Telangana

News July 6, 2024

NZB:7న జిల్లా స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుల ఎంపికలు

image

నిజామాబాద్ జిల్లా మ్యాట్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సెక్రెటరీ దేవేందర్ తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో గల రెజ్లింగ్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. పురుషులకు ఫ్రీ స్టైల్ విభాగంలో, గ్రీకో రోమన్ విభాగంలో, అదేవిధంగా మహిళలకు ఫ్రీ స్టైల్ లో కేటాయించిన కేటగిరీలలో ఎంపికలు ఉంటాయన్నారు.

News July 6, 2024

HYD: లష్కర్‌ బోనాలు.. రేపు ఘటోత్సవం

image

రేపటి నుంచి లష్కర్‌లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమవుతుందని ఆలయ EO గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. నూతన కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం‌ పలు విషయాలు వెల్లడించారు. జులై 7న ఘటోత్సవం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 21న సికింద్రాబాద్ బోనాలు. ఆ రోజు ఉ. 3:30కి CM రేవంత్ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారన్నారు. 22న రగం(భవిష్యవాణి) ఉంటుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

News July 6, 2024

HYD: వేగంగా HMDA భూముల డిజిటలైజేషన్!

image

HMDA భూములకు సంబంధించి GIS డిజిటల్ మ్యాపింగ్ చేసే ప్రక్రియ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. మొబైల్‌లో యాప్ ఓపెన్ చేస్తే చాలు అరచేతిలో భూముల వివరాలు, హద్దులతో సహా కనిపించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. HMDAకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం 8,260 ఎకరాలను కేటాయించింది. నగర శివారు జిల్లాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం భూముల కేటాయింపు నిర్ణయం తీసుకుంది.

News July 6, 2024

NRPT: షీ టీమ్స్‌తో మహిళలకు భరోసా: ఎస్పీ

image

షీ టీమ్స్‌తో మహిళలకు, విద్యార్థినిలకు భరోసా కల్పిస్తున్నామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు ఆకతాయిల నుంచి వేధింపులు ఎదురైతే షీ టీమ్ సభ్యులకు నేరుగా లేదా 8712670398 నంబర్ ద్వారా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చట్టరీత్య నేరమని హెచ్చరించారు.

News July 6, 2024

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి: కలెక్టర్

image

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ మహిళా శక్తి సమావేశం శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా శక్తి లబ్ధిదారులకు అందాల్సిన రుణాలను వేగవంతం చేయాలని సూచించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్డీవో జ్యోతి పాల్గొన్నారు.

News July 6, 2024

జగిత్యాల జడ్పీ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్

image

జగిత్యాల జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్‌ను జడ్పీ స్పెషల్ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రఘువరన్, కలెక్టర్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

News July 6, 2024

రైతు భరోసా విధి విధానాలపై సబ్ కమిటీ సమావేశం

image

ఖమ్మం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. రైతులకు అందించే రైతు భరోసా నిధులపై ఇటీవల రాష్ట్ర రైతాంగం నుంచి సేకరించిన అభిప్రాయాలపై వారు చర్చించారు.

News July 6, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓బేగంపేటలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం✓HYDలో క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ రోడ్‌ షో ✓నాగోల్: మతిస్థిమితం లేని MBBS యువతి ఆత్మహత్య  ✓కోఠి: గంజాయి కేసులో జూనియర్ డాక్టర్లు అరెస్ట్  ✓నాంపల్లి:HYD నగరంలో నిరుద్యోగుల ఆందోళనలు  ✓HYD: నిరుద్యోగుల ధర్నా.. బర్రెలక్క(శిరీష) అరెస్టు ✓కోకాపేట: కొనసాగుతున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పనులు 

News July 5, 2024

సిద్దిపేట: సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

image

రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత సివిల్స్ శిక్షణకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని కవిత ప్రకటనలో తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్‌తో కూడిన ఉచిత శిక్షణను అందజేయనున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జులై 10వ తేదీ వరకు ఆన్లైన్ http://tsstudycircle.co.in/లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మపురి మండలంలో కుక్క కాటుతో వృద్ధురాలు మృతి. @ ఎండపల్లి మండలంలో తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు. @ ముస్తాబాద్ మండలంలో ఏడుగురు పేకాటరాయుళ్ల పట్టివేత. @ కోరుట్ల శివారులో ట్రాక్టర్, స్కూటీ డీ.. ఒకరి మృతి. @ సైదాపూర్ మండలంలో తేనెటీగల దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ జమ్మికుంటలో భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య. @ జగిత్యాల జిల్లాలో వన మహోత్సవాన్ని ప్రారంభించిన కలెక్టర్