Telangana

News September 20, 2024

HCU నుంచి 29 మంది అత్యుత్తమ ప్రొఫెసర్లు

image

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ అధ్యాపకుల జాబితాలో 29 మంది HCU ప్రొఫెసర్లు చోటు దక్కించుకున్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఐయోనిడిస్ ఇటీవల గ్లోబల్ బెస్ట్ ప్రొఫెసర్ల వివరాలను వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయి అధ్యాపకులలో HCU నుంచి 29 ప్రొఫెసర్లు ఉండటం విశేషం. దీనిపై వర్సిటీ వీసీ హర్షం వ్యక్తం చేశారు.

News September 20, 2024

NZB: ప్రేమకు నిరాకరించిన యువతి.. యువకుడు ఆత్మహత్య

image

యువతీ ప్రేమకు నిరాకరించిందని యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనా ఖానాపూర్ శివారులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే గౌతమ్ కాంబ్లె (26) ఓ యువతిని ప్రేమించాడు. ఇందుకు యువతి నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఖానాపూర్ శివారులో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. స్థానికులు నిజామాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 20, 2024

HYD: నేటి నుంచి గచ్చిబౌలి ఫ్లైఓవర్ మూసివేత

image

గచ్చిబౌలి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి ఈనెల 26 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్‌లో SRDP శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు, వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

News September 20, 2024

రూ. 4.60 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ

image

భారీ గణనాథుడి లడ్డుకు రికార్డు ధర పలికింది. గురువారం రాత్రి ఆత్మకూరు పట్టణంలోని బీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహా వినాయకుడి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వేలంపాటలో గణేశుడి చేతిలోని లడ్డు ప్రసాదాన్ని మాజీ వార్డు సభ్యులు గడ్డమీది శ్రీనివాసులు రూ. 4.60 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం వేలాది మంది భక్తులు ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.

News September 20, 2024

బోథ్: రూ.81 వేల ధర పలికిన గణేశ్‌ లడ్డూ

image

బోథ్ మండల కేంద్రంలోని చైతన్య యూత్ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో గణేశ్‌ను ఏర్పాటు చేశారు. నిత్యం భక్తిశ్రద్ధలతో వినాయకుడిని కొలిచారు. కాగా గురువారం రాత్రి లడ్డూ వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంలో చివరగా రూ.81 వేలకు మండల కేంద్రానికి చెందిన ఇట్టెడి చిన్నారెడ్డి దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మండలి కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీకాంత్, మహేందర్ ఉన్నారు.

News September 20, 2024

మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగింది: మంత్రి పొంగులేటి

image

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పేరుతో భారీ అవినీతి జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. భగీరథలో జరిగిన అవినీతి గురించి ప్రజలకు తేలియాజేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 53 శాతం మంది ప్రజలకు మంచినీరు అందలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందరికి మంచినీరు అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

News September 20, 2024

జగిత్యాల: వరి ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష

image

రాబోయే ఖరీఫ్ 2024-25 వరిధాన్యం కొనుగోలుకు సంభందించి వివిధ శాఖల అధికారులతో గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. మద్దతు ధర క్వింటాకు గ్రేడ్ ఏ రకానికి రూ.2,320, కామన్ రకానికి రూ.2,300 ధర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా ప్యాడి క్లీనింగ్ మిషన్స్, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. టోకెన్ పద్ధతి పాటించాలని సూచించారు.

News September 20, 2024

మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేత

image

రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో సింథటిక్ శాలువాలు వాడకుండా చేనేత శాలువాలు, చేనేత బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. అనంతరం దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి కొండా సురేఖతో నేతలు చర్చించారు.

News September 20, 2024

ADB: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను గురువారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిష్టర్, రికార్డులను పరిశీలించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.

News September 20, 2024

TU: ఎంఎడ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఎంఎడ్ 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈనెల 28 నుంచి అక్టోబర్ 3 వరకు పరీక్షలు కొనసాగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం.అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్‌ను సంప్రందించాలని సూచించారు.