Telangana

News July 7, 2024

HYD: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ప్రత్యేక బస్సులు

image

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు గ్రేటర్ RTC శనివారం ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9న 18 డిపోల నుంచి 80 బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, JBS, MGBS, CBS, ECIL క్రాస్ రోడ్స్, మెహదీపట్నం, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, మియాపూర్ క్రాస్ రోడ్స్, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి ఇవి బయలుదేరుతాయన్నారు.

News July 7, 2024

ఆదిలాబాద్: కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు

image

ఆదిలాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. విద్యాలయంలో సంగీతం/నృత్యం, టీజీటీ సంస్కృతం, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ విభాగాల్లో 4 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 15న ఉదయం నిర్వహించే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జిరాక్స్ సెట్‌తో హాజరుకావాలని సూచించారు.

News July 7, 2024

HYD: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ప్రత్యేక బస్సులు

image

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు గ్రేటర్ RTC శనివారం ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9న 18 డిపోల నుంచి 80 బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, JBS, MGBS, CBS, ECIL క్రాస్ రోడ్స్, మెహదీపట్నం, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, మియాపూర్ క్రాస్ రోడ్స్, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి ఇవి బయలుదేరుతాయన్నారు.

News July 7, 2024

జనగామ: స్వాతంత్ర్య సమరయోధుడు ఎర్రయ్య మృతి

image

జనగామ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఎర్రయ్య(96) శనివారం ఉదయం మృతి చెందారు. దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన ఎర్రయ్య.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. తొలి గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచిగా ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత మరో రెండు సార్లు సర్పంచిగా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

News July 7, 2024

HYD: పూర్తిగా డిజిటలైజేషన్ దిశగా GHMC

image

గ్రేటర్ HYD నగరంలో వివిధ పన్నులకు సంబంధించి పూర్తి డిజిటలైజేషన్ దిశగా GHMC అడుగులు వేస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపునకు నగదును స్వీకరించమని గతంలోనే కమిషనర్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ నిబంధన అమల్లోకి వచ్చాయి. యూపీఐ, క్యూఆర్ కోడ్, క్రెడిట్ ఇతర మార్గాల్లో డిజిటల్ చెల్లింపులు చేయాల్సి ఉంది. దీని ద్వారా అక్రమ వసూళ్లకు తెరపడనుంది.

HYD: అక్రమ నల్లా కనెక్షన్లకు యాప్ ద్వారా CHECK

image

HYDలో తాగు, మురుగు నీటి అక్రమ కనెక్షన్లకు చెక్ పెట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలో నూతన యాప్ ద్వారా ఇన్‌స్పెక్షన్ మొదలుపెట్టారు. ఆయా ప్రాంతానికి వెళ్లి యాప్‌లో చెక్ చేస్తే అనుమతి పొందిన కనెక్షన్ల వివరాలు చూపిస్తుంది. యాప్‌లో చూపించని కనెక్షన్లు అక్రమం అని తేలిపోనుంది. అక్రమ కనెక్షన్ల ద్వారా జలమండలికి తీవ్ర నష్టం జరుగుతోందని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

News July 7, 2024

HYD: జులై 8 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ!

image

HYD ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కోటా కింద జులై 8 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈస్ట్ మారేడుపల్లిలోని ఏఓసీ సెంటర్ హెడ్ క్వార్టర్స్, tuskercrc-202@gov.in, www.joinindianarmy@nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

News July 7, 2024

HYD: అక్రమ నల్లా కనెక్షన్లకు యాప్ ద్వారా CHECK

image

HYDలో తాగు, మురుగు నీటి అక్రమ కనెక్షన్లకు చెక్ పెట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలో నూతన యాప్ ద్వారా ఇన్‌స్పెక్షన్ మొదలుపెట్టారు. ఆయా ప్రాంతానికి వెళ్లి యాప్‌లో చెక్ చేస్తే అనుమతి పొందిన కనెక్షన్ల వివరాలు చూపిస్తుంది. యాప్‌లో చూపించని కనెక్షన్లు అక్రమం అని తేలిపోనుంది. అక్రమ కనెక్షన్ల ద్వారా జలమండలికి తీవ్ర నష్టం జరుగుతోందని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

News July 7, 2024

HYD: జులై 8 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ!

image

HYD ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కోటా కింద జులై 8 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈస్ట్ మారేడుపల్లిలోని ఏఓసీ సెంటర్ హెడ్ క్వార్టర్స్, tuskercrc-202 @gov.in, www.joinindianarmy@nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.