Telangana

News July 4, 2024

GHMCలో అదనపు కమిషనర్లకు బాధ్యతలు

image

GHMC నుంచి ఈవీడీఎం (ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్) డైరెక్టరేట్ వేరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇప్పటి వరకు సంబంధిత డైరెక్టర్ పరిధిలో ఉన్న రవాణా, ప్రకటనల విభాగాలను GHMC కమిషనర్ ఆమ్రపాలి తన ఆధీనంలోకి తీసుకున్నారు. పారిశుద్ధ్యం, రవాణా విభాగాల అదనపు కమిషనర్‌గా సికింద్రాబాద్ జడ్సీ రవికిరణ్‌ను, ప్రకటనల విభాగాన్ని అదనపు కమిషనర్ సత్యనారాయణకు కేటాయించారు.

News July 4, 2024

HYD: ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రేపు జాబ్‌మేళా

image

రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఉపాధి శాఖ కార్యాలయం, నేషనల్ కెరీర్ సర్వీసెస్, డాన్ బాస్కో దిశ సంయుక్తంగా ఈనెల 5న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నేషనల్ కెరీర్ సర్వీసెస్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. HYD ఎర్రగడ్డ రైతుబజార్ ఎదురుగా ఉన్న సెయింట్ థెరిస్సా ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా కొనసాగుతుందని చెప్పారు. దాదాపు 17 కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఫోన్: 9494092219

పటాన్‌చెరు: లింక్ క్లిక్ చేస్తే రూ.14 లక్షలు మాయం

image

పటాన్‌చెరు పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.14 లక్షలు పోగొట్టుకుంది. ఆన్‌లైన్ పెట్టుబడులపై ఆమె ఆసక్తి చూపించగా సైబర్ కేటుగాళ్లు మొదట్లో లాభాలు చూపించారు. దాంతో ఆమె పెట్టుబడులు పెట్టారు. లింకు పంపిస్తున్నాం క్లిక్ చేయండి నగదు క్రెడిట్ అవుతాయని నమ్మించారు. అది నమ్మి క్లిక్ చేయడంతో ఆమె ఖాతాలో ఉన్న రూ. 14 లక్షలు డ్రా అయ్యాయి. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

News July 4, 2024

కొత్త చట్టాలపై ప్రతి పోలీస్ స్టేషన్‌లో అవగాహన: ఎస్పీ గైక్వాడ్

image

జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని స్థాయిల్లోని పోలీసులకు కొత్త చట్టాల అమలుపై శిక్షణా తరగతులు నిర్వహించామని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఇక నుంచి జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతిఒక్కరూ నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రజలు తమ అనుమానాల నివృత్తి కోసం పోలీస్ శాఖను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

News July 4, 2024

సికింద్రాబాద్: B.Tech పూర్తి చేసిన ఆర్మీ అధికారులు

image

సికింద్రాబాద్ MCEME వద్ద జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కాన్వకేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా TES-41, B.Tech కోర్సు పూర్తి చేసిన ఆర్మీ అధికారులకు పట్టాలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో శ్రీలంక, భూటాన్ ప్రాంతాలకు చెందిన ఆర్మీ అధికారులు సైతం ఉన్నట్లు డాక్టర్ రమేశ్ కంచర్ల తెలియజేశారు. ఉద్యోగంలోనే ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని అధికారులన్నారు.

వరంగల్‌ NIT విద్యార్థికి రూ.88 లక్షల ప్యాకేజీ

image

వరంగల్‌ NITలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్య్వూల్లో బీటెక్‌ (ECE) విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కింది. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన రవిషా తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. కోడింగ్‌లో మెలకువలు, క్లబ్‌ల నుంచి అందిన మార్గదర్శకత్వం తనకు తోడ్పడ్డాయని రవిషా తెలిపారు. మరో 12 మంది రూ.68 లక్షల వార్షిక వేతన ప్యాకేజీలు లభించగా, 82 శాతం మంది బీటెక్‌ విద్యార్థులు ఉద్యోగం సాధించారు.

News July 4, 2024

ముగిసిన గడువు.. ప్రత్యేక అధికారుల నియామకం

image

మండల పరిషత్‌లకు గురువారం, జిల్లా పరిషత్‌లకు శుక్రవారం గడువు ముగుస్తోంది. నల్లగొండ జిల్లా పరిధిలోని 31 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించామని నల్లగొండ జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ లకు ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక పాలన అధికారిని ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలను పునర్విభజన చేశారు.

News July 4, 2024

HYD: కంటోన్మెంట్ విలీనంపై స్పష్టత ఇవ్వండి: ఈటల

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను GHMCలో విలీనం చేస్తున్న నేపథ్యంలో పలు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములు, ఉద్యోగులకు సబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.