Telangana

News July 5, 2024

ఎల్లారెడ్డిపేట: ప్రవర్తన మార్చుకోని మహిళకు రూ.50 వేలు జరిమానా

image

ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రవర్తన మార్చుకోకుండా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన మహిళకు రూ.50 వేల జరిమానా విధించారు. నారాయణపూర్ గ్రామానికి చెందిన ఆనరాశి పోచవ్వ 2023 అక్టోబర్‌లో నాటుసారా తరలిస్తూ పట్టుబడింది. ఎల్లారెడ్డిపేట MRO ఆఫీస్ ఎదుట రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేశారు. అయితే మరోసారి నాటుసారా తరలిస్తూ ఆమె పట్టుబడింది. దీంతో ఆమెకు జరిమానా విధించినట్లు ఎక్సైజ్ CI శ్రీనివాస్ తెలిపారు.

News July 5, 2024

KNR: నిరుపయోగంగా మారుతున్న రైతువేదికలు

image

రైతులకు ఆధునిక ,సాంకేతిక సమాచారాన్ని అందించేందుకు ఒక వేదికను నిర్మించాలని గత ప్రభుత్వం రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది. ఆరేళ్ల క్రితం అట్టహాసంగా రైతువేదికల నిర్మాణం చేపట్టగా అసంపూర్తి పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. కరీంనగర్ మండలంలో దుర్శేడు, బొమ్మకల్, నగునూర్, చామనపల్లిలో నిర్మించిన రైతువేదిక భవనాల్లో సౌకర్యాలు లేక, అసంపూర్తిగా నిర్మాణాలు చేయగా, ఇవి నిరుపయోగంగా మారుతున్నాయి.

News July 5, 2024

యూకే ఎన్నికల్లో నిజామాబాదీ ఓటమి

image

UKలో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన చంద్ర కన్నెగంటి ఓటమిపాలయ్యారు. ఈయన కన్జర్వేటివ్ పార్టీ తరఫున స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేశారు. ఫలితాల్లో చంద్రకు 6221 ఓట్లు మాత్రమే రావటంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. కోటగిరికి చెందిన చంద్ర చదువు పూర్తి చేసిన తర్వాత లండన్ వెళ్లి స్థిరపడ్డారు. జనరల్ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

News July 5, 2024

KU ఎస్సై కుమారుడికి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌‌లో చోటు

image

కేయూసీ పీఎస్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న దేవేందర్‌- స్వప్న దంపతుల కుమారుడు అక్షిత్‌ 6వ తరగతి చదువుతున్నాడు. అతి పిన్న వయస్సులోనే ప్రపంచ దేశాలకు సంబంధించిన రాజధానులతో పాటు ఆ దేశ కరేన్సీలను చూడకుండా ధారళంగా చెప్పాడు. ప్రతిభను గుర్తించిన తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ గుర్తింపు పత్రాన్ని జారీ చేశారు. శుక్రవారం ఈ పత్రాన్ని వరంగల్‌ సీపీ అంబర్ కిశోర్ ఝా తన చేతుల మీదుగా అక్షిత్‌కు అందజేశారు.

News July 5, 2024

నల్లగొండ: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు 10% రాయితీ

image

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధి నుంచి తిరుపతి వెళ్లే భక్తులు సూపర్ లగ్జరీ బస్సులలో అప్ అండ్ డౌన్ ఒకే సారి రిజర్వేషన్ చేయించుకుంటే బస్ ఛార్జీల నుంచి పది శాతం రాయితీనీ పొందవచ్చని ఉమ్మడి నల్లగొండ రీజినల్ మేనేజర్ యం. రాజశేఖర్ తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 5, 2024

మెదక్: సదరం క్యాంప్ తేదీలు విడుదల

image

మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగులను గుర్తించి అర్హతగల వారికి సదరం ధ్రువీకరణ పత్రం పొందేందుకుగానూ జులై -2024 సంబందించిన క్యాంప్ తేదీలను మీ సేవ / ఈ సేవ కేంద్రాలకు కేటాయించినట్లు డీఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. దివ్యాంగులు తమ దగ్గరలో ఉన్న మీ సేవ/ ఈ సేవ కేంద్రం వద్ద ఆన్ లైన్‌లో స్లాటు బుక్ చేసుకొని కేటాయించిన రోజు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.

News July 5, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మల్ కాంగ్రెస్ నాయకులు

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిర్మల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విట్టల్ బీఆర్ఎస్‌కి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆయనతో కలిసి సీఎంను కలిసి శాలువాతో సత్కరించారు. ఇందులో పార్లమెంట్ జిల్లా ఇన్‌ఛార్జ్ సత్తు మల్లేశ్, మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ మాన్ అలీ, తదితరులున్నారు.

News July 5, 2024

ఖమ్మం శివారు రైల్వే పట్టాలపై మృతదేహం 

image

ఖమ్మం రూరల్ మండలం‌ దానావాయిగూడెం వద్ద  రైల్వే పట్టాలపై ఓ గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైంది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించారు.‌ ఆయన మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరాల కోసం రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ భాస్కర్ రావు పేర్కొన్నారు.

News July 5, 2024

జైపూర్: వన మహోత్సవంలో MP, MLA, IAS

image

జైపూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ హాజరయ్యారు. అనంతరం మొక్కలను నాటారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కను నాటి ప్రకృతికి అండగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News July 5, 2024

ఆదిలాబాద్: వారికి రేషన్ బియ్యం రాదు

image

బోగస్ ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం ఏరివేస్తోంది. రేషన్ డీలర్లకు లబ్ధిదారుల జాబితా పంపించి పరిశీలన ప్రక్రియ చేపడుతోంది. క్షేత్రస్థాయిలో అధికారులతో విచారణ చేయించి బోగస్ కార్డులు రద్దు, అనర్హుల పేర్లు తొలగింపునకు చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో 89 కార్డులు రద్దు చేయగా, 664 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు.