Telangana

News July 4, 2024

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల మిగులు ఖాళీలు ఇలా..!

image

ఉమ్మడి జిల్లాలో పదోన్నతుల తరువాత 263 ఎస్ఏ సమాన స్థాయి ఉపాధ్యాయుల ఖాళీలు మిగిలిపోయాయి. MBNR-42, NGKL-51, WNPT-49, NRPT-57, GDWL-64 ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆయా పాఠశాలల విద్యార్థులు నష్టపోతున్నారు. ఇంకా చాలా మంది ఉపాధ్యాయులు రెండేసి సబ్జెక్టుల్లో పదోన్నతి పొందగా ఒక స్థానంలో చేరగా మరో స్థానం ఖాళీగా మిగిలి పోయింది. త్వరలో పలువురు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు.

News July 4, 2024

NZB: స్నేహితుడి ఇంట్లో చోరీ.. ఆపై వారితోనే వెళ్లి PSలో ఫిర్యాదు

image

ఓ బాలుడు స్నేహితుడి ఇంట్లో చోరీ చేసి వారితోనే PSలో ఫిర్యాదు చేసిన ఘటన NZBలో జరిగింది. బొబ్బొలి వీధికి చెందిన మాధవి ఇంటి మరమ్మతులు చేసినందుకు ఆమె కుమారుడి ఫ్రెండ్‌కి కొంత డబ్బు ఇచ్చింది. కాగా ఆ బాలుడు వారి ఇంట్లో జూన్ 27న రూ.2.20లక్షలు చోరీ చేశాడు. ఈనెల 2న బీరువాలో డబ్బు కనిపించకపోవడంతో మాధవి వారిద్దరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని నింధితుడిగా గుర్తించారు.

News July 4, 2024

అమరచింత: టీచర్‌పై రౌడీషీటర్ దాడి

image

అమరచింతలో GOVT టీచర్‌పై రౌడీషీటర్ దాడి చేశాడు. MEO భాస్కర్ సింగ్ వివరాలు.. స్థానిక స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి హోం వర్క్ చేయలేదని సోమవారం టీచర్ కొట్టారు. ఈ విషయమై విద్యార్థి తండ్రి పాఠశాలకు రాగా నచ్చజెప్పి పంపారు. బుధవారం విద్యార్థి తండ్రితోపాటు వచ్చిన రౌడీషీటర్ సదరు టీచర్‌పై దాడీచేసి బ్లేడ్‌తో బెదిరించి వెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేశారని కానీ కేసు వద్దన్నారని SI సురేశ్ చెప్పారు.

News July 4, 2024

HYD: రంగంలోకి డీఆర్ఎఫ్ బృందాలు

image

వర్షాల నేపథ్యంలో రోడ్లపై భారీగా నిలిచే నీళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా జలమండలి డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. ఇప్పటికే వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు 238 స్టాటిక్, 154 మన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు వర్షపు నీటి తొలగింపులో నిమగ్నమయ్యాయి. రాత్రి నగరంలో పలుచోట్ల కురిసిన వర్షానికి నీరు నిలిచిన ప్రాంతాల్లో ఈ బృందాలు నీటిని తొలగించాయి.

NLG: ఉమ్మడి జిల్లాలో లోటు వర్షపాతమే!

image

వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది. దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. గతేడాది ఇదే సమయానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 20 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. చాలా ప్రాంతాల్లో విత్తనాలు నాటిన తర్వాత వర్షం లేకపోవడంతో అవి ఎండిపోయే దశకు చేరాయి.

News July 4, 2024

ఈనెల 7న ఉమ్మడి జిల్లా అండర్-22 క్రికెట్ జట్టు ఎంపిక

image

HCA అండర్-23 రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్టుకు ఈనెల 7న ఉదయం 10 గంటలకు పిల్లలమర్రి దారిలోని ఎండీసీఏ మైదానంలో ఎంపికలు చేపడుతున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన Way2Newsతో మాట్లాడుతూ.. తెల్లని దుస్తులు, ఆధార్, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు, పదో తరగతి/ఇంటర్ మార్కుల జాబితా, జనన ధ్రువీకరణ పత్రాలతో రిపోర్టు చేయాలని కోరారు.

News July 4, 2024

HYD: స్టెరాయిడ్స్‌తో ఆరోగ్య సమస్యలు!

image

HYD, ఉమ్మడి RRలో యువత ఆసక్తిని కొన్ని జిమ్ సెంటర్లు ఆసరాగా చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. త్వరగా సిక్స్ ప్యాక్స్ రావాలన్నా, లావు తగ్గాలన్నా, ఎక్కువ సేపు జిమ్ చేయాలన్నా నిషేధిత స్టెరాయిడ్స్‌ వాడాలని కొందరు కోచ్‌లు చెప్పడం గమనార్హం. ఇటీవల మెహదీపట్నంలో ఓ యువకుడు నిషేధిత ఇంజక్షన్ తీసుకుని కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు.పాతబస్తీలో ఈ ఇంజక్షన్లు, మాత్రలు అమ్మే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఖమ్మం జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం

image

ఖమ్మం జిల్లాలో 2019 మార్చి 31 నాటికి 5,92,041 విద్యుత్తు సర్వీసులుండగా , 2024 మే 31 నాటికి ఈ సంఖ్య 6,82,268కి చేరింది. రెండు నెలల్లోనే 847 సర్వీసులు పెరగటం గమనార్హం. 2021-22లో త్రీఫేజ్, సింగిల్ ఫేజ్ నియంత్రికలు 28,252 ఉన్నాయి. 2024-25 మే 31 నాటికి వీటి సంఖ్య 30,622కి పెరిగాయి.