతో కాంగ్రెస్ బలం 13కు పెరగగా.. BRSకు బలం ఒకటికి పడిపోయింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి APలో గద్వాల కాంగ్రెస్‌కు కంచుకోట.

News July 7, 2024

ఖమ్మం: SI మరణ వార్త విని మేనత్త గుండెపోటుతో మృతి

image

సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త విని ఆమె మేనత్త రాజమ్మ కుప్ప కూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇద్దరు ఒకే రోజున మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

News July 7, 2024

ADB: ప్రియురాలి ఇంటికెళ్లి యువకుడి ఆత్మహత్యాయత్నం

image

ప్రియురాలి ఇంటికెళ్లి యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుడిహత్నూర్‌లో చోటుచేసుకుంది. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు అరుణ్ కాలనీకి చెందిన యువతని ప్రేమించాడు. యువతి కుటుంబీకులు వారి ప్రేమకు నిరాకరించడంతో శనివారం యువతి ఇంటికి వెళ్లి తనతో తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా యువకుడి పోలీసులు అదుపులోకి తీసుకొని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

News July 7, 2024

మునగాల వద్ద యాక్సిడెంట్ 

image

మునగాల సమీపంలో శనివారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటీపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా.. బాపట్లకు చెందిన వెంకటకృష్ణ, పవన్‌ స్కూటీపై వెళుతుండగా మునగాల మం. మాధవరం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. క్షతగాత్రుడు పవన్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు.

News July 7, 2024

PU: 15లోగా పీజీ పరీక్ష ఫీజు చెల్లించండి

image

పాలమూరు యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న పీజీ కశాశాల ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ 4వ సెమిస్టర్ పరీక్ష ఫీజును ఈనెల 15 వరకు చెల్లించాలని పీయూ పరీక్షల నిర్వహణ అధికారి డాక్టర్ రాజ్ కుమార్ శనివారం తెలిపారు. అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు కూడా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 15లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని అన్నారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

News July 7, 2024

నిధుల్లేక గ్రామ పంచాయతీల పరేషాన్!

image

ఖమ్మం జిల్లాలో 589, కొత్తగూడెం జిల్లాలో 481 జీపీలు ఉన్నాయి. ఐతే పారిశుద్ధ్యం నిర్వహణకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లు నేడు పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారాయి. డబ్బులు లేక ట్రాక్టర్లు కార్యాలయంలోనే ఉంచుతున్నారు. బయటకు తీస్తే డిజీల్ కు డబ్బులు కావాలి. పెట్టుబడులు పెట్టే వారు లేరు. ఇప్పటికే అందినకాడికల్లా అప్పులు తెచ్చి పెట్టిన పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం చేతులేత్తేశారు.

News July 7, 2024

పటాన్‌చెరు: ఐలాపూర్‌ మళ్లీ కబ్జాల కలకలం  !

image

వివాదాస్పద ఐలాపూర్‌ భూముల్లో మళ్లీ కబ్జాదారుల కదలికలు ప్రారంభమయ్యాయని స్థానికులు పేర్కొన్నారు. పటాన్‌చెరు నియోజవర్గం అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో కోర్టు వివాదంలో నలుగుతున్న భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పలు సర్వే నంబర్లలో నాట్‌ టు ఎంటర్‌ ఫియర్‌ పేరుతో కోర్టు డిగ్రీని చూపిస్తూ భూములను చదును చేస్తున్నారు.

News July 7, 2024

గద్వాల: బావిలో పడి బాలుడి దుర్మరణం

image

బావిలో పడి బాలుడు మృతిచెందిన ఘటన గద్వాల జిల్లాలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన మల్లేశ్‌(12) శనివారం తాతతో కలిసి గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లాడు. అక్కడ అన్నం తిని నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్లగా బాలుడు అందులో పడ్డాడు. అది గమనించని తాత.. చాలా సేపైనా బాలుడు రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లగా బావిలో పడినట్లు గుర్తించాడు. మృతదేహాన్ని ఇంటికి చేర్చి అంత్యక్రియలు చేశారు.

News July 7, 2024

ఖమ్మం: త్వరలో కొత్త రేషన్ కార్డులు!

image

కొత్త రేషన్ కార్డులు జారీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలో కొత్త కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆశావహుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీ-సేవా పోర్టల్ ఓపెన్ చేసి కొత్త దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.

News July 7, 2024

కొత్తగూడెం: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

image

తల్లి మందలించిందని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బట్టీల గుంపు గ్రామ పంచాయతీలోని పాయం జానకిరామ్ గుంపునకు చెందిన కోరం కృష్ణవేణి (23) అనే యువతి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. పొలంలో పనికి రాకపోవడంతో తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన యువతి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.