Telangana

News July 4, 2024

HYD: కంటోన్మెంట్ విలీనంపై స్పష్టత ఇవ్వండి: ఈటల

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను GHMCలో విలీనం చేస్తున్న నేపథ్యంలో పలు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములు, ఉద్యోగులకు సబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.

News July 4, 2024

ఖమ్మం: అంగన్వాడీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

image

ఖమ్మం జిల్లాలో 1,840 అంగన్వాడీ కేంద్రాలకు గాను 96 టీచర్ల పోస్టులు, 395 ఆయాల పోస్టులు గతంలోనే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు రిటైర్ అయిన వారితో కలిపితే 117 టీచర్, 599 ఆయా పోస్టులు ఖాళీ కానున్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుందని చెబుతున్నారు. ఈ విషయమై ఇటీవల జరిగిన సమీక్షలో ఉన్నతాధికారులు వెల్లడించారని జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్ రెడ్డి తెలిపారు.

News July 4, 2024

నల్గొండ: ఆర్టీసీలో కొలువుల జాతర, తగ్గనున్న భారం

image

సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోవడం, పదవీ విరమణలతో RTC సిబ్బంది తగ్గుతూ వస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో RTCలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పనిభారం తగ్గనుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలలో 7 డిపోల్లో సుమారు 1,818 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు.

News July 4, 2024

HYD: నిలోఫర్ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

image

నిలోఫర్ ఆసుపత్రిని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. అక్కడి ఇంటెన్సివ్ బ్లాక్, డయాగ్నొస్టిక్ ల్యాబ్, క్వాలిటీ కంట్రోల్ రూమ్, ఫిజియోథెరఫీ, పీడియాట్రిక్ సర్జికల్ వార్డు, ఆపరేషన్ థియేటర్లు, ఎస్ఎన్సీయూ లాక్టేషన్ మేనేజ్‌మెంట్, నవజాత శిశువుల వార్డు తదితర విభాగాలను చూశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్ పరిశీలించారు.

News July 4, 2024

జగిత్యాల: దొరకని ఎస్ఐ అజయ్ ఆచూకీ!

image

ACB అధికారుల దాడితో పరారైన రాయికల్ SI అజయ్ ఆచూకీ లభించలేదు. సదరు SI జూన్ 11న పట్టుకున్న ఇసుక ట్రాక్టరు విడిపించేందుకు బాధితుడు రాజేందర్ రెడ్డిని డబ్బులు డిమాండ్ చేయగా ఆయన ACBని ఆశ్రయించాడు. ఇటిక్యాలకు చెందిన మధ్యవర్తి రాజుకు రాజేందర్‌రెడ్డి రూ.10 వేలు ఇస్తుండగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. అధికారుల రాకతో పారిపోయిన SI 13 రోజులుగా పరారీలోనే ఉన్నారు. SI ఆచూకీ కోసం ACB అధికారులు గాలిస్తున్నారు.

News July 4, 2024

HYD: నిలోఫర్ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

image

నిలోఫర్ ఆసుపత్రిని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. అక్కడి ఇంటెన్సివ్ బ్లాక్, డయాగ్నొస్టిక్ ల్యాబ్, క్వాలిటీ కంట్రోల్ రూమ్, ఫిజియోథెరఫీ, పీడియాట్రిక్ సర్జికల్ వార్డు, ఆపరేషన్ థియేటర్లు, ఎస్ఎన్సీయూ లాక్టేషన్ మేనేజ్‌మెంట్, నవజాత శిశువుల వార్డు తదితర విభాగాలను చూశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్ పరిశీలించారు.

News July 4, 2024

వరంగల్: GREAT.. ఇద్దరికీ కంటి చూపునిచ్చాడు!

image

మరణంలోనూ మరో ఇద్దరికీ కంటి చూపునిచ్చాడు భీక్యా నాయక్. కుటుంబీల వివరాలు.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దేవీ లాల్ తండాకు చెందిన గుగులోత్ యాకూబ్ కుమారుడు భీక్యా నాయక్ అనారోగ్యంతో ఎంజీఎంలో బుధవారం మృతి చెందాడు. అయితే భీక్యా నాయక్ కుటుంబ సభ్యులు, తమ కుమారుడు మరణంలోనూ ఇతరులకు సహాయ పడాలనే ఉద్దేశంతో రామాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్‌కు భీక్యా నాయక్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు.

News July 4, 2024

HYD: 40 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం

image

HYD నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 40 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 14 మంది ఇన్‌స్పెక్టర్లను మల్టీ జోన్‌లకు అటాచ్ చేస్తూ ఆదేశించారు.

News July 4, 2024

HYD: బాలుడిని కొట్టిన వ్యక్తికి రిమాండ్: సీఐ

image

HYD శివారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాలు.. పది రోజుల క్రితం షాబాద్ మండలం కేసారం గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న దళిత విద్యార్థి బేగరి యాదగిరిపై అదే గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి దాడి చేశాడు. బహిరంగంగా తాడుతో కట్టేసి తీవ్రంగా కొట్టాడు. ఈఘటనలో బుధవారం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ కాంతారెడ్డి తెలిపారు.