Telangana

News July 3, 2024

కరీంనగర్ చరిత్రలో ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు కాలేదు: గంగుల

image

శాసనసభ్యులుగా ఎన్నికై ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రస్తావించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నిన్న జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తితే క్రిమినల్ కేసులు పెట్టడం కరీంనగర్ జిల్లా చరిత్రలో లేదని పేర్కొన్నారు. సమస్యలను సభ దృష్టికి తీసుకువస్తే విధులకు ఆటంకం కలిగించినట్లు ఎలా అవుతుందని గంగుల ప్రశ్నించారు.

News July 3, 2024

హైదరాబాద్‌లో ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

image

GHMC కమిషనర్ ఆమ్రపాలి నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నారాయణగూడ‌లో శానిటేషన్ పనులపై ఆరా తీశారు. మార్కెట్ కాంప్లెక్స్‌లో గదుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ZCని ఆదేశించారు. శంకర్‌మఠ్ వద్ద రాంకీ RFC వెహికిల్ డ్రైవ‌ర్‌తోనూ ఆమె మాట్లాడారు. చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో స్కూల్ విద్యార్థినికి పరిశుభ్రతపై కమిషనర్ అవగాహన కల్పించారు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవి కిరణ్ ఉన్నారు.

News July 3, 2024

జిల్లా వ్యాప్తంగా 66 లక్షల మొక్కలు నాటాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

image

వనమహోత్సవం కార్యక్రమం కింద ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో 66 లక్షల ఆరువేల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.
బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వనమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్క బతకాలని, మొక్కలు నాటేందుకు సరైన స్థలాలను ఎంపిక చేయాలని ఆదేశించారు.

News July 3, 2024

సీఎంకు తుమ్మల లేఖ

image

భద్రాచలం మండలంలోని ఆంధ్రాలో కలిపిన 5గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు, విభజన చట్టంలోని హామీలు, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో 5గ్రామ పంచాయతీలను కలపాలని లేఖ ద్వారా తుమ్మల సీఎంను కోరారు.

News July 3, 2024

డీలక్స్ బస్సులో లక్కీ డ్రా బాక్స్ లు ఏర్పాటు: RM KMM

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజయన్ పరిధిలో భద్రాచలం-ఖమ్మం, ఖమ్మం-భద్రాచలం, సత్తుపల్లి-విజయవాడ, మణుగూరు-హైదరాబాద్, మధిర-హైదరాబాద్ రూట్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులు కోసం లక్కీ డ్రా బాక్స్‌లను ఏర్పాటు చేసినట్లు రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ప్రతీ నెల రెండుసార్లు లక్కీ డ్రా తీసి 24మంది మహిళా విజేతలకు బహుమతులు ఇస్తామన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.

News July 3, 2024

అశ్వారావుపేట ఎస్సైను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

image

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాసులు బుధవారం బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఎస్ఐ ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సైకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన సూచించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు.

News July 3, 2024

ఉచితంగా వేములవాడ రాజన్న కోడెల పంపిణీ

image

అర్హులైన రైతులకు ఉచితంగా రాజన్న కోడెల పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రతి నెల ఉచితంగా కోడెల పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు అర్హులను కమిటీ ద్వారా ఎంపిక చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో వినోద్ రెడ్డి పేర్కొన్నారు. పంపిణీ చేసిన కోడె, ఆవు సంరక్షణ కోసం పకడ్బందీగా అంగీకార పత్రాన్ని ఏర్పాటు చేశారు.

News July 3, 2024

రైతు ఆత్మహత్య వెనుక ఎవరున్నా ఉపేక్షించం: డిప్యూటీ సీఎం భట్టి

image

ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని అయన స్పష్టం చేశారు. ఇక త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని భట్టి వెల్లడించారు. ఐదేళ్లలో కనీసం రూ.లక్ష కూడా రుణమాఫీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు తమను ప్రశ్నించడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు.

News July 3, 2024

సీఎం రేవంత్‌కు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య వినతి 

image

రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం నుంచి ఏపీలో కలిసిన 5మండలాలను తిరిగి భద్రాచలం రెవిన్యూ పరిధిలో కలపాలని, కోరుతూ మాజీ ఎమ్మెల్యే వీరయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. భద్రాచలం  తప్ప పట్టణాన్ని ఆనుకొని ఉన్న రూరల్ ప్రాంతమంతా ఆంధ్రాలో కలవటం వల్ల  పుణ్యక్షేత్రంలో భూ సమస్య ఏర్పడిందని, కనీసం చెత్త వేసుకోవటానికి కూడా స్థలంలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

News July 3, 2024

ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలి: రామచందర్

image

ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబు, రీసెర్చ్ అధికారి వరప్రసాద్‌తో కలిసి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిహారం నిబంధనల ప్రకారం సకాలంలో అందించాలని సూచించారు. పలువురు అధికారులున్నారు.