Telangana

News July 6, 2024

HYD: రేపటి నుంచి బోనాలు.. గుడిలో అధ్వాన పరిస్థితి! 

image

ఫిలింనగర్‌లోని బసవతారకనగర్‌ బస్తీలో‌ ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు అమ్మవారి ఆలయ ప్రహరీ కూలిపోయింది. వరదలకు నిర్మాణంలో ఉన్న రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. కనీసం మరమ్మతులు కూడా చేయలేదని‌ స్థానికులు వాపోతున్నారు. రేపటి నుంచి నగరంలో బోనాలు మొదలుకానున్నాయి. ఇలా అయితే పండుగ ఎలా జరుపుకోవాలని బస్తీ వాసులు నిలదీస్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News July 6, 2024

NZB: జీజీ‌హెచ్‌ను సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్

image

రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ శనివారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)ను సందర్శించారు. ఆయన ఆస్పత్రిలోని పలు వార్డులను సందర్శించి తగిన సూచనలు అందజేశారు. కాగా ఆసుపత్రికి కావలసిన అవసరాల గురించి GGH సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ కర్ణన్ దృష్టికి తీసుకెళ్లారు, దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.

News July 6, 2024

బొమ్మల గుడిలో అమ్మవారికి లక్ష పూలతో పుష్పార్చన

image

గుప్త నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా కరీమాబాద్ బొమ్మల గుడిలో అమ్మవారికి మొదటి రోజు లక్ష పూలతో పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బారులు తీరారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News July 6, 2024

జుక్కల్ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్

image

జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం ఓ ప్రకటనలో తెలిపారు

News July 6, 2024

HYD: మంత్రిని కలిసిన BRS ఎమ్మెల్యేలు

image

గ్రేటర్ HYD, మేడ్చల్ జిల్లా పరిధి BRS ఎమ్మెల్యేలు‌ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని శనివారం కలిశారు. పలు సమస్యలపై వినతి పత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు‌ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానంద, ఉప్పల్ MLA లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి MLA రాజశేఖర్ రెడ్డి, కూకట్‌పల్లి MLA కృష్ణారావు, శేరిలింగంపల్లి MLA అరికెపూడి గాంధీ మంత్రి సమావేశం అయ్యారు.

News July 6, 2024

HYD: మంత్రిని కలిసిన BRS ఎమ్మెల్యేలు

image

గ్రేటర్ HYD, మేడ్చల్ జిల్లా పరిధి BRS ఎమ్మెల్యేలు‌ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని శనివారం కలిశారు. పలు సమస్యలపై వినతి పత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు‌ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానంద, ఉప్పల్ MLA లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి MLA రాజశేఖర్ రెడ్డి, కూకట్‌పల్లి MLA కృష్ణారావు, శేరిలింగంపల్లి MLA అరికెపూడి గాంధీ మంత్రి సమావేశం అయ్యారు.

News July 6, 2024

GDWL,NRPTలో నేడు, రేపు భారీ వర్షాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తున్నాయని శనివారం హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గత రెండు రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News July 6, 2024

ఆదిలాబాద్: నిజాయితీ చాటుకున్న యువకుడు

image

పోగొట్టుకున్న పర్సును అందజేసి ఓ యువకుడు నిజాయితీ చాటుకున్నాడు. నేరడిగొండకు చెందిన చిప్పరి రాజేశ్వర్ అనే యువకుడు శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ రిమ్స్‌లో పర్సు పోగొట్టుకున్నాడు. సాహిల్ ససానే అనే యువకుడికి పర్సు దొరికింది. ఐడీ, ఆధార్ కార్డులతో పాటు దాదాపు రూ.5 వేల నగదు ఉంది. గుర్తింపుకార్డు ఆధారంగా బాధితుడిని గుర్తించి టైగర్‌ గ్రూప్‌ అధ్యక్షుడు జాదవ్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో శనివారం అందజేశారు.

News July 6, 2024

HYD: రాత్రి బస్సులు నడపాలని డిమాండ్

image

నగరంలో రాత్రి సమయంలోనూ ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. JBS, MGBS, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వందల కొద్ది రూపాయలు ఖర్చు చేసి వెళ్లాల్సి వస్తోంది. దీంతో సికింద్రాబాద్ నుంచి బోరబండ, కొండాపూర్, కోఠి, ఉప్పల్, కూకట్‌పల్లి ప్రాంతాలకు నైట్ RTC సర్వీసులు నడపాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

News July 6, 2024

HYD: ఆర్టీసీ బస్సులో పుట్టిన పాపకు బర్త్ సర్టిఫికెట్

image

ఆరాంఘర్ 1z నంబర్ బస్‌లో ప్రసవించిన మహిళ శ్వేతను ఆర్టీసీ అధికారులు శనివారం కలిశారు. డెలివరీ అయిన ఏరియా సంబంధిత అధికారులతో మాట్లాడారు బర్త్ సర్టిఫికేట్‌ను జారీ చేసి ఆమెకు అందజేశారు. కాగా, పురిటి నొప్పులతో బస్సులో బాధపడుతున్న మహిళకు మహిళా కండక్టర్, ప్రయాణికుల సహాయంతో డెలివరీ చేశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది.