Telangana

News July 4, 2024

వరంగల్ మార్కెట్‌లో పత్తి ధర ఎంతంటే..?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర రూ.30 పెరిగింది. మంగళవారం, బుధవారం రూ.7,170 పలికిన పత్తి ధర నేడు రూ.7,200 పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలో హెచ్చు తగ్గులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

News July 4, 2024

HYD: KCR, KTR రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారు: ఎంపీ

image

కాళేశ్వరం పేరిట మాజీ సీఎం KCR, మాజీ మంత్రి KTR తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. KCR కుటుంబ పాలనలో అనేక స్కాములు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని NDA ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై మీ కామెంట్?

కొడంగల్: అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య

image

ముగ్గురు కూతుళ్ల వివాహాలకు చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బొంరాస్‌పేట్ మండలం మెట్లకుంటలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నర్సింహులు (62), మొగులమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు సంతానం. కూతుళ్ల పెళ్లిళ్లు చేసి నర్సింహులు అప్పులపాలవడంతో తరచూ భార్యకు చెప్పుకుని బాధపడుతుండేవాడు. ఈక్రమంలో పొలంలో చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.

News July 4, 2024

MBNR: నేటితో ముగియనున్న DOST గడువు

image

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి DOST(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) మూడో విడత దరఖాస్తుకు జులై 4 వరకు అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ మూడో విడత సీట్ అలాట్మెంట్ JULY 6న ప్రకటించనున్నారు. వివరాలకు dost.cgg.gov.in లాగిన్ కావచ్చు
#SHARE IT

News July 4, 2024

HYD: నటుడిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు

image

ఒక నటుడిని సైబర్ నేరగాడు బురిడీ కొట్టించాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో నివసించే నటుడు ఎస్.రామచైతన్య(33)కు గత నెల 12న హైకోర్టు నుంచి అంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీపై ఒక కేసు నమోదైందని స్కైప్ ద్వారా సైబర్ పోలీస్ కమిషనర్ అంటూ కాల్ చేశాడు. డబ్బులు డిమాండ్ చేయగా.. రూ.1.50 లక్షలు పంపించాడు. తర్వాత మోసమని గ్రహించి జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదైంది.

HYD: తలనొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

image

ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. HYD బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక ఉదయ్ నగర్‌లో నివసించే పీ.అనురాధ(21) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. నెల రోజుల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమె ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా వైద్యుడు మాత్రలు ఇచ్చి సీటీ స్కాన్ తీసుకునిరావాలని సూచించాడు. అదే రోజు రాత్రి తన గదిలోకి వెళ్లిన యువతి ఉరేసుకుంది. గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

GHMCలో అదనపు కమిషనర్లకు బాధ్యతలు

image

GHMC నుంచి ఈవీడీఎం (ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్) డైరెక్టరేట్ వేరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇప్పటి వరకు సంబంధిత డైరెక్టర్ పరిధిలో ఉన్న రవాణా, ప్రకటనల విభాగాలను GHMC కమిషనర్ ఆమ్రపాలి తన ఆధీనంలోకి తీసుకున్నారు. పారిశుద్ధ్యం, రవాణా విభాగాల అదనపు కమిషనర్‌గా సికింద్రాబాద్ జడ్సీ రవికిరణ్‌ను, ప్రకటనల విభాగాన్ని అదనపు కమిషనర్ సత్యనారాయణకు కేటాయించారు.