Telangana

News July 2, 2024

దేవాదాయశాఖ సమీక్షా సమావేశంలో మంత్రి కొండా సురేఖ

image

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సెక్రటేరియట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, సీజీఎఫ్ నిధులు, బోనాల ఉత్సవాలకు నిధుల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 2, 2024

పోడు భూములకు పట్టాలను అందిస్తాం: మంత్రి సీతక్క

image

నల్లమల ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనుల పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అమ్రాబాద్ మండలం మన్ననూరులో మంత్రులు సీతక్క, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఐటీడీఏకు ఐఏఎస్ అధికారిని నియమిస్తామని అన్నారు. జాతి అంతరించిపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News July 2, 2024

RR: రూ.100 కోట్లతో టూరిజం అభివృద్ధి: ఎంపీ

image

VKB జిల్లాలో రూ.100 కోట్లతో అనంతగిరి, కోట్‌పల్లి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రత్యేక జిల్లా సమావేశం నిర్వహించి, రూ.100 కోట్ల ప్రాజెక్టు పురోగతి పనులపై పరిశీలన జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వికారాబాద్ జిల్లా తెలంగాణ టూరిజం హబ్‌గా అవతరిస్తుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.

HYD: హత్య కేసులో ముగ్గురు రౌడీషీటర్లకు జీవిత ఖైదు

image

హత్య కేసులో ముగ్గురు రౌడీషీటర్లకు న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాలు.. దొమ్మరపోచంపల్లికి చెందిన ముజాహిద్ ఆలియాస్ ముజ్జు(50), నవాబ్ కుంటకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్(40) స్నేహితులు. ఇద్దరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగా గొడవలు అయ్యాయి. సయ్యద్ ఇస్మాయిల్‌ను ముజాహిద్ తన స్నేహితులు పాషా(25), ఫిరోజ్ ఖాన్(31)తో కలిసి హత్య చేశారు. నేరం రుజువు కాగా శిక్ష పడింది.

HYD: పరీక్ష ల్యాబ్ లా నూతన భవనం ప్రారంభం

image

రాజేంద్రనగర్‌లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి రూ.790 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మట్టి, విత్తనాలు ఫర్టిలైజర్ పరీక్ష ల్యాబ్ లా నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈరోజు ప్రారంభించారు. రైతులందరూ పంటలు నష్టపోకుండా అధిక దిగుబడి సాధించేందుకు, తమ భూముల సారవంతం తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు, రైతులు వాడే విత్తనాల నాణ్యతను పరీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు రేపే చివరి తేదీ

image

సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ 2025 (ప్రిలిమ్స్, మెయిన్స్) పరీక్ష కోసం ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా జులై 3తో గడువు ముగియనున్నట్లు వెల్లడించారు.

News July 2, 2024

HYD: బస్సులు సరిపడా లేక ప్రజల అవస్థలు..!

image

HYD, ఉమ్మడి RRలోని పలు ప్రాంతాలకు బస్సులు సరిపడా లేక అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. రద్దీ ప్రాంతాలకు ఎక్కువ బస్సులు నడపాలని కోరుతున్నారు. ఐటీ కారిడార్, దుర్గం చెరువు, ఇనార్బిట్ మాల్ ప్రాంతాలకు ఒకే బస్సు ఉంది. దీంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులు బస్సు రాగానే దాని వెంట పరుగులు తీసి మరి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మీ ప్రాంతాల్లో ఉందా కామెంట్ చేయండి.