Telangana

News July 3, 2024

పటాన్‌చెరు: యాప్ డౌన్ లోడ్ చేయబోతే రూ.48 వేలు మాయం

image

టోల్‌గేట్ ట్యాక్స్ చెల్లించడానికి ఫాస్టాగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేయబోగా ఖాతాలో డబ్బులు మాయమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. అమీన్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి కారు ఫాస్టాగ్ రీఛార్జి చేసినా అవ్వకపోవడంతో కొత్తగా యాప్‌ను డౌన్ లోడ్ చేయబోతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి లింక్ పంపాడు. UPI నంబర్ నమోదు చేయమని చెప్పి, ముందుగా ఒక్క రూపాయి డ్రా చేశాడు. తర్వాత రూ.48.920 మాయం కాగా PSలో ఫిర్యాదు చేశాడు.

News July 3, 2024

HYD: యువతిపై లైంగిక దాడి.. పోలీసులకు ఫిర్యాదు

image

ఓ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న యువతిపై హాస్టల్ నిర్వాహకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన HYD ఘట్‌కేసర్ సమీపంలోని మేడిపల్లి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి(20) పీర్జాదిగూడ బుద్ధానగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ స్థానికంగా ఉన్న పీజీ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. రాత్రి హాస్టల్ నిర్వాహకుడు యువతిపై లైంగిక దాడికి పాల్పడడంతో ఆమె బంధువులు PSలో ఫిర్యాదు చేశారు.

ఆసిఫాబాద్: ఆత్మహత్యకు యత్నించిన తల్లీకూతురు మృతి

image

పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన <<13547638>>తల్లికూతుళ్ల <<>>ఘటనలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో తల్లి, ముగ్గురు కూతుళ్లు<<>> మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో బుధవారం ఇద్దరు మృతిచెందారు. తల్లి వనిత (45), కూతురు రమ్య (14)లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

News July 3, 2024

జనగామ: పశువులపై హైనా దాడి.. గేదె మృతి

image

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో పశువులపై హైనా దాడి చేసింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బిక్షపతి అనే రైతుకు చెందిన పశువులపై హైనా దాడి చేసింది. ఈ ఘటనలో ఓ గేదె మృతి చెందింది. గతంలో సైతం హైనా దాడిలో తమ పశువులు మృత్యువాత పడ్డాయని గ్రామస్థులు ఆవేదన చెందారు. అటవీ శాఖ అధికారులు వాటిని కట్టడి చేయాలని కోరారు.

News July 3, 2024

HYD: ప్రజాభవన్ వద్ద రూ.5 భోజనం ప్రారంభం

image

HYD బేగంపేట్‌లోని జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో ప్రజావాణికి ప్రతి మంగళ, శుక్ర వారాల్లో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం హరేకృష్ణ మూమెంట్ సహకారంతో ప్రజాభవన్ వద్ద భోజనశాల ఏర్పాటు చేశారు. దాదాపు 400మందికి సరిపడేలా భోజనం ఏర్పాటు చేయగా, మధ్యాహ్నంలోగానే పూర్తయ్యింది.

FLASH.. సిరిసిల్లలో విషాదం.. చేనేత కార్మికుడు ఆత్మహత్య

image

సిరిసిల్లలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసిల్లో నివాసం ఉండే చేనేత కార్మికుడు యాదగిరి(48) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసల్ల పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. 6 నెలలుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 3, 2024

హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ఏటా పెరుగుతోన్న నష్టాలు!

image

రాష్ట్రంలో అత్యధిక నష్టాల్లో ఉన్న హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ఏటా నష్టాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 42.23 శాతం నష్టాలొచ్చాయి. 1013 మిలియన్ యూనిట్లు ‘లాస్ యూనిట్లు’గా టీజీఎస్పీడీసీఎల్ పేర్కొంది. 101 కోట్ల యూనిట్లు బిల్లింగ్‌లోకి రాలేదు. సగటు యూనిట్ ఖర్చు రూ.7 కాగా ఒక్క ఏడాదిలో రూ.707 కోట్లు ఖజానాకు గండిపడింది. దీంతో ఈ సర్కిల్‌ను ప్రైవేటుకు అప్పగించేందుకు సర్కారు సన్నద్ధం అవుతోంది.