Telangana

News July 7, 2024

సింగరేణి కొలువులకు రాతపరీక్షలు

image

సింగరేణి సంస్థ మొత్తం 10 కేటగిరీల్లో 272 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ వెలువరించింది. ఇందులో భాగంగా ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్ ఏర్పాటు చేయనున్న కేంద్రాల్లో రాత పరీక్షలను నిర్వహించనున్నట్లు యాజమాన్యం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. హాజరయ్యే అభ్యర్థులు సింగరేణి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్‌లు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరింది.

News July 7, 2024

KRM: బాలుడు మృతి.. బంధువుల ఆందోళన

image

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇల్లంతకుంట మండలం వంతడుపులకి చెందిన అనిల్-శిరీష దంపతులు ఐదేళ్ల బాలుడు అయాన్ష్ జ్వరంతో బాధపడుతుండగా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు బాలుడికి ఇంజక్షన్ ఇవ్వడంతో మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు.

News July 7, 2024

నిజామాబాద్‌లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

image

నిజామాబాద్ జిల్లాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విత్తనాలు, వరి నాట్లు వేసిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ప్రమాదాల బారీన పడకుండా ఉండాలని హెచ్చరించారు.

News July 7, 2024

NLG: రైతు భరోసా.. మెజార్టీ రైతుల అభిప్రాయమిదే..!

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఆమలు చేయనున్న రైతు భరోసాను ఒక్కో రైతుకు 10 ఎకరాల వరకు పరిమితం చేయాలని జిల్లాలోని మెజారిటీ రైతులు అభిప్రాయపడ్డారు. ఒక రైతుకు అంతకుమించి భూమి ఉన్నా రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాదు వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా అమలు చేయాలని, రియల్ఎస్టేట్ వెంచర్లు, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

News July 7, 2024

ఖమ్మం: తల్లీకూతురిని కరిచిన పాము

image

తల్లీకూతురును పాము కరిచిన ఘటన నేలకొండపల్లి మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సుర్దేపల్లికి చెందిన రాధ(27), ఆమె కూతురు దీవెన (5) శుక్రవారం రాత్రి వరండాలో నేలపై నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో కట్ల పాము తొలుత కూతురు దీవెనను, తర్వాత రాధను కరించింది. చుట్టుపక్కల వారు వచ్చి పామును చంపారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు.

News July 7, 2024

కరీంనగర్: ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలులో విఫలం’

image

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా ఎన్నికల హామీలు పూర్తిగా అమలు కావడం లేదన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News July 7, 2024

ఉమ్మడి జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు

image

ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటివరకు పత్తి పంట ఒక్కటే అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తొలినాళ్లలోనే పత్తి పంట సాగుకు రైతులు ఉపక్రమించారు. జూన్ మాసాంతానికి ఖమ్మం జిల్లాలో 1,81,723 ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 1,88,263 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఈపంట సాగైందని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

News July 7, 2024

గడిచిన పదేళ్లలో కుంటుపడిన అభివృద్ధి!

image

రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువగా నష్టపోయింది భద్రాచలం పుణ్యక్షేత్రం. తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వరరామచంద్రాపురం , చింతూరు పూర్తిగా ఏపీలో కలిశాయి. భద్రాచలం మండలంలోని రెవెన్యూ గ్రామం మినహా మిగతా గ్రామాలు, బూర్గంపాడు మండలంలో కొన్ని గ్రామాలను ఏపీలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో గడిచిన పదేళ్లలో భద్రాచలం అభివృద్ధి కుంటుపడింది.

News July 7, 2024

కాగజ్‌నగర్‌లో పెద్దపులి సంచారం

image

కాగజ్‌నగర్ అటవీ రేంజ్‌లో పెద్దపులి సంచరిస్తున్నట్లు FRO రమాదేవి తెలిపారు. పట్టణ సమీప గ్రామాలైన అంకుసాపూర్, నందిగూడ, నార్లపూర్, గొంది, చారిగాం, కోసిని, రేగులగూడ, ఊట్పల్లి, వేంపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. పులి కదలికలు, పాదముద్రలు వంటివి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

News July 7, 2024

ములుగు: పాముకాటుతో పదేళ్ళ బాలిక మృతి

image

పాము కాటుతో బాలిక మృతి చెందిన ఘటన వెంకటాపురం మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. శాంతినగర్ గ్రామానికి చెందిన తాటి కావ్యశ్రీ(10) అనే బాలిక శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న క్రమంలో పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిందని తెలిపారు.