Telangana

News July 6, 2024

బండి సంజయ్ కుమార్ రేపటి షెడ్యూల్

image

రేపటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ షెడ్యూల్ కింది విధంగా ఉంది.
✓రేపు ఉదయం కరీంనగర్‌కు చేరుకుంటారు. ✓8:30 గంటలకు మహాశక్తి ఆలయాన్ని సందర్శిస్తారు.
✓11:30 గంటలకు ప్రభుత్వ అధికారులతో సమావేశం.
✓మధ్యాహ్నం 2 నుంచి కరీంనగర్ పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
✓సాయంత్రం 7 గంటలకు ఎంపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.

News July 6, 2024

ఆర్టీసీ బస్సులో డెలివరీ.. బర్త్ సర్టిఫికెట్ ఇచ్చిన GHMC

image

HYD ఆరాంఘర్ 1z నంబర్ బస్‌లో ప్రసవించిన శ్వేతను GHMC అధికారులు శనివారం కలిశారు. డెలివరీ అయిన ఏరియాకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేసి బర్త్ సర్టిఫికెట్‌‌‌‌‌ను‌ జారీ చేయించారు. భవిష్యత్తులో జనన ధృవీకరణ పత్రం కోసం ఎటువంటి ఇబ్బందులు రాకుండా GHMC అధికారులు చొరవ చూపి‌ స్వయంగా ఆమెకు అందజేయడం విశేషం.

News July 6, 2024

ఆర్టీసీ బస్సులో డెలివరీ.. బర్త్ సర్టిఫికెట్ ఇచ్చిన GHMC

image

HYD ఆరాంఘర్ 1z నంబర్ బస్‌లో ప్రసవించిన శ్వేతను GHMC అధికారులు శనివారం కలిశారు. డెలివరీ అయిన ఏరియాకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేసి బర్త్ సర్టిఫికెట్‌‌‌‌‌ను‌ జారీ చేయించారు. భవిష్యత్తులో జనన ధృవీకరణ పత్రం కోసం ఎటువంటి ఇబ్బందులు రాకుండా GHMC అధికారులు చొరవ చూపి‌ స్వయంగా ఆమెకు అందజేయడం విశేషం.

News July 6, 2024

BREAKING.. WGL: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

image

కేయూ పరిధిలో డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. MAY నెలలో 2, 4, 6 సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. శనివారం ఆరవ సెమిస్టర్ ఫలితాలను KU అధికారులు విడుదల చేయగా 2, 4వ సెమిస్టర్ ఫలితాలు మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసంhttps://www.kuonline.co.in/Result/RS_6TH_MAY2024.aspx ఈ లింక్‌ను క్లిక్ చేయాలని సూచించారు. ఈనెల 22 వరకు రివాల్యుయేషన్‌కు అవకాశం కల్పించారు.

News July 6, 2024

BREAKING: ADB: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

image

కేయూ పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. MAY నెలలో 2, 4, 6 సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. శనివారం ఆరో సెమిస్టర్ ఫలితాలను KU అధికారులు విడుదల చేయగా 2, 4వ సెమిస్టర్ ఫలితాలు మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం
https://www.kuonline.co.in/Result/RS_6TH_MAY2024.aspx లింక్‌ను క్లిక్ చేయాలని సూచించారు. ఈనెల 22 వరకు రివాల్యుయేషన్ కు అవకాశం కల్పించింది.

News July 6, 2024

HYD: ‘గంజాయి కేసుతో ఉస్మానియాకు సంబంధం లేదు’

image

గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబడిన మెడికోలకు ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.  గంజాయి కేసులో పట్టుబడిన డాక్టర్ మణికందన్, డాక్టర్ అరవింద్ గతంలో ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివిన వారు మాత్రమేనని అన్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని పేర్కొన్నారు.

News July 6, 2024

అశ్వరావుపేట CIపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

image

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం ఘటనలో అక్కడి CI జితేందర్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్ఐ సతీమణి కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. కాగా ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News July 6, 2024

ఉమ్మడి KNR జిల్లాలో డెంగ్యూ

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి కలకలం రేపుతోంది. వర్షాకాలం కావడంతో దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఇద్దరికి డెంగ్యూ సోకిందని వైద్యులు తెలిపారు. గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి, రాజిరెడ్డి అనే తండ్రి కొడుకులు డెంగ్యూ వ్యాధితో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగు రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు.

News July 6, 2024

సంగారెడ్డి: వనమహోత్సవ లక్ష్య సాధనకు కృషిచేయాలి: కలెక్టర్

image

జిల్లాలో వన మహోత్సవ లక్ష్యసాధనకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 35.88 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ జ్యోతి, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

News July 6, 2024

HYD: రేపటి నుంచి బోనాలు.. గుడిలో అధ్వాన పరిస్థితి!

image

ఫిలింనగర్‌లోని బసవతారకనగర్‌ బస్తీలో‌ ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు అమ్మవారి ఆలయ ప్రహరీ కూలిపోయింది. వరదలకు నిర్మాణంలో ఉన్న రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. కనీసం మరమ్మతులు కూడా చేయలేదని‌ స్థానికులు వాపోతున్నారు. రేపటి నుంచి నగరంలో బోనాలు మొదలుకానున్నాయి. ఇలా అయితే పండుగ ఎలా జరుపుకోవాలని బస్తీ వాసులు నిలదీస్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.