Telangana

News July 6, 2024

HYD: తెలంగాణలో BRS పని ఖతం: చికోటి ప్రవీణ్

image

తెలంగాణలో BRS పని అయిపోయిందని BJP నేత చికోటి ప్రవీణ్ ఎద్దేవా చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హిందూ ధర్మం, గోమాతపై దాడి చేస్తే ఏ పార్టీకైనా ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇలా చేసిన పార్టీకి, నాయకులకు క్షణికానందం ఉంటుందేమో కానీ తర్వాత జీరో అవ్వడం ఖాయమన్నారు. BRS ఔటైందని, ఆఖరికి MIMలో విలీనమయ్యే దుస్థితి ఆ పార్టీకి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో రానున్నది BJPనే అని అన్నారు. దీనిపై మీ కామెంట్?

News July 6, 2024

HYD: తెలంగాణలో BRS పని ఖతం: చికోటి ప్రవీణ్ 

image

తెలంగాణలో BRS పని అయిపోయిందని BJP నేత చికోటి ప్రవీణ్ ఎద్దేవా చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హిందూ ధర్మం, గోమాతపై దాడి చేస్తే ఏ పార్టీకైనా ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇలా చేసిన పార్టీకి, నాయకులకు క్షణికానందం ఉంటుందేమో కానీ తర్వాత జీరో అవ్వడం ఖాయమన్నారు. BRS ఔటైందని, ఆఖరికి MIMలో విలీనమయ్యే దుస్థితి ఆ పార్టీకి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో రానున్నది BJPనే అని అన్నారు. దీనిపై మీ కామెంట్?

News July 6, 2024

బీబీనగర్ – నడికుడి మధ్య రెండో లైన్

image

బీబీనగర్- నడికుడి మధ్య రెండో రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది. ఈ రైల్వే లైన్ పనులను ఆగస్టులో ప్రారంభించనున్నారు. ఈ మార్గం డబ్లింగ్ పనుల కోసం మూడు దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. 230 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం రూ.2,853.23 కోట్లను కేంద్ర రైల్వే శాఖ కేటాయించింది.

News July 6, 2024

వరంగల్: ముందే మేల్కొనకపోతే ప్రమాదం తప్పదు!

image

గ్రేటర్ వరంగల్ పరిధిలో శిథిలావస్థకు చేరిన భవనాలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. వానాకాలం నేపథ్యంలో అలాంటి పురాతన భవనాలు, ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. మున్సిపాలిటీ అధికారులు సకాలంలో స్పందించి ఆయా భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం చేయకపోతే గతం మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.

News July 6, 2024

ఉమ్మడి మహబూబ్ నగర్‌లో మోస్తరు వర్షం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. MBNR, NGKL, WNPT, జడ్చర్ల, కోస్గి, మక్తల్, గద్వాల్, కొడంగల్ ప్రాంతాల్లో మురుగు నీరు రహదారులపై పారడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షం ముగిసిన తర్వాత సిబ్బంది విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. వర్షం పోవడంతో పంటలకు కొంత ఆసరాగా నిలిచింది.

News July 6, 2024

ఖమ్మం: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

image

ఆరేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. ఇల్లెందు మండలంలోని ఓ తండాకు చెందిన భార్యాభర్తలు వ్యవసాయ కూలీలు. పాపను తాత వద్ద వదిలేసి గురువారం పనికి వెళ్లారు. చిన్నారి ఆడుకుంటూ బయటకెళ్లగా అదే తండాకు చెందిన యువకుడు తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. 

News July 6, 2024

అశ్వారావుపేట సీఐపై అట్రాసిటీ కేసు నమోదు

image

అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం కేసులో సీఐ జితేందర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయనతో పాటు నలుగురు కానిస్టేబుళ్లపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. కులం పేరుతో తన భర్తని ఈ అయిదుగురు వేధించారని శ్రీనివాస్ భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సీఐని ఐజీ కార్యాలయానికి, కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు.

News July 6, 2024

కరీంనగర్: బాలిక ప్రసవం.. వ్యక్తిపై కేసు నమోదు

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల పరిధిలో ఓ బాలిక ప్రసవించిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో వరుసకు బావ అయినా వెంకటేశ్ బాలికతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. దీంతో బాలిక ఈ నెల 1న వరంగల్ MGM ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆరోగ్యం తెలిపారు.

News July 6, 2024

సదాశివనగర్: రైతుపై కత్తులతో దాడి చేసిన దుండగులు

image

రైతుపై కత్తులతో దాడి చేసిన ఘటన సదాశివనగర్ మండలం ఉత్తనూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పర్వతరావు (62) గురువారం పంటచేనులో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేశారు. దీంతో అతడు పరుగెత్తి సమీపంలోని ఓ ఇంట్లో దాక్కున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. దాడికి గల వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

HYD: తొలి రోజు బోనాలకు గవర్నర్ రాక

image

ఈనెల 7న ప్రారంభం కానున్న గోల్కొండ కోట జగదాంబికా మహంకాళి బోనాలకు తొలి రోజున రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ రానున్నారని భాగ్యనగర్ బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ భగవంత్ రావు తెలిపారు. బోనాల ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.