India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. శోభ యాత్ర నిర్వహించే సమయంలో ఇతర మతాల వారి మనోభావాలను కించపరిచే నినాదాలు చేయరాదన్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు, తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిదిలో డీజేలకు అనుమతి లేదని పోలీసువారి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పలు సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకు నిన్న ధర రూ.28,500 పలకగా.. నేడు రూ.27వేలకు పడిపోయింది. అలాగే దీపిక మిర్చి క్వింటా ధర నిన్న రూ.12,500 పలకగా.. ఈరోజు కూడా అదే ధర పలికింది. 5531 మిర్చికి కూడా నేడు రూ.9,500 ధర వచ్చింది. సింగిల్ పట్టీకి రూ.23వేలు వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లిలో 5 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన 9వ తరగతి విద్యార్థి వంశీ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మండలంలో చౌడవరంనకు చెందిన వంశీ ఒంటిపూట బడులు కావడంతో ఆరోజు ప్రభుత్వ పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికెళ్తుండగా లారీఢీకొంది. ఈ ప్రమాదంలో కుడికాలు నుజ్జునుజ్జవగా హైదరాబాద్ తరలించగా వంశీ మృతిచెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల పరిశ్రమలకు వెంటనే ఆయా శాఖల అధికారులు అనుమతుల్ని మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో పరిశ్రమల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు అనుమతుల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయో వాటిని ఈ నెలాఖరులో మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల స్థాపన పట్ల నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే మంజూరు చేయలన్నారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా కార్వాన్ చౌరస్తాలోని ఫూలే విగ్రహానికి బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆమె శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, బీసీ సంఘాల ఐక్య పోరాట ఫలితమేనని స్పష్టం చేశారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగా ప్రత్యేక తనిఖీ బృందం ADBలోని రెండు స్కానింగ్ సెంటర్లను శుక్రవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. తనిఖీ బృందం సభ్యులు డిప్యూటీ డీఎంహెచ్ఓ సాధన, డాక్టర్ క్రాంతి, యశోద, వైష్ణవి ఉన్నారు.
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర ఈరోజు కూడా పెరిగింది. గురువారం క్వింటా పత్తి ధర రూ.7,600 పలకగా.. ఈరోజు ₹50 పెరిగి రూ.7,650 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శుక్రవారం యార్డుకు రైతులు 193 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,650, కనిష్ఠంగా రూ.7,300 ధర పలికింది. గోనె సంచుల్లో 13 క్వింటాలు తీసుకురాగా.. రూ.5,800 నుంచి రూ.6,400 వరకు పలికింది.
జిల్లాలోని చీఫ్ ఇంజనీర్(ఇరిగేషన్), NLG డివిజన్ పరిధిలోని కార్యాలయంలో లష్కర్(229), హెల్పర్(56) పోస్టులకు అవుట్సోర్సింగ్ సేవలను అందించటానికి జిల్లా ఉపాది కల్పన కార్యాలయంలో ఎంప్యానెల్ అయినటువంటి ఆసక్తి గల ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లను కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు.
రేపు శ్రీ వీర్ హనుమాన్ విజయయాత్ర జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు 12 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుందని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ర్యాలీ ఉంటుంది. యాత్ర మార్గాల్లో ట్రాఫిక్ రద్దీకి అవకాశముండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
రేపు శ్రీ వీర్ హనుమాన్ విజయయాత్ర జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు 12 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుందని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ర్యాలీ ఉంటుంది. యాత్ర మార్గాల్లో ట్రాఫిక్ రద్దీకి అవకాశముండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.