Telangana

News July 6, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

హైదరాబాద్‌ శివారులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ PS పరిధిలో బైక్‌పై వెళుతున్న దంపతులను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

ఏపీ సీఎంని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న చారిత్రాత్మక సమావేశంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి అనువైన సమావేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

News July 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాలు
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
@ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే.
@ కాలేశ్వరంలో భక్తుల రద్దీ.
@ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సిరిసిల్ల కలెక్టర్.
@ బీర్పూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ.

News July 6, 2024

మంథని: చంద్రబాబును కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న చారిత్రాత్మిక సమావేశంలో మంథని ఎమ్మెల్యే, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు పాల్గొన్నారు.

News July 6, 2024

KMR: చిన్నారి విక్రయం.. ఇద్దరు డాక్టర్లతో సహా పలువురి అరెస్ట్

image

ఓ చిన్నారిని విక్రయించిన కేసులో ఇద్దరు డాక్టర్లతో పాటు పలువురిని శనివారం అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తండ్రి కొడుకులైన ఇట్టం సిద్దిరాములు, ఇట్టం ప్రవీణ్ కుమార్‌తో పాటు ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, ఆస్పత్రి వాచ్మెన్ బాలరాజు, పాప తల్లి లావణ్య, బాలకిషన్, దేవయ్య, భూపతిని అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు.

News July 6, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✒BRSకు షాక్.. కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే
✒ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
✒పార్టీ మారిన MLAలు రాజీనామా చేయాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
✒GDWL,NRPTలో రేపు భారీ వర్షాలు
✒పలుచోట్ల జగ్జీవన్‌రామ్ వర్ధంతి వేడుకలు
✒వనపర్తి: GO10 రద్దుచేయాలని అంగన్వాడీల రిలే నిరాహారదీక్షలు
✒సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి:SPలు
✒వన మహోత్సవంపై అధికారుల ప్రత్యేక ఫోకస్

News July 6, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల దంచి కొడుతున్న వర్షం

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. ప్రయాణికులు, వాహనదారులు కాస్త ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు వర్ష సూచనలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. మీ మండలంలో వర్షం పడిందా.. కామెంట్ చేయండి.

News July 6, 2024

రామగుండంలో ఒకరు సస్పెండ్.. మరొకరు సరెండర్

image

అనుమతి లేకుండా దీర్ఘ కాలంగా విధులకు గైర్హాజరవుతున్న రామగుండం కార్పొరేషన్ బిల్ కలెక్టర్ సతీశ్‌ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ శ్రీ హర్ష నేడు ఉత్తర్వులు జారీ చేశారు. పారిశుద్ధ్య పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్న శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. రామగుండం MLA రాజ్ ఠాకూర్ శానిటేషన్ అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

News July 6, 2024

గరిడేపల్లి: పోలీస్ స్టేషన్ నుంచి దొంగ పరార్

image

గరిడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి శనివారం ఓ దొంగ పరారైయ్యాడు. వ్యవసాయ మోటార్ల చోరీ కేసులో అదుపులోకి తీసుకోని విచారిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా పరారైనట్టు తెలుస్తోంది. కేసులో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచారు. పరారీ అయిన అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఎస్పీ సీరియస్ అయినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 6, 2024

బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ

image

బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి పట్ల తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఆరాధనకు, తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక తత్వానికి బోనాల ఉత్సవాలు నిదర్శనంగా నిలుస్తాయని మంత్రి చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, వైభవాన్ని బోనాలు జగద్వితం చేశాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు.