Telangana

News July 4, 2024

HYD: బాలుడిని కొట్టిన వ్యక్తికి రిమాండ్: సీఐ

image

HYD శివారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాలు.. పది రోజుల క్రితం షాబాద్ మండలం కేసారం గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న దళిత విద్యార్థి బేగరి యాదగిరిపై అదే గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి దాడి చేశాడు. బహిరంగంగా తాడుతో కట్టేసి తీవ్రంగా కొట్టాడు. ఈఘటనలో బుధవారం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ కాంతారెడ్డి తెలిపారు.

News July 4, 2024

HYD: సమన్వయంతో పనిచేద్దాం: ఈవీడీఎం కమిషనర్

image

వర్షాకాలంలో ఈవీడీఎం విభాగం, పోలీసులు సమన్వయంతో పనిచేసి నగరంలో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకుందామని ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్ సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ అదనపు కమిషనర్‌తో పాటు ట్రై కమిషనరేట్ల (HYD, సైబరాబాద్, రాచకొండ) పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

ఆర్జీయూకేటీకి ఉమ్మడి జిల్లా నుంచి 131 మంది ఎంపిక

image

నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీకి ఉమ్మడి జిల్లా నుంచి 131 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత సంవత్సరం 149 మంది విద్యార్థులు ఎంపిక కాగా ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లాలో 18 సీట్లు తగ్గాయి. నిర్మల్ 72, మంచిర్యాల 28, ఆదిలాబాద్ 27, కొమురం భీమ్ 4 విద్యార్థులు ఎంపికయ్యారు.

News July 4, 2024

కోస్గి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలు

image

కోస్గిలో ఏర్పాటైన ఉమ్మడి జిల్లాలోని తొలి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డా.శ్రీనివాసులు పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్, సీఎస్సీ (డేటా, సీఎస్సీ(ఏఐ, ఎంఎల్) కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం నిర్ణయించిన రుసుముతో విద్యను అభ్యసించవచ్చని, ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని, ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 4, 2024

నల్గొండ సర్కిల్ పరిధిలో 10 వేల దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్

image

దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ NLG సర్కిల్ పరిధిలో గత ఏడాది కాలంగా 11,706 మంది రైతులు ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల సర్వీసుల కోసం దరఖాస్తు చేశారు. అందులో 1,700 మంది రైతులు ఓఆర్సీ చెల్లించాల్సి ఉంది. మిగతా 10 వేల మంది రైతులకు వెంటనే కరెంటు కనెక్షన్లు విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు.

News July 4, 2024

సిద్దిపేట: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

image

సిద్దిపేట జిల్లాలో బుధవారం వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. ప్రజ్ఞాపూర్‌కు చెందిన గట్టు శ్రావణ్‌ కుమార్‌(17) పిడిచేడు వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన నక్క కాంతయ్య(55) కారు, ద్విచక్రవాహనం ఢీకొని మృతిచెందాడు. దుబ్బాక మండలం పద్మనాభునిపల్లికి చెందిన రాజయ్య(87) ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా టాటా ఏస్ వాహనం ఢీకొని మృతిచెందాడు.

News July 4, 2024

NLG: స్థానిక ప్రజాప్రతినిధులకు అందని వేతనాలు!

image

జిల్లాలో గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. జడ్పీ చైర్మన్ , జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు ఆరు నెలలుగా గౌరవ వేతనాలు రావడం లేదు. బుధవారంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 742 ఎంపీటీసీలు, 71 మంది ఎంపీపీలు, 71 మంది జడ్పిటిసిలు, ముగ్గురు జడ్పీ చైర్మన్లు ఉన్నారు. ఆరు నెలలుగా వీరి వేతనాలు పెండింగ్ లోనే ఉన్నాయి.

News July 4, 2024

HYD: మంత్రివర్గంలో చోటుపై ఎమ్మెల్యేల లాబీయింగ్

image

ఉమ్మడి RR జిల్లాలోని పరిగి MLA రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు పదవి ఇవ్వాలని అధిష్ఠానానికి విన్నవిస్తున్నారు. కాగా ఇప్పటికే తమ నేత మంత్రి అవనున్నారని, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో ఎవరు మంత్రి అవతారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.