Telangana

News July 7, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా విజృంభిస్తున్న విషజ్వరాలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. విషజ్వరాలతో జనం మంచం బారిన పడుతున్నారు. వర్షాకాలానికి తోడు వాతావరణ మార్పులతో అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి. రోగులతో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. అయితే ఈ సమయంలో జనం ఇష్టం వచ్చినట్లు సొంత వైద్యం చేసుకోకుండా క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

News July 7, 2024

మెదక్: భావి శాస్త్రవేత్తలకు ఆహ్వానం

image

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్‌స్పైర్‌-మానక్‌’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. దీంట్లో భాగంగా ఏటా దేశవ్యాప్తంగా 5 లక్షల పాఠశాలలను ఎంపిక చేసి ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. 2024-25 సంవత్సరానికి ప్రతిపాదనలను సెప్టెంబర్‌ 15లోగా వెబ్‌సైట్‌ పంపించాల్సి ఉంది.

News July 7, 2024

సింగపూర్‌లో కోదాడ యువకుడి అనుమానాస్పద మృతి

image

కోదాడకి చెందిన చౌడవరపు పవన్ అనే యువకుడు సింగపూర్ బీచ్‌లో శనివారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. కోదాడలో ఉన్న తల్లిదండ్రులు పవన్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. యువకుడి తండ్రి శ్రీనివాసరావు కోదాడలో నూనె వ్యాపారం చేస్తున్నారు. రెండు నెలల్లో రెండో కుమారుడు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. 

News July 7, 2024

నల్లమలలో జంతువుల వృద్ధి..

image

నల్లమలలో రెండేళ్లలో జంతువులు గణనీయంగా వృద్ధి చెందినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో అచ్చంపేట, అమ్రాబాద్, సాగర్‌ డివిజన్లున్నాయి. ఇటీవల సాగర్‌‌లో పెద్దపులి, అరుదైన జాతి రాబందు కనిపించగా సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో దుప్పులు, జింకల ఆవాసాలకే పరిమితమైన అడవిలో తాజాగా శాకాహార, మాంసహార జంతువుల సంఖ్య పెరిగింది. దక్షిణాదిలోనే అరుదైన ఎలుగుబంట్లు గుర్తించారు.

News July 7, 2024

NLG: అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

image

తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ కోసం ప్రతి పౌర్ణమికి ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎం రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెల పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. అరుణాచలం వెళ్లే భక్తులకు ఏపీలోని కాణిపాకం, తమిళనాడు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుందన్నారు.

News July 7, 2024

HYD: రూ.100 కోసం హత్య

image

వ్యక్తిని రాయితో కొట్టి హత్య చేసిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు వివరాలు.. వెంకట్రామిరెడ్డి నగర్ కాలనీకి చెందిన పోచయ్య(45)వద్ద మధ్యప్రదేశ్‌కి చెందిన ధర్మేంద్ర పని చేస్తున్నాడు. అతడికి పోచయ్య రూ.100 ఇవ్వాల్సి ఉండగా అడిగాడు. పోచయ్య డబ్బులు ఇవ్వకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తుమ్మ చెరువు సమీపంలో లేబర్ అడ్డా వద్ద పోచయ్యను ధర్మేంద్ర రాయితో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదైంది.

News July 7, 2024

ఆర్టీసీ కార్మికులపై మోయలేని భారం!

image

సురక్షిత ప్రయాణానికి మారుపేరైన ఆర్టీసీ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే కార్మికులపై మోయలేని భారం పడుతోంది. చాలీచాలని వేతనాలు, అధికారుల వేధింపులు, పాత బస్సులు, డబుల్ డ్యూటీలు, పని ఒత్తిడితో అలసటకు గురవుతున్న కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోడ్డుపై ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది.

News July 7, 2024

HYD: రూ.100 కోసం హత్య

image

వ్యక్తిని రాయితో కొట్టి హత్య చేసిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు వివరాలు.. వెంకట్రామిరెడ్డి నగర్ కాలనీకి చెందిన పోచయ్య(45)వద్ద మధ్యప్రదేశ్‌కి చెందిన ధర్మేంద్ర పని చేస్తున్నాడు. అతడికి పోచయ్య రూ.100 ఇవ్వాల్సి ఉండగా అడిగాడు. పోచయ్య డబ్బులు ఇవ్వకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తుమ్మ చెరువు సమీపంలో లేబర్ అడ్డా వద్ద పోచయ్యను ధర్మేంద్ర రాయితో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదైంది.

News July 7, 2024

NLG: ఆగస్టు 4న టీటీసీ పరీక్షలు

image

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ థియరీ పరీక్షలు ఆగస్టు 4న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. ఆగస్టు 4న ఆదివారం ఎడ్యుకేషనల్ సైకాలజీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్ పరీక్ష 3.30 నుంచి 4:30 వరకు జరుగుతాయని తెలిపారు.

News July 7, 2024

నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఆషాఢం బోనాలు

image

ఉమ్మడి కరీంగనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి బోనాల సందడి ప్రారంభం కానుంది. వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు హోరెత్తనున్నాయి. నగునూరు దుర్గ భవాని ఆలయం, రామేశ్వర ఆలయం, మహా శక్తి ఆలయంలో ప్రత్యేక పూజలతో బోనాల వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతి ఆషాఢ మాసంలో కుర్మ కులస్థులు పోచమ్మకు బోనాలు సమర్పిస్తుంటారు. డివిజన్ల వారీగా బోనాల పండగను జిల్లా ప్రజలు కలిసికట్టుగా చేసుకుంటారు.