Telangana

News August 31, 2025

ఖమ్మం: స్థానిక పోరుకు సమాయత్తం

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానుంది. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 571 పంచాయతీల్లో 5,214 వార్డులు, అదే సంఖ్యలో పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం 3,146 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 1,572 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు 10,330 మంది అవసరమని తేల్చారు.

News August 31, 2025

అన్నదాతను ముంచిన వర్షం

image

భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో 3,644 ఎకరాల మేర పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 33% పైగా 2,893 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని గుర్తించారు. వరి 1,950 ఎకరాలు, పత్తి 330, పెసర 613 ఎకరాల్లో నష్టపోయినట్లు తెలిపారు. అత్యధికంగా కూసుమంచి మండలంలో 1,875 ఎకరాల్లో వరి, 320 పత్తి, పెసర 160 ఎకరాల పంటను రైతులు నష్టపోయారు.

News August 31, 2025

HYD: పిల్లలకు మొబైల్ ఇస్తున్నారా? జాగ్రత్త

image

మీ పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? జాగ్రత్త! HYDలో నమోదైన పలు కేసుల్లో పిల్లల ప్రవర్తన వెనుక అనేక విషయాలు బయటపడ్డాయి. ఇటీవల కూకట్‌పల్లి బాలుడు OTTచూసి ప్రభావితం అయిన తీరు ఓ ఉదాహరణ. మీ పిల్లలు యూట్యూబ్ షాట్స్, ఇన్‌స్టా, షేర్‌చాట్, ఫేస్‌బుక్ లాంటివి చూస్తుండగా నేరాలు, పోర్న్, డ్రగ్స్, ఇతరత్రా అనవసరపు వీడియోలు రావడంతో వాటికి ఆకర్షితులై వారు చెడుదారి వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

News August 31, 2025

సీకేఎం ఆసుపత్రిలో సేవల్లో అంతరాయంపై చర్యలు: కలెక్టర్

image

సీకేఎం ఆసుపత్రిలో గర్భిణుల సేవల్లో అంతరాయంపై నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. రేడియాలజిస్టులు, మత్తు వైద్యుల కొరతను ఎంజీఎం నుంచి డిప్యూటేషన్‌తో తీర్చాలన్నారు. ఎంజీఎం ఆసుపత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్ నియామకంపై చర్యలతో పాటు సమయపాలన పాటించని వారిపై చర్యలు ఉంటాయన్నారు.

News August 31, 2025

NZB: NDRF, SDRF సేవలు భేష్..

image

ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావానికి లోనైన ప్రాంతాలలో NDRF, SDRF బృందాలు అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబరచిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించగలిగామన్నారు.

News August 31, 2025

NZB: ఉమ్మెడ బ్రిడ్జిని పరిశీలించిన సీపీ

image

నందిపేట్ ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జన స్థలాన్ని సీపీ సాయి చైతన్య శనివారం సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, నిమజ్జన కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, లైటింగ్, వైద్య సదుపాయాలను పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా, ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగే లో చూడాలని పోలీసులకు ఆదేశించారు.

News August 31, 2025

ఎక్కువ డబ్బులు వస్తాయంటే నమ్మొద్దు: SP అఖిల్ మహాజన్

image

మల్టీ లెవెల్ మార్కెటింగ్ పట్ల అప్రమత్తతతో ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో బోయవాడకు చెందిన ఠాగూర్ విజయ్ సింగ్ అనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. ఇతడు myv3ads అనే అప్లికేషన్‌లో నమోదై దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి, అందులో నమోదు కావడానికి తనకు 1,21,000/- రూపాయలకు చెల్లించాలని ఆశ చూపి ఇద్దరు వ్యక్తులను మోసం చేశాడన్నారు.

News August 31, 2025

NLG: ‘ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలి’

image

NLG జిల్లాలోని MEPMA, హార్టికల్చర్ & సెరికల్చర్ డిపార్ట్మెంట్, DEO పరిధిలోని మోడల్ స్కూల్స్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నందు ఔట్ సోర్సింగ్ సేవలు అందించటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయములో ఎంపానెల్ అయిన ఆసక్తి గల ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారన్నారు.

News August 31, 2025

MDK: ‘అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు’

image

రేగోడ్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్ శనివారం తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు ఎప్పటికప్పుడు సరిపడా లభించేలా, నిల్వలు సక్రమంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జావీద్, AEOలు మహేష్, భూలక్ష్మి పాల్గొన్నారు.

News August 31, 2025

MBNR: పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

image

వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం సీసీ కుంట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. సిబ్బంది సేవలపై ఏమైనా సమస్యలుంటే పరిశీలిస్తామని, విధుల విభజన (ఫంక్షనల్ వర్టికల్స్) ప్రకారం సమర్థవంతంగా పనిచేయాలని, ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.