Telangana

News July 3, 2024

ఆదిలాబాద్‌లో కూలర్ షాక్ కొట్టి బాలుడి మృతి

image

విద్యుత్ షాక్ తగిలి ఓ బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో ఓ ఇంటి యజమాని ఇంటి బయట మురికి కాలువపై కూలర్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే గోపాల్ (14) పిల్లలతో కలిసి బుధవారం ఆడుకుంటూ కూలర్‌ను ముట్టుకోవడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 3, 2024

ఖమ్మం జిల్లాలో పర్యాటకం అభివృద్ధి

image

అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారులు ఇప్పటికే 12 ప్రాంతాలను గుర్తించారు. కనకగిరి అటవీప్రాంతంలో సఫారీ, బర్డ్‌వాచ్‌, ట్రెక్కింగ్, బోటింగ్ ఉండనుంది. కిన్నెరసాని ప్రాంతంలో వసతి, డ్యాంలో బోటింగ్, పాల్వంచలో సఫారీ, ట్రెక్కింగ్, రంగాపురం క్యాంప్‌ సందర్శన, జంగాలపల్లి అటవీప్రాంత సందర్శనకు అవకాశం కల్పించనున్నారు.

News July 3, 2024

HYD: బ్రీత్ అనలైజర్‌‌తో పరారీ.. మందుబాబు అరెస్ట్

image

డ్రంక్‌ డ్రైవ్‌ తనిఖీల్లో సహకరించకుండా బ్రీత్ అనలైజర్‌ లాక్కొని పరారీ అయిన వాహనదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లిలో జూన్ 27న తనిఖీలు నిర్వహించారు. కారులో వస్తున్న శ్రవణ్ కుమార్‌‌ను ఆపి టెస్ట్ చేయబోయారు. ఒక్కసారిగా బ్రీత్ అనలైజర్‌ను లాక్కున్న అతడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు.

News July 3, 2024

HYD: బ్రీత్ అనలైజర్‌‌తో పరారీ.. మందుబాబు అరెస్ట్

image

డ్రంక్‌ డ్రైవ్‌ తనిఖీల్లో సహకరించకుండా బ్రీత్ అనలైజర్‌ లాక్కొని పరారీ అయిన వాహనదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లిలో జూన్ 27న తనిఖీలు నిర్వహించారు. కారులో వస్తున్న శ్రవణ్ కుమార్‌‌ను ఆపి టెస్ట్ చేయబోయారు. ఒక్కసారిగా బ్రీత్ అనలైజర్‌ను లాక్కున్న అతడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు.

News July 3, 2024

కొత్తగూడెం: చెట్టు కింద చదువు.. 54 మందికి ఒక్కరే టీచర్

image

తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటుతున్నా ఇంకా చెట్ల కింద చదువుకుంటున్న పరిస్థితి వెంకటాపురం మండలంలో బోధపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. 54 మంది పైగా చదువుకుంటున్న ఈ పాఠశాలలో ఒక్కరే టీచర్ ఉన్నారని విద్యార్థిని తల్లిదండ్రులు చెప్పారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నామని.. నూతన భవనాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

News July 3, 2024

ఆందోల్: విద్యుదాఘాతంతో లైన్ మెన్ మృతి

image

విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో లైన్​మెన్​ మృతి చెందిన ఘటన ఆందోల్ మండలం ఎర్రారంలో జరిగింది. స్థానికుల వివరాలు.. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటకు చెందిన లైన్ మెన్ చంద్రశేఖర్, మరో లైన్ మెన్ విద్యుత్ లైన్‌‌ను బాగు చేస్తున్నారు. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగగా చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 

News July 3, 2024

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : కలెక్టర్

image

నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ విభాగాల అధిపతులతో ఆసుపత్రి పని తీరుపై సమీక్షించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద సేవలను పెంచాలని, అన్ని రకాల రోగులను ఆరోగ్యశ్రీ కింద చూడాలన్నారు.

News July 3, 2024

ఉచితంగా వేములవాడ రాజన్న కోడెల పంపిణీ

image

అర్హులైన రైతులకు ఉచితంగా రాజన్న కోడెల పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రతి నెల ఉచితంగా కోడెల పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు అర్హులను కమిటీ ద్వారా ఎంపిక చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో వినోద్ రెడ్డి పేర్కొన్నారు. పంపిణీ చేసిన కోడె, ఆవు సంరక్షణ కోసం పకడ్బందీగా అంగీకార పత్రాన్ని ఏర్పాటు చేశారు.

News July 3, 2024

బాసర IIIT అర్హుల జాబితా విడుదల

image

నిర్మల్ జిల్లాలోని బాసర IIIT క్యాంపస్ ప్రవేశాలకు అర్హుల జాబితా విడుదలైంది. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి మొత్తం 1,500 సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాలను జులై 8, 9, 10 తేదీల్లో పరిశీలిస్తారు. స్పెషల్ కేటగిరీ ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల జాబితా ఇప్పటికే విడుదలైంది. వారికి జులై 4, 5 తేదీల్లో బాసర క్యాంపస్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.

News July 3, 2024

హైదరాబాద్‌లో ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

image

GHMC కమిషనర్ ఆమ్రపాలి నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నారాయణగూడ‌లో శానిటేషన్ పనులపై ఆరా తీశారు. మార్కెట్ కాంప్లెక్స్‌లో గదుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ZCని ఆదేశించారు. శంకర్‌మఠ్ వద్ద రాంకీ RFC వెహికిల్ డ్రైవ‌ర్‌తోనూ ఆమె మాట్లాడారు. చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో స్కూల్ విద్యార్థినికి పరిశుభ్రతపై కమిషనర్ అవగాహన కల్పించారు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవి కిరణ్ ఉన్నారు.