Telangana

News July 4, 2024

రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రులు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, వరంగల్ మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, తదితర అంశాలపై సెక్రటేరియట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, అధికారులు నిజాయితీగా సేవలు అందించాలని మంత్రులు అన్నారు.

News July 4, 2024

NLG: కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని ప్రైవేట్ పాఠశాలలు

image

NLGలోని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని జర్నలిస్టులు ఆరోపించారు. జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50% రాయితీ ఇవ్వాలని జర్నలిస్ట్ సంఘాలు ఇటీవల కలెక్టర్‌ను కోరగా.. ఆయన ఆదేశాల మేరకు DEO ఈనెల జూన్ 25న ప్రైవేట్ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశించినా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని జర్నలిస్టులు మండిపడుతున్నారు.

News July 4, 2024

MBNR: 100 మంది విద్యార్థులు.. ఒక్కరే టీచర్

image

కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గతంలో ఇక్కడ ఆరుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేశారు. హిందీ ఉపాధ్యాయుడు కొత్తకోటలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 4లో బదిలీల్లో 3 ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రజిత ఒక్కరే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.

News July 4, 2024

నల్గొండ: విద్యుత్ షాక్‌తో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి

image

కనగల్ మండలం బాబాసాహెబ్ గూడెం గ్రామానికి చెందిన నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లబోతు సైదిరెడ్డి(50) విద్యుత్ షాక్‌తో కొద్దిసేపటి క్రితం మృతి చెందాడు. బావి వద్ద మోటార్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురయ్యాడు. సైదిరెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతికి సంబంధించి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

News July 4, 2024

MBNR: 100 మంది విద్యార్థులు.. ఒక్కరే టీచర్

image

కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గతంలో ఇక్కడ ఆరుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేశారు. హిందీ ఉపాధ్యాయుడు కొత్తకోటలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 4లో బదిలీల్లో 3 ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రజిత ఒక్కరే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.

News July 4, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు…

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురవారం ఒకే ఒక్క జిల్లాలో మాత్రమే వర్షపాత వివరాలు నమోదు అయ్యాయి. వాటి వివరాలు ఇలా.. అత్యధిక వర్షపాతం నారాయణపేట జిల్లా కేంద్రంలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, మహబూబ్నగర్, జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 4, 2024

HYD: బోనాలు, మొహర్రం ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు: సీపీ

image

ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకొని పోలీసులకు సహకారం అందించాలని నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు, మొహర్రం సందర్భంగా బంజారాహిల్స్‌లోని టీజీఎస్, సీసీ మీడియా బ్రీఫింగ్ హాల్లో సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోనాల జాతర ఉత్సవాలు, మొహర్రం సందర్భంగా నగరంలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: రఘునందన్

image

దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్బంగా గురువారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి పట్టణంలో ఉన్న దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య భూస్వాములకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన నిప్పు కణిక అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు.

News July 4, 2024

HYD: ఎల్బీనగర్‌లో ఉద్యోగాల పేరుతో మోసం

image

చండీగఢ్, పంజాబ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొందరు యువకులను HYD ఎల్బీనగర్ ఎన్టీఆర్ నగర్‌ వాసి కృష్ణ మోసం చేశాడని బాధితులు ఫిర్యాదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కంపెనీలో నెలకు రూ.70 వేలు జీతం ఇప్పిస్తానని చెప్పి.. ఒక్కొక్కరి నుంచి రూ.12 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. అక్కడికి వెళ్లాక రూమ్‌లో బంధించి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు.