Telangana

News July 6, 2024

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సిరిసిల్ల జిల్లాలో ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని ,సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా దగ్గరిలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించి పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో డబ్బులు సంపాదన, వ్యక్తి గత విషయాలు పంచుకోవద్దని తెలిపారు.

News July 6, 2024

కొత్తగూడెం: రైలు కిందపడి సూసైడ్

image

రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హేమచంద్రాపురం రైల్వేగేట్ సమీపంలో చోటుచేసుకుంది. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి డోర్నకల్ వెళ్తున్న ఓ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి, ఆత్మహత్య చేసుకున్నాడని లోకో పైలట్ ద్వారా రైల్వే పోలీసులు తెలుసుకున్నారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు.

News July 6, 2024

అల్లాదుర్గం: పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ

image

పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని హుండీని దొంగిలించి అందులో ఉన్న నగదు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామంలో జరిగింది. 161 జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ దేవాలయంలో పలుమార్లు దొంగతనాలు జరుగుతున్నాయి. 3సార్లు దొంగతనాలు జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. 

News July 6, 2024

నల్గొండ: విద్యార్థులను కరిచిన ఎలుకలు

image

డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జులై 2న 16 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, పాఠశాలలో ఎలుకలు కరవడంపై ప్రిన్సిపల్ సంబంధం లేని సమాధానం చెబుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 6, 2024

కేశవరావుకు అభినందనలు తెలిపిన మాజీ ఎంపీ

image

మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేశవరావును రాష్ట్ర ప్రజా సంబంధాల సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. కాగా ఇటీవల బిఆర్ఎస్ నుండి కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

News July 6, 2024

నల్గొండ: విద్యార్థులను కరిచిన ఎలుకలు

image

డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జులై 2న 16 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, పాఠశాలలో ఎలుకలు కరవడంపై ప్రిన్సిపల్ సంబంధం లేని సమాధానం చెబుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 6, 2024

HYD: విస్తరిస్తోన్న డెంగ్యూ వ్యాధి.. జర జాగ్రత్త..!

image

HYD, RR, MDCL జిల్లాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైద్యారోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు HYDలో 114, మేడ్చల్‌లో 108, రంగారెడ్డిలో 51 కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా బాధితుల సంఖ్య రెట్టింపు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. HYDలో మే నెలలో 39, జూన్‌లో 56, జులైలో కేవలం 4 రోజుల్లోనే 19 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచించారు.  

MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ.?

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. నేడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయింది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గులాబీ జెండా నీడలో కొనసాగుతున్నారు.

News July 6, 2024

శాకాంబరి ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

image

ఓరుగల్లు ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలను శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భద్రకాళి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.