Telangana

News July 2, 2024

BREAKING: HYD: 5 స్కూల్ బస్సులపై కేసు నమోదు

image

హైదరాబాద్‌లో రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఈరోజు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. లాల్‌బంగ్లా, అమీర్‌పేట్, సికింద్రాబాద్, టోలీచౌకీ తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పాఠశాలల బస్సులు, వ్యాన్లలో తనిఖీలు చేశారు. ఈ మేరకు 3 ఆటోలను సీజ్ చేశామని, 5 పాఠశాలల బస్సులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News July 2, 2024

BREAKING: HYD: 5 స్కూల్ బస్సులపై కేసు నమోదు

image

హైదరాబాద్‌లో రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఈరోజు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. లాల్‌బంగ్లా, అమీర్‌పేట్, సికింద్రాబాద్, టోలీచౌకీ తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పాఠశాలల బస్సులు, వ్యాన్లలో తనిఖీలు చేశారు. ఈ మేరకు 3 ఆటోలను సీజ్ చేశామని, 5 పాఠశాలల బస్సులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News July 2, 2024

NLG: యువతిపై అత్యాచారం.. నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష

image

పోక్సో కేసులో ఓ యువకుడికి కోర్టు శిక్ష విధించింది. పోలీసులు వివరాలు.. NLGజిల్లా కట్టంగూరు మండలం కురుమర్తికి చెందిన వాసి వంశీకృష్ణ(19) HYDలో ఉంటూ మెకానిక్‌గా పనిచేసేవాడు. లవ్ చేస్తున్నానంటూ ఇంటర్ చదివే ఓ యువతి(17) వెంట పడేవాడు. 2017 DEC 10న ఆమెను అపహరించి, 2రోజులు రూమ్‌లో బంధించి అత్యాచారం చేశాడు. ఈ మేరకు నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష విధిస్తూ సోమవారం RRజిల్లా స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.

News July 2, 2024

సిద్దిపేట: ‘మాకు ఇచ్చే డబ్బులు మా పిల్లలకైనా ఇవ్వండి’

image

‘మాకు ఇచ్చే డబ్బులు మా పిల్లలకైనా ఇవ్వండి’ అంటూ చనిపోయిన తల్లిదండ్రుల పేరిట ఫ్లెక్సీని సిద్దిపేట జిల్లా దూళిమిట్టలో ఏర్పాటు చేశారు. కరుణాకర్-దివ్య దంపతులు వ్యవసాయం, కిరాణ షాపు నడుపుతూ జీవించేవారు. 4ఏళ్ల క్రితం కరెంట్ షాక్‌తో కరుణాకర్ చనిపోగా మనోవేదనతో దివ్య మృతితో పిల్లలు అనాథలయ్యారు. దీంతో షాపులో సరకులు ఉద్దెర, అప్పుగా తీసుకున్న డబ్బు ఇవ్వాలని పిల్లల పేరిట ఫ్లెక్సీని బాబాయ్ ఏర్పాటు చేశారు.

News July 2, 2024

ఖమ్మం: నూతన చట్టం.. వన్ టౌన్‌లో మొదటి కేసు

image

నూతన చట్టాలు అమల్లోకి రాగా ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) కింద చీటింగ్ కేసు నమోదైంది. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతన్న దొడ్డా సాయి అనే వ్యక్తిపై 318, 62 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే గంధసిరి చెందిన షేక్ సలీమ్ (31) అనే ట్రాక్టర్ డ్రైవర్ మమతా రోడ్డులో ఇసుకను ఆన్ లోడింగ్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన ఘటనపై సెక్షన్ 194 కింద కేసు నమోదైంది.

News July 2, 2024

చిన్నారి అత్యాచారంపై పలు అనుమానాలు: DSP

image

ASF జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై <<13547833>>అత్యాచారం<<>> జరిగిన విషయం తెలిసిందే. DSP కరుణాకర్ ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంకట్రావ్‌పేటకు చెందిన ఓ యువతిని ఆత్యాచారినికి గురైన చిన్నారి తండ్రి ప్రేమ పేరుతో వేధించాడు. ఆ యువతి నిరాకరించడంతో 17-9-2023న ఆమెకు పురుగుమందు తాగిపించడంతో మృతి చెందింది. కాగా చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తి ఆ యువతి సోదరుడు కావడంతో ప్రతికార చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.

News July 2, 2024

శిధిల భవనాల్లో బతుకులు భద్రమేనా..!

image

వర్షాకాలం వస్తుందంటే పేద మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు మొదలవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ అధికారులు గుర్తించిన గణాంకాల ప్రకారం 46,701 పైగా శిథిలావస్థకు చేరిన గృహాలు, భవనాలు ఉన్నాయి. నూతన ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా వ్యాప్తంగా 2.71 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మించి ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

News July 2, 2024

MBNR: గుండెపోటుతో ANM మృతి

image

మహబూబ్‌నగర్ జిల్లాలో డాక్టర్స్ డే రోజే విషాదం నెలకొంది. నవాబ్ పేట PHCలో గుండెపోటుతో ఏఎన్ఎం మృతిచెందింది. ఏఎన్ఎం కృష్ణవేణి(34) సోమవారం ఉదయం ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తూనే కుప్పకూలింది. అక్కడే ఉన్న డా.నరేశ్ చంద్ర సీపీఆర్ చేసి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణవేణికి భర్త, కుమారుడు ఉన్నారని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిబ్బంది కోరారు.

News July 2, 2024

ఈనెల 4న కామారెడ్డిలో అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

image

కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఈనెల 4న అథ్లెటిక్స్ పోటీలకు బాల, బాలికల ఎంపిక జరుగుతుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. 8,10,12 సంవత్సరాల బాలబాలికలకు రన్నింగ్, లంగ్ జంప్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాల్గొనే క్రీడాకారులు బర్త్ సర్టిఫికేట్, క్రీడా దుస్తులు, బూట్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు.

News July 2, 2024

NLG: కొత్త చట్టాల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ

image

భారత ప్రభుత్వం నూతన న్యాయ చట్టాలు 2023 సోమవారం నుంచి అమలులోకి వచ్చాయని ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని ప్రజలకు మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్త చట్టాల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందని పేర్కొన్నారు.