Telangana

News July 5, 2024

MBNR: ITI రెండు విడత దరఖాస్తులకు ఆహ్వానం

image

ఐటీఐ కోర్సుల్లో రెండో విడత ప్రవేశానికి ఉపాధి శిక్షణ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా కన్వీనర్, మెట్టుగడ్డ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బి.శాంతయ్య తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, మెకానిక్ డీజిల్, టర్నర్, మిషనిస్టు, కోపా తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్థులు ఈనెల 15లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News July 5, 2024

జూన్‌లో యాదాద్రీశుడి ఆదాయం ఎంతంటే

image

యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల రాక పెరిగిందని, ఆదాయం అదేస్థాయిలో వస్తోందని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం EO భాస్కర్ రావు తెలిపారు. ఈ ఏడాది జూన్లో దేవస్థానంలోని వివిధ విభాగాల ద్వారా రూ.23.91 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గతేడాది ఇదే జూన్‌లో వచ్చిన
రూ.16.36 కోట్లతో పోలిస్తే ఇది రూ.7.55 కోట్లు అధికమని EO ఒక ప్రకటనలో తెలిపారు.

News July 5, 2024

KNR: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన HYD శివారులో జరిగింది. నార్సింగి SI ప్రభాకర్ వివరాలు.. భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన మోహన్ గండిపేటలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో డ్రైవర్‌గా పనిచేస్తూ పీరంచెరువు భవాని కాలనీలో నివాసముంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సందీప్ (21) ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి సందీప్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 5, 2024

HYD: ఆరో తరగతి బాలికకు వివాహం.. కేసు నమోదు

image

6వ తరగతి చదివే బాలికకు వివాహం జరిగిన ఘటన VKBD జిల్లా గండీడ్ మండలంలో జరిగింది. SI శేఖర్ రెడ్డి ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన యువకుడు బీరప్ప.. 6వ తరగతి చదివే అదే గ్రామానికి చెందిన బాలికను గత నెలలో వివాహం చేసుకున్నాడు. గుర్తించిన ఉపాధ్యాయులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో విచారణ చేపట్టి యువకుడితో పాటు సహకరించిన కుటుంబీకులపై చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

News July 5, 2024

HYD: ఆరో తరగతి బాలికకు వివాహం.. కేసు నమోదు

image

6వ తరగతి చదివే బాలికకు వివాహం జరిగిన ఘటన VKBD జిల్లా గండీడ్ మండలంలో జరిగింది. SI శేఖర్ రెడ్డి ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన యువకుడు బీరప్ప.. 6వ తరగతి చదివే అదే గ్రామానికి చెందిన బాలికను గత నెలలో వివాహం చేసుకున్నాడు. గుర్తించిన ఉపాధ్యాయులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో విచారణ చేపట్టి యువకుడితో పాటు సహకరించిన కుటుంబీకులపై చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

News July 5, 2024

నాగపూర్-అమరావతి హైవేపై హైకోర్టు స్టే

image

నాగపూర్ నుంచి అమరావతి వరకు నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ హైవేపై హైకోర్టు గురువారం స్టే విధించిందని పిటిషన్ దాఖలు చేసిన రైతులు వెల్లడించారు. ఎన్హెచ్ 163-జీ పేరుతో నిర్మిస్తున్న ఈ హైవేకు సంబంధించి తీర్థాల నుంచి వి వెంకటాయ పాలెం సెక్షన్లో 29 మంది రైతులు, ప్లాట్ల యజమానులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు తమ భూములను స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు.

News July 5, 2024

నేడు నల్లమలలో మంత్రి, ఎమ్మెల్యేలు పర్యటన

image

అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, మేఘారెడ్డి, శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, పర్ణిక రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వం గుర్తించిన అక్కమాంబ గుహలు, కదిలి వనం, అక్టోపాస్ వ్యూ పాయింట్, టూరిజం స్పాట్లను సందర్శించానున్నారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

News July 5, 2024

PDPL: పల్లె నుంచి జడ్పీ దాక ప్రత్యేకాధికారుల పాలన!

image

గ్రామ పంచాయతీ, మండల పరిషత్ జిల్లా పరిషత్ స్థానిక సంస్థల కీలకమైన పరిపాలన పగ్గాలు ప్రత్యేక అధికారి చేతిలోకి వెళ్లాయి. ఈ నెల 4 నుంచి జిల్లా, మండల పరిషత్ పాలకవర్గల పదవీకాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 1న సర్పంచి పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీలో ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతోంది. ఇప్పుడు మళ్లీ మండల పరిషత్ అధ్యక్షుడి స్థానంలో ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగించారు.

News July 5, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆} భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం
∆}ఎమ్మెల్యే పాయం పర్యటన పర్యటన వివరాలు
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కొత్తగూడెంలో పవర్ కట్

News July 5, 2024

ఎప్పటికప్పుడు చెత్తలేకుండా శుభ్రం చేయాలి: అమ్రపాలి

image

జీహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి కూకట్పల్లి, మూసాపేట్ భరత్నగర్, రైతుబజార్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వీధుల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా ఎప్పటికప్పుడు చెత్తలేకుండా శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్(జివిపి)ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.