Telangana

News April 19, 2025

కొల్లూరు వాసికి డాక్టరేట్

image

నవాబుపేట మండలం కొల్లూరు సత్రోనిపల్లి తండాకు చెందిన జర్నలిస్ట్ మల్లికార్జున్ నాయక్‌‌ను గౌరవ డాక్టరేట్ వరించింది. ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ వారు ఆయనకు శుక్రవారం డాక్టరేట్ ప్రదానం చేశారు.  మల్లికార్జున్ నాయక్ మాట్లాడుతూ.. తాను జర్నలిస్టుగా ఎన్నో ఆలోచనాత్మక కథనాలు, అలాగే తాను సామాజిక కార్యక్రమాలను గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. 

News April 19, 2025

HYD: అగ్నివీర్‌ దరఖాస్తులు

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యువకుల నుంచి అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21 నుంచి మే 11 వరకు అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాలీ ఉంటుందన్నారు. http://agnipathvayu.cdac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు సికింద్రబాద్‌లోని కమాండింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని (040-27758212) సంప్రదించవచ్చు.SHARE IT

News April 19, 2025

ఖమ్మం: ఈనెల 20న నెల నెలా వెన్నెల కార్యక్రమం

image

ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈ నెల 20న సాయంత్రం 6 గంటలకు నెల నెలా వెన్నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మోటమర్రి జగన్మోహన్ రావు, అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, కె.దేవేంద్ర, నాగబత్తిని రవి, వేల్పుల విజేత, లక్ష్మీనారాయణ, వేముల సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన సిరిమువ్వ కల్చరల్స్ కళాబృందం ‘హక్కు’ నాటిక ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

News April 19, 2025

NZB: కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు: కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తినా, ధాన్యం అమ్మకాల్లో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు ఏర్పడితే వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 6644కు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చన్నారు.

News April 19, 2025

ADB: నేడు జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

ప్రభుత్వ మద్దతు క్వింటాలకు రూ.3,371తో జొన్న కొనుగోలుకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. గుడిహత్నూర్ పీఏసీఎస్ఎ ద్వారా ఈనెల 19 నుంచి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కేంద్రాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 19, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!!

image

✔జోగులాంబ శక్తి పీఠంలో చండీహోమాలు ✔పెబ్బేరు: బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి ✔ఆత్మకూరు: కట్టర్ బార్ మీద పడి ఒకరి మృతి
✔ఉమ్మడి జిల్లాలో భానుడి భగభగ
✔తెల్కపల్లి: ప్రేమ వివాహం.. అత్తారింటి వేధింపులు
✔పలుచోట్ల భారీ వర్షం
✔గద్వాల్: బెట్టింగ్ భూతానికి ఎంటెక్ విద్యార్థి బలి
✔మల్లీశ్వరిది ప్రభుత్వ హత్యనే:BRS
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

News April 18, 2025

రాహుల్‌గాంధీతో ఏఐఓబీసీఎస్‌ఏ సమావేశం

image

అఖిల భారత ఓబీసీ విద్యార్థులు సంఘం జాతీయ, తెలంగాణ, HCU కమిటీ నాయకుల బృందం శుక్రవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ఏఐఓబీసీఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రతినిధులు సమావేశమయ్యారు. రిజర్వేషన్ల అమలు, విశ్వవిద్యాలయాల్లో బోధనా ఉద్యోగాల నియమకాల్లో రోస్టర్‌ లోపాలు తదితర అంశాలు రాహుల్‌ గాంధీకి వివరించినట్లు తెలిపారు.

News April 18, 2025

తార్నాక టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ సేవలు

image

తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్సలకు క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమర్జెన్సీ కేర్ యూనిట్ ప్రారంభమైంది. ఈ సేవలను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ శుక్రవారం ప్రారంభించారు. ఫ్యాక్ట్స్ ఫౌండేషన్, అశోక్ లేలాండ్, నిర్మాన్ డాట్ ఓఆర్‌జీ సంస్థల సాయంతో ఈ విభాగాలు ఏర్పాటు అయ్యాయి. క్యాథ్ ల్యాబ్‌తో ఉద్యోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

News April 18, 2025

NZB: పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ

image

నగరంలోని పలు పోలీస్ స్టేషన్లను సీపీ సాయి చైతన్య శుక్రవారం తనిఖీ చేశారు. 3, 4, రూరల్ పోలీస్ స్టేషన్‌లను పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారు లేదా అని ఆరా తీశారు. వాహనాల పార్కింగ్ స్థలాన్ని చూశారు. గంజాయి, సైబర్ నేరాల నిర్మూలనకు కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

News April 18, 2025

నల్గొండ: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి అప్పగింత

image

మనస్తాపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి తిరిగిరావడంతో ఆమెను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోసారి ఇలాంటి పొరపాటు చేయవద్దని తల్లీ కూతుర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు 2 టౌన్ ఎస్ఐ సైదులు తెలిపారు. నల్గొండ శివాజీ నగర్ ఏరియాలోని ఎన్జీ కాలనీకి చెందిన ఓ యువతి ఉద్యోగం చేయడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తే మనస్తాపం చెంది మార్చి 1న ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు ఆమెను తిరిగి అప్పగించారు.