Telangana

News July 6, 2024

ఆదిలాబాద్: రేషన్ కార్డుల కోసం అర్హుల ఎదురుచూపులు

image

ఆహారభద్రత కార్డుల్లో అనర్హులను గుర్తించి తొలగిస్తున్న ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేస్తోంది. మూడేళ్లుగా రేషన్‌కార్డుల దరఖాస్తులకు సంబంధించిన వెబ్సైట్ మూసివేసింది. ఫలితంగా కార్డుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ADB జిల్లాలో 5 నెలల వ్యవధిలో 89 కార్డులు రద్దుచేయగా , 664 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు. కార్డుల్లేని నిరుపేదలు ప్రభుత్వపథకాలు పొందలేని పరిస్థితి నెలకొంది.

News July 6, 2024

సీఎంను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే!

image

సీఎం రేవంత్ రెడ్డిని జగిత్యాల MLA డా.సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
తన జన్మదినం సందర్భంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో వారి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. జగిత్యాల సమగ్ర అభివృద్దికి సహకరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు జగిత్యాల ప్రజల పక్షాన సీఎంకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

News July 6, 2024

డబ్బులు తీసుకోవడం మర్చిపోతే కాల్ చేయండి: RM సరిరామ్

image

ఆర్టీసీ బస్సులో కండక్టర్ టికెట్ వెనుక రాసే డబ్బులు మర్చిపోతే తిరిగి పొందొచ్చని ఖమ్మం RM సరిరామ్ అన్నారు. TGSRTC హెల్ప్ లైన్ నంబర్ 040-69440000 కాల్ చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పారు. కాల్ చేసి టికెట్ మీద ఉన్న కండక్టర్ ఎంప్లాయ్ నంబర్ చెప్తే అతని కాంటాక్ట్ నంబర్ ఇస్తామని, దీంతో ఆ డబ్బులు రికవర్ చేసుకోవచ్చని తెలిపారు.

News July 6, 2024

HYD: ఆర్టీసీ బస్సులో పుట్టిన పాపకు బర్త్ సర్టిఫికెట్

image

ఆరాంఘర్ 1z నంబర్ బస్‌లో ప్రసవించిన మహిళ శ్వేతను ఆర్టీసీ అధికారులు శనివారం కలిశారు. డెలివరీ అయిన ఏరియా సంబంధిత అధికారులతో మాట్లాడారు బర్త్ సర్టిఫికేట్‌ను జారీ చేసి ఆమెకు అందజేశారు. కాగా, పురిటి నొప్పులతో బస్సులో బాధపడుతున్న మహిళకు మహిళా కండక్టర్, ప్రయాణికుల సహాయంతో డెలివరీ చేశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది.

News July 6, 2024

HYD: న్యాయ పట్టభద్రులకు నేడే లాస్ట్ ఛాన్స్..!

image

HYD జిల్లాలోని షెడ్యూల్ కులాలకు చెందిన న్యాయ పట్టభద్రులకు మూడేళ్లపాటు ఉచిత నైపుణ్య శిక్షణ అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ యాదయ్య తెలిపారు. శిక్షణ పొందేవారికి నెలకు రూ.3 వేల స్టైఫండ్, రూ.50 వేల డిజిటల్ బుక్స్, ఫర్నిచర్, కంప్యూటర్, డ్రెస్ ఇస్తామని తెలిపారు. దరఖాస్తుకు నేడే లాస్ట్ కాగా.. ఈ వెబ్ సైట్ https://tsepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 6, 2024

సీఎంల సమావేశంను రాష్ట్ర ప్రజలు శుభసూచకంగా చూస్తున్నారు: MLC

image

నేడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని రాష్ట్ర ప్రజలు శుభసూచకంగా చూస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల వలె విభజన హామీల పరిష్కారం కాని అంశాల పరిష్కారం కోసం చర్చ జరుగుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ అర్ధం అవుతుందన్నారు.

News July 6, 2024

సింగపూర్‌లో కోదాడ యువకుడి మృతి

image

సింగపూర్‌లో తెలుగు యువకుడు మృతి చెందాడు. వివరాలిలా. కోదాడకి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పవన్ మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

News July 6, 2024

MBNR: పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: మాజీ మంత్రి

image

బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలు తమ వ్యక్తిత్వాలను చంపేసుకుని కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన మండిపడ్డారు. వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

News July 6, 2024

ఆషాఢ మాసం.. మొదటిరోజు రుద్రేశ్వర స్వామికి అలంకరణ ఇదే

image

హన్మకొండ నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన, కాకతీయుల కళాకట్టడమైన వేయిస్తంభాల దేవాలయంలో ఈరోజు రుద్రేశ్వరస్వామికి అర్చకులు ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. నేడు ఆషాఢ మాసం మొదటిరోజు కావటంతో స్వామికి సహస్ర జిల్లేడు పూలతో అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు స్వామికి విశేష పూజలు నిర్వహించి, భక్తుల సమక్షంలో హారతి ఇచ్చారు.

News July 6, 2024

మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ న్యాయవాది అరెస్ట్

image

భద్రాచలంలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ న్యాయవాదిని పట్టణ పోలీసులు అరెస్టు చేసి సబ్ జైలుకు తరలించారు. కొంతకాలం క్రితం ఓ మహిళ తన కుటుంబ వివాద పరిష్కారం కోసం కృష్ణ ప్రసాద్ అనే న్యాయవాదిని సంప్రదించింది. ఈ క్రమంలో అతను మహిళకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా.. న్యాయవాదిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.