Telangana

News July 3, 2024

రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలి: C&MD

image

ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సంస్థ C&MD బలరాం సూచించారు. HYD సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల డైరెక్టర్లు, GMలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షా కాలం వల్ల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల భద్రతపై మరింత దృష్టి సారించాలన్నారు.

News July 3, 2024

సిద్దిపేట: జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం

image

అటవీ హద్దులను నిర్ధారించుటకు, ఆక్రమణలను తొలగించుటకు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 23,738 హెక్టార్ల అటవీ విస్తీర్ణం 77 ప్రాంతాలలో ఉందని అన్నారు.

News July 3, 2024

ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే: వనపర్తి కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని WNP జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడారు. ప్రసవాలకు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి పేదలు డబ్బులు వృధా చేసుకుంటున్నారని, తద్వారా వారి ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలు మెరుగుపరచుకోవాలని సూచించారు.

News July 3, 2024

ఉత్తమ ప్లాంటుగా చిల్పూర్ కేటీపీపీ

image

భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చిల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) 600 మెగావాట్ల ప్లాంట్‌కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వరకు 200 రోజులుగా నిరంతరాయంగా విద్యుత్ అందించిన 600 మెగావాట్ల ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్లాంటుగా కేటీపీపీని గుర్తించడంపై ప్లాంట్ ‌లో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 3, 2024

మాజీ సీఎంను కలిసిన నిర్మల్ నేతలు

image

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మంగళవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో నిర్మల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కొరిపల్లి విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.

News July 3, 2024

పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్

image

‘ఎప్పుడైనా లోకల్ లోకలే. బయట నుండి వచ్చిన వాళ్లు అద్దెకు ఉండేవారు మాత్రమే’ అంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాసుల బాలరాజు మంగళవారం పోచారంను తన అనుచరులతో కలువగా పోచారం మాట్లాడుతూ.. బాలరాజుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వస్తే వాళ్లకు కడుపు నొప్పి ఎందుకు ? అంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గాన్ని ఉద్దేశించి అన్నారు.

News July 3, 2024

NLG: రెండు రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

image

ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాలలో బుధ, గురువారాలు రెండు రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఈ విషయమై జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఆదేశించారు.

News July 3, 2024

పదేళ్లలో BRS ప్రభుత్వం యువతకు ఏం చేసింది:పొంగులేటి

image

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని 6 నెలలు అయిందన్నారు. రైతులకు రుణమాఫీ కోసం శ్రీకారం చుట్టామని, ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. యువతను ప్రతిపక్షం రెచ్చగొడుతుందని, పదేళ్ల BRS ప్రభుత్వం యువతకు ఏం చేసిందని ప్రశ్నించారు.

News July 2, 2024

HYD: లిఫ్ట్‌లో పడి పూజారి మృతి

image

ప్రమాదవశాత్తు లిఫ్ట్‌‌ కింద పడి పూజారి మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం తుకారాంగేట్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సింహ్మ మూర్తి ఈస్ట్ మారేడుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పూజ చేయడానికి వెళ్లాడు. లిఫ్ట్‌‌ డోర్‌ తెరిచి అడుగుముందుకేశాడు. లిఫ్ట్ పై ఫ్లోర్‌లోనే ఆగిపోవడం గమనించకపోవడంతో కింద పడిపోయాడు. ఇదే సమయంలో లిఫ్ట్ అతనిపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

News July 2, 2024

సంగారెడ్డి: 45 మంది ఉపాధ్యాయుల బదిలీ

image

సంగారెడ్డి జిల్లాలో 45 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. లాంగ్వేజ్ పండిట్ తెలుగు 11, హిందీ 22, ఉర్దూ 1, పీఈటీలు 11 మంది బదిలీ అయినట్లు చెప్పారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు వారికి కేటాయించిన పాఠశాలలలో ఈ నెల 3వ తేదీన చేరాలని సూచించారు.