Telangana

News July 3, 2024

నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యాటకం అభివృద్ధి

image

అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారులు ఇప్పటికే 12ప్రాంతాలు గుర్తించారు. నల్లమల పరిధిలో మన్ననూరు, సోమశిలలో వసతి, శ్రీశైలం ఆలయ సందర్శన, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో సఫారీ, అభయారణ్యంలో ట్రెక్కింగ్, కృష్ణా బ్యాక్‌వాటర్‌లో బోటింగ్ ఉండనుంది. దీంతో స్థానికంగా ఉపాది, ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

News July 3, 2024

BREAKING: HYD: బల్కంపేట్ ఎల్లమ్మ జాతర తేదీల ప్రకటన

image

తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన HYD బల్కంపేట్ ఎల్లమ్మ బోనాల జాతర తేదీలను నిర్వాహకులు ఈరోజు ప్రకటించారు. జులై 8 నుంచి 10వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 9వ తేదీన అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. లక్షలాదిగా భక్తులు రానుండడంతో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. SHARE IT

News July 3, 2024

BREAKING: HYD: బల్కంపేట్ ఎల్లమ్మ జాతర తేదీల ప్రకటన

image

తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన HYD బల్కంపేట్ ఎల్లమ్మ బోనాల జాతర తేదీలను నిర్వాహకులు ఈరోజు ప్రకటించారు. జులై 8 నుంచి 10వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 9వ తేదీన అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. లక్షలాదిగా భక్తులు రానుండడంతో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
SHARE IT

News July 3, 2024

HYD: త్వరలో టీజీపీఎస్సీ ముట్టడి: నిరుద్యోగ ఐకాస

image

నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి టీజీపీఎస్సీని 20 లక్షల మందితో త్వరలో ముట్టడిద్దామని నిరుద్యోగ ఐకాస నాయకుడు మోతీలాల్ నాయక్ పిలుపునిచ్చారు. మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వడంతో ప్రభుత్వం దిగిరాదని స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష విరమించిన అనంతరం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చారు. నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తే ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని వాపోయారు.

HYD: బోనాల చెక్కుల పంపిణీకి సిద్ధం: కలెక్టర్

image

ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలకు సంబంధించి వివిధ శాఖల అధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి కానున్నాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బోనాల పండగ నేపథ్యంలో ఆలయాలకు ఇవ్వాల్సిన చెక్కులు పంపిణీకి సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో వాటిని పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 7న జగదాంబ మహంకాళి గోల్కొండ, లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపును మంత్రులు ప్రారంభిస్తారని చెప్పారు.

HYD: గంటలోపు ఫిర్యాదు చేయండి: కేవీఎం.ప్రసాద్

image

మనీ లాండరింగ్, డ్రగ్స్ వచ్చాయని కాల్స్ రాగానే కంగారు పడొద్దని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టెలీకాలర్స్ డీఎస్సీ కేవీఎం.ప్రసాద్ సూచించారు. వీడియో కాల్‌లో అటు వైపు కనిపించే కేంద్ర దర్యాప్తు సంస్థల లోగోలన్నీ నకిలీవే అని, ముఖం కనిపించకుండా పోలీసు, సీబీఐ అధికారిగా మాట్లాడేది మోసగాళ్లని గ్రహించాలన్నారు. మోసపోయినట్టు గుర్తించగానే గంటలోపు(గోల్డెన్ అవర్) పోలీసులకు/1930 నంబర్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

HYD: ట్రేడింగ్‌లో పెట్టుబడులు.. రూ.16.45 లక్షలు స్వాహా

image

ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.16.45 లక్షల టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘ట్రేడింగ్’ గురించి ప్రకటన కంట పడింది. ముందుగా ట్రేడింగ్ గురించి అవగాహన కల్పించారు. నిజమేనని నమ్మిన బాధితుడు రూ.16.45 లక్షలు పెట్టుబడి పెట్టేశాడు. ఆ తర్వాత అవతల వ్యక్తుల ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.