Telangana

News July 3, 2024

HYD: అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYDకోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో పార్ట్ టైం అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు తెలుగు,ఉర్దూ, ఇంగ్లిష్, కామర్స్, జంతుశాస్త్రం, ఫుడ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బీబీఏ, ఫుడ్ అండ్ న్యూట్రీషియన్, జనటిక్స్, కెమిస్ట్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సబ్జెక్టులను బోధించేందుకు ఈనెల 8వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సర్టిఫికెట్లను నేరుగా అకాడమిక్ డైరెక్టర్ ఆఫీస్‌లో ఇవ్వాలన్నారు.

News July 3, 2024

మక్తల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి..?

image

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు నుంచి ఎవరికి మంత్రి పదవి వరిస్తుందనే చర్చ సాగుతోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ MLA వాకిటి శ్రీహరికి పదవి వస్తుందని టాక్. రాష్ట్రంలోనే ఈ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే, గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో బెర్త్ ఖాయమని వాకిటి వర్గీయులు అంటున్నారు. పదవి వస్తే జిల్లాలో తొలిసారి MLAగా గెలిచి మంత్రి అయిన ఘనత ఆయనదే.

News July 3, 2024

వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: మంత్రి

image

రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సత్తుపల్లి డివిజన్లో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కొండా సురేఖ హెలికాప్టర్లో వెళ్లారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

News July 3, 2024

తలలో పెన్ను గుచ్చుకున్న బాలిక మృతి

image

<<13550256>>తలలో పెన్ను గుచ్చుకున్న<<>> నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. సోమవారం భద్రాచలం సుభాష్ నగర్‌లో ప్రమాదవశాత్తు పెన్నుగుచ్చుకుంది. ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స చేసి వైద్యులు నిన్న పెన్ను తొలగించారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం బాలిక మృతి చెందింది.

News July 3, 2024

HYD: అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYDకోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో పార్ట్ టైం అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు తెలుగు,ఉర్దూ, ఇంగ్లిష్, కామర్స్, జంతుశాస్త్రం,ఫుడ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బీబీఏ, ఫుడ్ అండ్ న్యూట్రీషియన్, జనటిక్స్, కెమిస్ట్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సబ్జెక్టులను బోధించేందుకు ఈనెల 8వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సర్టిఫికెట్లను నేరుగా అకాడమిక్ డైరెక్టర్ ఆఫీస్‌లో ఇవ్వాలన్నారు. 

News July 3, 2024

HYD: కొత్తగా వందే భారత్ స్లీపర్ రైళ్లు..!

image

కొత్తగా వందే భారత్ స్లీపర్ రైళ్లు ఆగస్టు 15న ప్రారంభం కానున్నాయి. వీటిని కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు. ఇప్పటికే కాచిగూడ-బెంగళూర్, సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్, సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ-బెంగళూర్ వందే భారత్ 8 బోగీలతో నడుస్తుండగా మిగిలిన 2 రైళ్లు 16 బోగీలతో నడుస్తుండడం విశేషం.

HYD: ఆడుకుంటూ వెళ్లి రైలెక్కారు.. పోలీసుల చేరదీత

image

బుద్వేల్ రైల్వే స్టేషన్ వద్ద రైలు దిగి రోడ్డుపై ఏడుస్తున్న ఇద్దరు చిన్నారులను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు చేరదీశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్‌లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారిలో చిన్నారులు కార్తీక్ (6), చిన్న (4) ఆడుకుంటూ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్‌లో రైలెక్కి బుద్వేల్ స్టేషన్‌లో దిగారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వారిని గమనించారు. వివరాలు సేకరించి తల్లిదండ్రులకు అప్పగించారు.

KNR: బీరు సీసాతో హత్యాయత్నం.. ఐదుగురిపై కేసు

image

హత్యాయత్నం కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు చిగురుమామిడి SI రాజేష్ తెలిపారు. సైదాపూర్(M) దుద్దెనపల్లికి చెందిన శ్రీనివాస్ స్వగ్రామానికి వెళ్లేందుకు సోమవారం రాత్రి సుందరగిరి బస్టాండ్‌లో వేచి ఉన్నాడు. ఈ క్రమంలో సుందరగిరికి చెందిన అఖిల్, అజయ్, వేణు, నాగరాజు, సుమిత్‌లు శ్రీనివాసును బీర్ సీసాతో హత్య చేయబోగా తప్పించుకున్నాడు. శ్రీనివాస్ ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేశారు.