Telangana

News July 6, 2024

HYD: వీధి దీపాల నిర్వహణలో అశ్రద్ధ వహించొద్దు: ఆమ్రపాలి 

image

వీధి దీపాల నిర్వహణలో అశ్రద్ధ వహించవద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. ఖైరతాబాద్‌లోని తన ఛాంబర్‌లో ఈఈఎస్ఎల్ ప్రతినిధులు, అడిషనల్ కమిషనర్లతో వీధి దీపాల నిర్వహణపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాత్రి సమయంలో వీధి దీపాలు వెలగకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని, వెంటనే స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిటీలో డార్క్ స్పాట్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

News July 6, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓మణుగూరు మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
✓భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
✓ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

News July 6, 2024

నేడు గ్రేటర్ HYD పాలకమండలి సమావేశం

image

నగరాభివృద్ధి, నిర్వహణ పనులు, ప్రజా సమస్యలపై శనివారం హైదరాబాద్ నగర పాలక సంస్థ(GHMC) పాలకమండలి ఖైరతాబాద్‌లోని బల్దియా హెడ్ ఆఫీస్‌లో సమావేశం కానుంది. అందుకు సంబంధించి సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై BRS, కాంగ్రెస్ నేతలు శుక్రవారం పోటాపోటీ సమావేశాలు నిర్వహించారు. BRS కార్పొరేటర్లతో మాజీ మంత్రి తలసాని, ఇతరులు తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాల డిమాండ్‌కు వారు తీర్మానించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు

image

ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక, క్షణికావేశంలో చాలా మంది ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో 93 మంది సూసైడ్ చేసుకున్నారు. రెండు రోజులకు ఓ సూసైడ్ జరుగుతుంది.

News July 6, 2024

పారిస్ ఒలంపిక్స్‌కి అర్హత సాధించిన నిఖత్ జరీన్

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ఈ నెల 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనుంది. బాక్సింగ్‌లో 50 కేజీల విభాగంలో ఆమె చోటు దక్కించుకొంది. కాగా జిల్లా నుంచి ఒలింపిక్స్‌లో చోటుసాధించిన మొదటి క్రీడాకారిణిగా నిఖత్ చరిత్ర సృష్టించారు. నిఖత్ 2023 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది.

News July 6, 2024

స్టడీ టూర్‌లో మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

image

నల్లమలను టూరిజం హబ్‌గా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయం రంగాపూర్ నిరంజన్ షావలీ దర్గాలో మంత్రులతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అనంతరం 75వ వన మహోత్సవంలో భాగంగా వారు మొక్కలు నాటారు.

News July 6, 2024

UPDATE: దంతాలపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

MHBD జిల్లా దంతాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొని <<13573092>>ముగ్గురు వ్యక్తులు మృతి<<>> చెందిన విషయం విదితమే. ఈ ఘటనలో మల్లేశ్, నరేశ్, కుమార్ మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందిస్తున్నారు. వీరు తొర్రూరు మండలం వెలికట్ట నుంచి ఆటోలో బీరిశెట్టిగూడెనికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.కి.మీ అయితే ఇంటికి చేరుకునే వారని స్థానికులు చెప్పారు.

News July 6, 2024

HYD: సూర్యుడికి దూరంగా భూమి: సంచాలకులు శ్రీరఘునందన్

image

సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమిస్తోన్న భూమి శుక్రవారం అత్యంత దూరంగా వెళ్లిందని HYDలోని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంచాలకులు, అంతరిక్ష పరిశోధన నిపుణులు N.శ్రీరఘునందన్ తెలిపారు.HYDలో ఆయన మాట్లాడుతూ.. సూర్యుడికి దగ్గరగా ఉన్న రోజు (JAN 3, 2024)తో పోలిస్తే 50 లక్షల కిలో మీటర్ల దూరంగా ఉందన్నారు. సూర్యుడు భూమికి దగ్గరగా ఉంటే వేడి ఎక్కువ ఉంటుందనే భావన ఉందని, ఇందుకు విరుద్ధంగా JANలో ఉందన్నారు.