Telangana

News July 6, 2024

HYDలో బిర్యానీయే కాదు.. ఫార్మా కూడా ఫేమస్: మంత్రులు

image

HYD హైటెక్స్‌ ప్రాంగణంలో 73వ ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ ఎక్స్‌పోకు ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. రోల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫార్మా ఫర్‌ గ్లోబల్‌ వెల్‌బీయింగ్‌ నేపథ్యంతో 3 రోజుల పాటు సదస్సు జరగనుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా శాస్త్రవేత్తలు, ఫార్మసిస్టులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. HYDలో బిర్యానీయే కాదు.. ఫార్మా కూడా ఫేమస్ అని మంత్రులు అన్నారు. 

News July 6, 2024

శిథిలావస్థకు చేరిన సర్వాయి పాపన్న కోట గోడలు!

image

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో సర్ధార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోటతో పాటు గోడలు శిథిలావస్థకు చేరి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన కోటను సంరక్షించేందుకు గతంలో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వానలకు కోట గోడలు శిథిలమై కూలుతున్నాయి. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న కోటకు అధికారులు మరమ్మతులు చేపట్టి సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

News July 6, 2024

గోల్కొండ బోనాలకు జలమండలి నీటి సరఫరా

image

HYD గోల్కొండ బోనాలను పురస్కరించుకొని జలమండలి తాగునీటి కోసం ఏర్పాట్లు చేసింది. కోట ప్రారంభంలోని మెట్ల దగ్గరి నుంచి బోనాలు జరిగే ప్రాంతం వరకు తాగునీటి పాయింట్లను ఏర్పాటు చేసింది. డ్రమ్ములు, ట్యాంకులు, పంపులు అందుబాటులోకి తెచ్చింది. వంటలు చేసే ప్రాంతంలో స్టాండ్లను కూడా సిద్ధం చేసింది. పైపులైన్ ద్వారా తాగునీరు అందించేందుకు ట్రయల్ రన్‌ను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం

image

జిల్లాలోని నవీపేట మండలం కమలాపూర్, మోకన్ పల్లి శివారులో శుక్రవారం చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన గాంధీ తన మేకలను తీసుకొని గుట్టకు వెళ్లాడు. సాయంత్రం చిరుత తన మందపై దాడి చేసినట్లు రైతు పేర్కొన్నారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపడంతో NZB బీట్ ఆఫీసర్ సుధీర్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ జహుర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరత సంచారం నిజమేనని వెల్లడించారు.

News July 6, 2024

HYD: బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతి

image

అత్యాచార బాధితురాలైన ఓ బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెడికల్‌ బోర్డు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ బాలిక, తల్లి అనుమతి తీసుకుని గర్భం తొలగించాలంటూ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. నగరానికి చెందిన ఓ బాలికపై 10 మంది కామాంధులు 6 నెలల పాటు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటనపై గతంలో పోలీసు కేసు నమోదైంది.

కొత్తూరు: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

image

ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం కొత్తూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఉమా శంకర్, ప్రియాంక దంపతులు జీవనోపాధి కోసం పట్టణానికి వచ్చి సాయికృష్ణ ఫంక్షన్ హాల్ సమీపంలో అద్దెకు ఉంటున్నారు. భర్త పరిశ్రమలో విధులకు వెళ్ళగా ఎవరు లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అన్నారు.

News July 6, 2024

మెదక్: హత్య చేసిన నలుగురి అరెస్ట్

image

HYD జగద్గిరిగుట్ట PS పరిధిలో <<13530512>>అనిల్ అనే వ్యక్తి<<>> హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలానగర్ DCP సురేశ్ కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు. మెదక్ జల్లా అల్లాదుర్గం వాసి అనిల్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్నాడు. దీంతో భార్య భాగ్యలక్ష్మీ భర్తను హత్య చేయించిందని పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

News July 6, 2024

MBNR: “Way2News EFFECT..బాలికను KGBVలో చేర్పించిన అధికారులు”

image

గండీడ్ మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికను వివాహం చేసుకోవడంతో Way2Newలో వచ్చిన “బడికి వెళ్లే బాలికకు వివాహం.. కేసు నమోదు” అనే కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. MEO వెంకటయ్య, AMO శ్రీనివాస్ బాలికను మహమ్మదాబాద్ కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాచారం ఇచ్చిన టీచర్లను అభినందిస్తూ.. పూర్తి నివేదికను జిల్లా విద్యాధికారికి అందిస్తామన్నారు.