Telangana

News July 2, 2024

సిద్దిపేట: పదోన్నతుల్లో SGTలకు నిరాశ !

image

ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అన్యాయం జరిగిందని SGTలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి సీనియారిటీ ప్రకారం ఇచ్చేవారని ప్రస్తుతం కోర్టు తీర్పు ప్రకారం బాషా పండితుల పదోన్నతులు ఉమ్మడి సీనియార్టీగా కాకుండా కేవలం పండితులకు ఇవ్వడంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి సీనియారిటీని TTC చేసిన వారికి వర్తింపజేయడంతో బీఈడీ చేసిన ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు.

News July 2, 2024

HYD: క్రికెట్ క్రీడాకారులకు GOOD NEWS

image

క్రికెట్ క్రీడాకారులకు HYD HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు గుడ్ న్యూస్ తెలిపారు. జిల్లా లెవెల్ స్టేడియాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులన్నీ పూర్తయ్యాయని, BCCIనుంచి ఫండ్స్ విడుదలైనట్లు తెలిపారు. ఆగస్టు8 నుంచి డొమెస్టిక్ సీజన్ ప్రారంభమవుతుందని,ఉమెన్స్ లీగ్ క్రికెట్ నిర్వహించేందుకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేశామని, తెలంగాణలో క్రికెట్ నూతన శకం ఆరంభం కాబోతుందన్నారు.

మతిలేని మాటలు మాట్లాడుతున్న రాహుల్ గాంధీ: ధన్పాల్

image

పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువులను అవమానించే విధంగా కించపరుస్తూ మాట్లాడిన మాటలను ఖండిస్తున్నట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్పారు. మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందువులు హింస, అసత్యం, ద్వేషం రెచ్చగొడతారని రాహుల్ మాట్లాడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వంద సీట్లు కూడా గెలవని రాహుల్ మతిలేని మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు.

News July 2, 2024

కేటీఆర్ మాటలు బాధించాయి ఎమ్మెల్యే సంజయ్

image

జగిత్యాల జిల్లా కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలు బాధించాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. తనపై విమర్శలు చేసే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. గతంలో ఇతర పార్టీల్లో గెలిచినవారిని ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పని చేస్తే జగిత్యాల అభివృద్ధి చెందుతుందని భావించానని వెల్లడించారు.

News July 2, 2024

HYD: FAST TAG లేకుంటే డబుల్ పెనాల్టీ..!

image

HYD శివారు నానక్‌రాంగూడ ఎగ్జిట్ నంబర్-19 వద్ద ORR పక్కన టోల్‌గేట్ నుంచి వెళ్లే వాహనదారులకు ఫాస్ట్ ట్యాగ్ లేకుంటే డబుల్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిని చూసిన పలువురు వాహనదారులు, ప్రయాణికులు డబుల్ పెనాల్టీ ఆలోచనపై ప్రశంసలు కురిపిస్తుండగా, మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.

నాగార్జున సాగర్ జలాశయం సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు మంగళవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.00 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 121.7080 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.

News July 2, 2024

HYD: తల్లిదండ్రులూ.. మీ పిల్లలు జర జాగ్రత్త..!

image

పిల్లలను ఎక్కువ సేపు సెల్ ఫోన్ వాడనీయొద్దని, దానికి అడిక్ట్ కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సెల్‌ఫోన్ ఎక్కువుగా వాడుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి పిల్లలు వెళ్లిపోయిన ఘటనలు తాజాగా HYDలో వెలుగు చూశాయి. సికింద్రాబాద్ వారాసిగూడలో ఈశ్వర్(14), తార్నాక లాలాపేట్‌లో సాయివాసవి(13), నల్లకుంటలో మరో బాలిక(14) ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.