Telangana

News July 4, 2024

ఖమ్మం జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం

image

ఖమ్మం జిల్లాలో 2019 మార్చి 31 నాటికి 5,92,041 విద్యుత్తు సర్వీసులుండగా , 2024 మే 31 నాటికి ఈ సంఖ్య 6,82,268కి చేరింది. రెండు నెలల్లోనే 847 సర్వీసులు పెరగటం గమనార్హం. 2021-22లో త్రీఫేజ్, సింగిల్ ఫేజ్ నియంత్రికలు 28,252 ఉన్నాయి. 2024-25 మే 31 నాటికి వీటి సంఖ్య 30,622కి పెరిగాయి.

News July 4, 2024

HYD: RS ప్రవీణ్ కుమార్‌పై బల్మూరి వెంకట్ ఫైర్

image

BRS రాష్ట్ర నేత RS ప్రవీణ్ కుమార్‌పై MLC, NSUI స్టేట్ చీఫ్ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. BRSఅధికారంలో ఉన్నప్పుడు వేకెన్సీ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా RS ప్రవీణ్ కుమార్ GO నంబర్ 81లో మార్పులు ఎందుకు చేయలేదని బల్మూరి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. 2018లోనే GOలో మార్పులు చేసి ఉంటే సమస్య ఉండేది కాదని, అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన వేకెన్సీ నిబంధనలనే తమ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు.

News July 4, 2024

PUలో కొత్త కోర్సులు ఆగిపోయాయి !

image

పాలమూరు విశ్వవిద్యాలయ పాలక మండలి గడువు ముగియడం, శాశ్వత ఉపకులపతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ సహా కొత్త కోర్సులు ప్రారంభిస్తారని యువత భావించినా.. ఆశలు అడియాశలే అయ్యాయి. బోధనా సిబ్బంది ఖాళీలు ఉన్నా .. కొత్తగా వారిని తీసుకునే పరిస్థితి లేదు. ఉప కులపతి నియామకంపై స్పష్టత కొరవడింది. తొందరగా వీసీని అపాయింట్ చేయాలని విద్యార్థులు కోరారు.

News July 4, 2024

HYD: RS ప్రవీణ్ కుమార్‌పై బల్మూరి వెంకట్ ఫైర్ 

image

BRS రాష్ట్ర నేత RS ప్రవీణ్ కుమార్‌పై MLC, NSUI స్టేట్ చీఫ్ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. BRSఅధికారంలో ఉన్నప్పుడు వేకెన్సీ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా RS ప్రవీణ్ కుమార్ GO నంబర్ 81లో మార్పులు ఎందుకు చేయలేదని బల్మూరి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. 2018లోనే GOలో మార్పులు చేసి ఉంటే సమస్య ఉండేది కాదని, అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన వేకెన్సీ నిబంధనలనే తమ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు.

News July 4, 2024

MBNR:  నేటి నుంచి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ

image

పదో రాష్ట్రస్థాయి అండర్-19 జూనియర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ గురువారం నుంచి ఈ నెల 6 వరకు నిర్వహిస్తున్నారు. పూర్వ పది జిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులతో పాటు బుధవారం క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీల్లో ఎంపికైన 16 మంది పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు, రాష్ట్ర క్రీడల సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.

News July 4, 2024

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీల్లోని ఉపాధ్యాయులు
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రవీందర్ కోరారు. http:///nationalawardstoteachers.education.gov.in వెబ్సైట్ లో వివరాలను నిర్ణీత నమూనాలో నిక్షిప్తం చేయాలని సూచించారు.

News July 4, 2024

ఇంజనీరింగ్లో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సెలింగ్

image

ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఖమ్మంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం నుంచి కౌన్సెలింగ్ మొదలవుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జకీరుల్లా, కౌన్సెలింగ్ సెంటర్ కోఆర్డినేటర్ ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. మొదటి విడతలో గురువారం నుంచి 12వ తేదీ వరకు స్లాట్ బుకింగ్ చేసుకునే అవకావం ఉండగా, 6వ తేదీ నుంచి 13 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని వెల్లడించారు.

News July 4, 2024

RRR.. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాల సేకరణ

image

ఉమ్మడి జిల్లాలో RRR నిర్మాణానికి 80 శాతం సర్వే పూర్తి కావడంతో అధికారులు భూ సేకరణకు కసరత్తు చేస్తున్నారు. RRR ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 110KM ఉండటంతో 4,500 ఎకరాల భూమిని సేకరిస్తారు. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలు, అందోల్‌-జోగిపేట, గజ్వేల్, తూప్రాన్, సంగారెడ్డి పరిధిలో మొత్తంగా 54 గ్రామాల్లో భూమి తీసుకుంటారు. అటు ప్రభుత్వ నిర్ణయంపైనే మా భవిష్యత్ ఆధారపడి ఉంటుందని భూ నిర్వాసితులు అంటున్నారు.

News July 4, 2024

కొత్తగూడెం: టీమిండియాలో చోటే లక్ష్యం

image

దమ్మపేట మం. సుధాపల్లికి చెందిన రామకృష్ణ, సునీత దంపతుల కుమార్తె తుష్మరేఖ క్రికెట్‌లో రాణిస్తున్నారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా తల్లి సహకారంతో అదరగొడుతున్నారు. 13ఏళ్ల వయసులో వనపర్తి స్పోర్ట్స్ అకాడమీలో చోటు సంపాదించారు. ప్రస్తుతం అండర్-19 క్రీడాకారిణిగా ఉన్న రేఖ ధోనిని స్ఫూర్తిగా తీసుకుని టీమిండియాలో చోటు సంపాదిస్తానని చెబుతున్నారు. బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న రేఖ చదువులోనూ రాణిస్తున్నారు.

News July 4, 2024

కామారెడ్డి: ప్రేమ పేరుతో మోసం.. పోక్సో కేసు నమోదు

image

యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన లింగంపేట్‌లో చోటు చేసుకుంది. పరిమళ గ్రామానికి చెందిన ఓ బాలికకు మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన భాస్కర్‌(24)తో ఇన్‌స్టాలో పరిచయమైంది. దీంతో అమ్మాయికి మాయ మాటలు చెప్పి ప్రేమపేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాసులు తెలిపారు.