Telangana

News July 2, 2024

నిర్మల్: ప్రమాదవశాత్తు బండరాయిపై పడి వ్యక్తి మృతి

image

సారంగాపూర్ మండలం అడేల్లిపోచమ్మ ఆలయ సమీపంలో గల రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రమాదవశాత్తు బండరాయిపై పడి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కౌట్ల(బి) గ్రామానికి చెందిన భీమన్న అనే వ్యక్తి మంగళవారం పోచమ్మ ఆలయం వద్ద గ్రామస్థులు పండుగ చేయగా అక్కడికి వెళ్ళాడు. మోదుగ ఆకులు తెంపడానికి రిజర్వ్ ఫారెస్ట్‌కు వెళ్లగా ప్రమాదవశాత్తు బండరాయిపై జారిపడ్డాడు.

News July 2, 2024

వరంగల్: 9 మంది సీఐలు, ఐదుగురు ఎస్‌ఐల బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు భారీగా బదిలీ అయ్యారు. 9 మంది ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు ఎస్ఐ లను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఆత్మకూర్‌లో పని చేస్తున్న సీఐ క్రాంతి కుమార్‌ను పరకాలకు బదిలీ చేశారు. కమాండ్ కంట్రోల్ అటాచ్డ్‌గా ఉన్న సంతోశ్‌ను ఆత్మకూరు సీఐగా బదిలీ చేశారు.

News July 2, 2024

సిరిసిల్ల: మద్యానికి బానిసై యువకుడి మృతి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో మద్యానికి బానిసై యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐతం అజయ్(25) అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ ఇరుగుపొరుగు వారితో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News July 2, 2024

NZB: జులై 4న విద్యాసంస్థల బంద్: PDSU

image

ఈ నెల 4న కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని NSUI, SFI, AISF, PDSU, AIPSU నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్‌లో PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, SFI జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేశ్ మాట్లాడుతూ.. జులై 4 న జరిగే దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు ప్రైవేట్ యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News July 2, 2024

సిరిసిల్ల: మద్యానికి బానిసై యువకుడి మృతి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో మద్యానికి బానిసై యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐతం అజయ్(25) అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ ఇరుగుపొరుగు వారితో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News July 2, 2024

నేరెళ్ల ఘటనపై నిష్పక్షపాత విచారణ చేయాలని సూచిస్తాం: రామచందర్

image

సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల ఘటనపై మరోసారి నిష్పక్షపాత విచారణ నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామ్ చందర్ అన్నారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అన్యాయం జరిగిన నిమ్న వర్గాల ప్రజలకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుందన్నారు. ఎస్సీలకు కేటాయించిన అసైన్డ్ ల్యాండ్స్ పట్టాలు అందించే అవకాశంపై రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించి ఆదేశాలు జారీ చేశామన్నారు.

News July 2, 2024

ADB: వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

ఆదిలాబాద్ తిర్పల్లిలోని ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన దాదాపు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ అశోక్ గోదామును పరిశీలించి నిల్వలను గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించామన్నారు. సిబ్బంది నరేష్, రమేష్, క్రాంతి ఉన్నారు.

News July 2, 2024

NKD: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

image

మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నారాయణఖేడ్‌కు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. నారాయణఖేడ్ నుంచి కారులో వెళ్లిన రఫిక్ ఖురేషి, ఫెరోజ్ ఖురేషి, సయ్యద్ అమర్, మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, సయ్యద్ ఇస్మాయిల్ పుణే సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 2, 2024

సంగారెడ్డిలో 4న జాబ్ మేళా

image

సంగారెడ్డిలోని బైపాస్ రహదారిలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 4న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి వందన తెలిపారు. ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఫ్యాబ్రికేషన్ చదివిన వారు అర్హులని చెప్పారు. 18 నుంచి 35 సంవత్సరంలోపు ఉన్న యువకులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వివరించారు.

News July 2, 2024

టీయూ: బ్యాక్ లాగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల పరిధిలోని వన్ టైం ఛాన్స్ (సీబీఎస్ఈ) బీఏ, బీ.కాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సులకు సంబంధించి ఐదవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య అరుణ మంగళవారం తెలిపారు. ఆగస్టు 4వరకు కొనసాగనున్న ఈ పరీక్షలు ఉదయం 10గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం.ల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు గమనించాలన్నారు.