Telangana

News July 5, 2024

ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర కేసీఆర్‌ది: పెద్దపల్లి ఎమ్మెల్యే

image

పదేళ్లలో ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర కేసీఆర్‌ది అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉండి రూ.లక్ష కూడా రైతు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రైతులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసేందుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.

News July 5, 2024

HYD: విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్‌ ఫొటో ఎగ్జిబిషన్

image

మాదక ద్రవ్యాల నిర్మూలనకై విద్యాశాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జులై 31 వరకు విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించనుంది. గురువారం బంజారాహిల్స్‌లో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి యాంటీ డ్రగ్స్‌ ఎగ్జిబిషన్ పోస్టర్‌ విడుదల చేశారు. స్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్‌కు డ్రగ్స్‌‌ దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.

News July 5, 2024

HYD: విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్‌ ఫొటో ఎగ్జిబిషన్

image

మాదక ద్రవ్యాల నిర్మూలనకై విద్యాశాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జులై 31 వరకు విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించనుంది. గురువారం బంజారాహిల్స్‌లో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి యాంటీ డ్రగ్స్‌ ఎగ్జిబిషన్ పోస్టర్‌ విడుదల చేశారు. స్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్‌కు డ్రగ్స్‌‌ వినియోగం, దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.

News July 5, 2024

NLG: బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ విద్యనభ్యసించే విద్యార్థులు బాగా చదువుకొని సమాజంలో ఉన్నత స్థానాలలో ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్పి రోడ్‌లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హాస్టల్ వంటగదిని, భోజనాన్ని, టాయిలెట్లు, డైనింగ్ హాల్, విద్యార్థినుల బ్యారక్‌లు, బాత్రూంలను పరిశీలించారు.

News July 5, 2024

గడ్కరీతో బండి సంజయ్ కుమార్ భేటీ

image

కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భేటీ అయ్యారు. తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, కొత్త రహదారుల నిర్మాణ ప్రతిపాదనల అమలు అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మండలాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి సీఆర్ఐఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు.

News July 5, 2024

ధరణి పరిష్కారంలో వేగం పెంచాలి: కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం వెబ్ ఎక్స్ ద్వారా తహశీల్దార్లతో సమీక్షించారు. గత నెల 29 నుంచి నేటి వరకు ఉన్న దరఖాస్తులు పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు పెండింగ్ ఉన్నవి తహశీల్దార్‌లను ఆమె అడిగి తెలుసుకున్నారు. CCLA ప్రతిరోజు మానిటర్ చేస్తున్నందున దరఖాస్తులను పరిశీలించి అప్‌లోడు చేయాలని పేర్కొన్నారు.

News July 5, 2024

మొహరం వేడుకల్లో పాల్గొనాలని మంత్రి ఉత్తమ్‌కు ఆహ్వానం

image

హుజూర్‌నగర్ పట్టణంలో ఈ నెల 7 నుండి 17 వరకు మొహరం వేడుకలు జరగనున్నాయి. పట్టణంలో ప్రతి ఏడాది పెద్దఎత్తున మొహరం వేడుకలు నిర్వహిస్తారు. ఈ మొహరం వేడుకల్లో పాల్గొనాల్సిందిగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి గురువారం ముజావర్ షేక్ సైదా ఆహ్వాన పత్రికను అందించారు. ఉత్తమ్‌కు దట్టీ కట్టి సన్మానించారు. కార్యక్రమంలో షేక్ మోయిన్, నాగుల్ మీరా, వల్లపుదాసు కృష్ణ, ఖాసిం, వెంకటేశ్వర్లు, రవినాయక్ పాల్గొన్నారు.

News July 5, 2024

ధర్మపురి సంజయ్‌ను పరామర్శించిన ప్రశాంత్ రెడ్డి

image

దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌ను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. గురువారం నిజామాబాద్‌లోని ఆయన ఇంటికెళ్లిన వేముల ధర్మపురి సంజయ్‌ను పరామర్శించారు. అనంతరం డీ. శ్రీనివాస్ మృతిపై వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. వారితో పాటు ఇతర నాయకులు ఉన్నారు.

News July 5, 2024

@1959లో ఆవిర్భవించిన ఆదిలాబాద్ ZP

image

ఆదిలాబాద్ జిల్లా పరిషత్ 1959లో ఆవిర్భవించింది. ఇప్పటివరకు 22 మంది ఛైర్మన్లుగా సేవలందించారు. పల్సికర్ రంగారావు తొలి ఛైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న ఆదిలాబాద్ జెడ్పికి ఐదుసార్లు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఐదుగురు కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు నిర్వహించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ చివరి ఛైర్ పర్సన్‌గా నిర్మల్‌కు చెందిన శోభారాణి వ్యవహరించారు.

News July 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోనరావుపేట మండలంలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.
@ వేములవాడలో వైభవంగా మహాలింగార్చన.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మండలాలకు ప్రత్యేక అధికారుల నియామకం.
@ అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న జగిత్యాల కలెక్టర్.
@ మెట్ పల్లి పట్టణంలో కిరాణ షాపులో మద్యం స్వాధీనం.
@ కొడిమ్యాల మండలంలో తహశీల్దార్ కార్యాలయాన్ని, ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్.