Telangana

News July 4, 2024

భారీ ప్రాజెక్టులతో దీటైన నగరంగా HYD!

image

HYD నగరాన్ని ప్రపంచంలోనే దీటైన నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓవైపు RRR(రీజినల్ రింగ్ రోడ్), మరోవైపు మూసి రివర్ డెవలప్‌మెంట్, ఇంకోవైపు శంషాబాద్ పరిసరాల్లో 1000 ఎకరాల్లో ఫార్మసిటీ హబ్, వీటన్నింటికి తోడు HYD ORR లోపలి ప్రాంతాన్ని GHMCగా మార్చే ప్రాజెక్టులతో HYD నగర రూపురేఖలే మారిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

News July 4, 2024

HYD: గాంధీలో డబ్బులు డిమాండ్ చేస్తే కాల్ చేయండి!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని డాక్టర్లు తెలియజేశారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే 9392249569‌కు కాల్ చేయాలని అధికారులు నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో అన్ని విధాల వైద్య సేవలు గాంధీ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
SHARE IT

News July 4, 2024

HYD: గాంధీలో డబ్బులు డిమాండ్ చేస్తే కాల్ చేయండి!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని డాక్టర్లు తెలియజేశారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే 9392249569‌కు కాల్ చేయాలని అధికారులు నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో అన్ని విధాల వైద్య సేవలు గాంధీ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నట్లు వారు పేర్కొన్నారు.
SHARE IT

News July 4, 2024

ఇంటింటా ఇన్నోవేటర్‌పై అధికారులతో సమీక్ష: కలెక్టర్

image

కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఇన్నోవేటర్ తయారు కావాలని, నూతన ఆవిష్కరణలకు కరీంనగర్ జిల్లా వేదికగా నిలవాలని సూచించారు. చదువుకు వయస్సుతో పని లేదని, ప్రతి ఒక్కరూ ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలు చేపట్టాలని, విద్యాశాఖ అధికారులతో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.

News July 4, 2024

కొత్తగూడెం ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్

image

ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జరిగిన బదిలీల ప్రక్రియలో భాగంగా భద్రాచలం ఏఎస్పీగా పని చేస్తున్న పరితోష్ పంకజ్ పదోన్నతి పొంది కొత్తగూడెం ఓఎస్డీగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జనగాం ఏఎస్పీగా పని చేస్తున్న అంకిత్ కుమార్ సంక్వార్ బదిలీపై భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అధికారులు భద్రాద్రి జిల్లా ఎస్పీని కలిసి పూలమొక్కలను అందజేశారు.

News July 4, 2024

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి: కలెక్టర్

image

హాస్టల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సంక్షేమ హాస్టళ్ల వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.

News July 4, 2024

మెదక్: జిల్లా కలెక్టరేట్లో ఈ ఆఫీస్ ప్రారంభం

image

మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ ఆఫీస్‌ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు డిజిటల్ సంతకంతో ప్రతి ఫైలు ఈ ఆఫీసు ద్వారా తనకు పంపించాలని అన్నారు. ఇక నుంచి ప్రతి ఫైలు మాన్యువల్‌గా స్వీకరించడం జరగదని ఈ ఆఫీస్ ద్వారా రావాలని అన్నారు. ఆయా శాఖల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఆయా శాఖల అధికారులు, పాల్గొన్నారు.

News July 4, 2024

‘కొత్త చట్టం కింద ఒక MLAపై నమోదైన మొదటి కేసు ఇదే’

image

హుజూరాబాద్ MLA కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఒక ఎమ్మెల్యేపై భారత న్యాయ సంహిత కొత్త చట్టం కింద రాష్ట్రంలో నమోదైన మొదటి కేసు ఇదే కావడం గమనార్హం. నిన్న కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై జడ్పీ సీఈఓ చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

News July 4, 2024

నిర్మల్: నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన

image

నిర్మల్ జిల్లాలో ఎంపీపీల పదవీ కాలం ఈ నెల 3తో ముగియడంతో గురువారం నుంచి ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక అధికారులుగా నియమించబడిన అధికారులు ఆయా మండలాల్లో గురువారం బాధ్యతలు స్వీకరించాలని సూచించారు.

News July 4, 2024

HYD: ఇక నుంచి ఫ్రీ క్యాబ్ క్యాన్సిలేషన్!

image

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓలా, ఉబర్ క్యాబ్ బుక్ చేసుకునే వారికి అధికారులు శుభవార్త చెప్పారు. ఇక నుంచి క్యాబ్ క్యాన్సిలేషన్ ఫీజు ఉండదని స్పష్టం చేశారు. ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం అని వెల్లడించారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
SHARE IT