Telangana

News July 7, 2024

కామారెడ్డి: భార్య కాపురానికి రావడం లేదని వ్యక్తి ఆత్మహత్య

image

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బిచ్కుందకి చెందిన కుమ్మరి సాయిలు (30) భార్య కొన్ని రోజుల నుంచి కాపురానికి రావడంలేదు. దీంతో జీవితంపై విరక్తితో బిచ్కుంద శివారులోని గిద్దే చెరువులో దూకి సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఎస్ఐ మోహన్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News July 7, 2024

KNR: ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం పరీక్ష ఫలితాలు విడుదల

image

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరిగిన ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు యూనివర్సిటీ అధికారులు శనివారం విడుదల చేశారు. గత జూన్ నెలలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెబ్ సైట్ https://satavahana.ac.inలో అందుబాటులో ఉంచామని లేదా సమాచారం కోసం యూనివర్సిటీని సంప్రదించాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డా.శ్రీరంగ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

News July 7, 2024

NGKL: స్పోర్ట్స్ స్కూల్లో ఎంపికైన వారు ఇవి తీసుకెళ్లండి !

image

క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు ఈనెల 11,12న HYDలోని హకీం పేటలోని స్పోర్ట్స్ స్కూల్లో హాజరుకావాలని డీవైఎస్ఓ సీతారాం తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా నుంచి 26 మంది ఎంపికయ్యారని, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రం, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్టు, కమ్యూనిటీ సర్టిఫికెట్, 10 పాస్ ఫొటోలు, రెండు జిరాక్స్ కాపీలను వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు.

News July 7, 2024

సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల లేఖ

image

సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ శనివారం రాశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రాసిన సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిగణనలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ సిఫార్సు లేఖలపై నేడు జరగనున్న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ప్రస్తావించాలని లేఖలో పేర్కొన్నారు.

News July 7, 2024

గోల్కొండ కోటకు 75 ప్రత్యేక బస్సులు

image

నేటి నుంచి చారిత్రక గోల్కొండ జగదాంబిక బోనాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 75 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. హైదరాబాద్‌లోని 24 ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు తిప్పనుంది. సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్, సీబీఎస్‌, పటాన్‌ చెరు, ఈసీఐఎల్‌, మెహిదీపట్నం, దిల్‌‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి గోల్కొండ కోట వరకు నడుస్తాయి.

News July 7, 2024

గోల్కొండ కోటకు 75 ప్రత్యేక బస్సులు

image

నేటి నుంచి చారిత్రక గోల్కొండ జగదాంబిక బోనాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 75 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. హైదరాబాద్‌లోని 24 ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు తిప్పనుంది. సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్, సీబీఎస్‌, పటాన్‌ చెరు, ఈసీఐఎల్‌, మెహిదీపట్నం, దిల్‌‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి గోల్కొండ కోట వరకు నడుస్తాయి.

News July 7, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆] డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఇల్లెందులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మంలో ఎంపీ RRR పర్యటన
∆} మణుగూరులో సింగరేణి కార్మికుల నిరాహార దీక్ష
∆} ఖమ్మంలో మాల మహానాడు సమావేశం

News July 7, 2024

కాంగ్రెస్‌లోకి గద్వాల MLA.. చర్చనీయాంశంగా సరిత నిర్ణయం !

image

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్లపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన మాజీ ZP ఛైర్‌పర్సన్ సరిత ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ నేతలు సైతం ఇటీవల గాంధీ భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది జిల్లాలో చర్చనీయాంశమైంది.

News July 7, 2024

ఖమ్మం: ఫోన్ ధర డబ్బులు చెల్లించాల్సిందే!

image

భద్రాద్రి జిల్లా రామవరానికి చెందిన మహబూబ్ అలీ 2022లో ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్  రూ.18,298 చెల్లించి బుక్ చేసుకున్నాడు. ఆర్డర్ రాగా దానిని ఓపెన్ చేస్తే చార్జర్, పౌచ్ మాత్రమే ఉండటంతో ఆన్లైన్ కంపెనీకి ఫోన్ చేశాడు. వారి నుంచి స్పందన రాకపోవడంతో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు నివేదించాడు. పరిశీలించిన కమిషన్ కంపెనీ నిర్లక్ష్యం ఉందని నిర్ధారించి ఫోన్ ధర చెల్లించాలని తీర్పునిచ్చారు.

News July 7, 2024

సిద్దిపేట: PM కిసాన్‌ పేరుతో వచ్చే లింక్‌ ఓపెన్ చేయొద్దు: APO

image

వాట్సాప్‌లో PM కిసాన్‌ పేరుతో వచ్చిన లింక్‌ కలకలం సృష్టిస్తోంది. హుస్నాబాద్‌ ఉపాధి హామీ APOపద్మ వాట్సాప్‌లో నుంచి PM కిసాన్‌ 1.0 ENAPK పేరుతో గ్రూపుల్లో పోస్టు వచ్చింది. కొందరు వెంటనే APOకు కాల్ చేయగా తన ఫోన్ హ్యాక్‌ అయిందని, లింక్‌ క్లిక్ చేయొద్దని చెప్పారు. 2రోజుల క్రితం వాట్సాప్‌కు వచ్చిన ఈ లింక్‌ ఓపెన్‌ చేయగా ఫోన్ హ్యాక్‌ చేశారు. తనకు తెలియకుండానే గ్రూప్, నంబర్లకు లింక్‌ వెళ్తుందన్నారు.