Telangana

News July 2, 2024

HYD: గ్రూప్-4 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ

image

HYD తెలంగాణ రాష్ట్ర రిక్రూట్మెంట్ కమిషన్ కార్యాలయంలో గ్రూప్-4 అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరిగింది. HYD, RR, MDCL, VKB సహా ఇతర జిల్లాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొంత మంది అభ్యర్థులు పూర్తి దరఖాస్తులు తీసుకురాకపోవడంతో, అధికారులు పలు సూచనలు చేసి, వారికి తగిన సమయం కేటాయించారు.

News July 2, 2024

పటాన్‌చెరు: కరెంట్ షాక్‌తో ఆటో డ్రైవర్ మృతి

image

కరెంట్ షాక్ తగిలి ఓ ఆటో డ్రైవర్ మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పటాన్‌చెరు మండలం క్యాసారం గ్రామంలో ఉంటున్న శ్రీనివాస్ గౌడ్(46) ఆటో డ్రైవర్. సోమవారం ఆటోను తడి బట్టతో శుభ్రం చేశాడు. అనంతరం దాన్ని వైరుపై ఆరేయగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 2, 2024

NLG: కొత్త చట్టం తొలి కేసు నమోదు

image

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త చట్టంలో తొలి కేసు సోమవారం నల్లగొండ వన్ టౌన్ స్టేషన్ పరిధిలో నమోదైంది. ఏబీవీపీ నాయకులు స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ముందస్తు పోలీసు అనుమతి లేకుండా ధర్నా చేయడంతో నూతన చట్టం 151 ప్రకారం కేసు నమోదు చేశారు. 151 నూతన చట్టం ప్రకారం వ్యక్తిగత పూచికత్తుపై వదిలి పెట్టినప్పటికీ సెక్షన్ మార్పు మినహా వ్యక్తి గత పూచికత్తుపై వదిలేశారు.

News July 2, 2024

ఉమ్మడి జిల్లాలో వర్షపాత వివరాలివే..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా పెబ్బేర్ లో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లిలో 9.3 మి.మీ, గద్వాల జిల్లా మల్దకల్లో 4.5 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా సెరివెంకటాపూర్ లో 4.0 మి.మీ నారాయణపేట జిల్లా కోటకొండలో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 2, 2024

రేపు PUలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో రేపు ఉచిత మెగా హెల్త్ క్యాంపు మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు పాలమూరు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్వీఎస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయాలని సూచించారు.

News July 2, 2024

HYD: ట్రేడింగ్‌లో లాభాలంటూ 8.90 లక్షల స్వాహా

image

ట్రేడింగ్‌లో లాభాలు ఇస్తామని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ వ్యాపార వేత్తకు ఎక్స్.టీబీ ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీ పేరిట సందేశం వచ్చింది. అందులోని లింక్ క్లిక్ చేయగా.. ఎక్స్.టీబీ ఫారెక్స్ యాప్ డౌన్‌లోడ్ చేయించారు. మొదట అతడికి ట్రేడింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టాలని నమ్మించి రూ.8.90 లక్షలు కొట్టేశారు. బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

News July 2, 2024

HYD: ట్రేడింగ్‌లో లాభాలంటూ 8.90 లక్షల స్వాహా

image

ట్రేడింగ్‌లో లాభాలు ఇస్తామని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ వ్యాపార వేత్తకు ఎక్స్.టీబీ ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీ పేరిట సందేశం వచ్చింది. అందులోని లింక్ క్లిక్ చేయగా.. ఎక్స్.టీబీ ఫారెక్స్ యాప్ డౌన్‌లోడ్ చేయించారు. మొదట అతడికి ట్రేడింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టాలని నమ్మించి రూ.8.90 లక్షలు కొట్టేశారు. బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News July 2, 2024

NLG: సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులు కిటకిట

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని పలు ఆసుపత్రులకు రోగులు తాకిడి పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి రోగాలతో ప్రజలు విలవిలాడుతున్నారు. వైద్యాధికారులు స్పందించి ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, గ్రామీణులు కోరుతున్నారు.

News July 2, 2024

ఉమ్మడి జిల్లాలో జోరుగా ఫిల్టర్ ఇసుక దందా

image

ఉమ్మడి జిల్లాలో ఫిల్టర్ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. నాణ్యతను బట్టి ఒక్కో ట్రాక్టరుకు రూ.3,500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతోంది. రోజుకు రూ.1.75 కోట్ల వ్యాపారం జరుగుతోందని అంచనా. నెలకు సుమారు రూ.50 కోట్లకు పైగా ఈ వ్యాపారం సాగుతోంది. చెరువులు, కుంటల వద్ద మట్టిని, గుట్టలను తొలిచి వచ్చిన మట్టిని ఇసుకగా మారుస్తున్నారు. మైనింగ్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News July 2, 2024

సిద్దిపేట: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు ఈనెల 15లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అనంతరం వాటి జీరాక్స్ ఈనెల 17లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.