Telangana

News July 2, 2024

సదాశివనగర్: ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ.. యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్‌లో చోటుచేసుకుంది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను సత్య పీర్ల దర్గా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 2, 2024

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

మెదక్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 24కు హెచ్ఎం, టీచర్లు ఈనెల 10లోగా http://national award teachers, education. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాధాకిషన్ తెలిపారు. దరఖాస్తు ప్రతుల రెండు సెట్లను సంబంధిత యాజమాన్యాల ద్వారా ఈనెల 10వ తేదీలోగా డీఈవో కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

News July 2, 2024

ధర్మపురిలో గుర్తుతెలియని మృతదేహం

image

జగిత్యాల జిల్లా ధర్మపురిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయ్యింది. పట్టణంలోని
అంబేడ్కర్ చౌరస్తాలోని కమలాపూర్ రోడ్డులో మంగళవారం వేకువజామున కంకర కుప్పపై స్థానికులు వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 2, 2024

కాగజ్‌నగర్: మూడేళ్ల పాపపై అత్యాచారం

image

సిర్పూర్ టీ మండలం వెంకట్రావ్ పేట్‌లో మూడు సంవత్సరాల పాపను ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఎస్ఐ రమేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మూడేళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా బుదే రాజేందర్ అనే వ్యక్తి తన ఇంటికి తీసుకుని పోయి అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు. పాప తండ్రి ఫిర్యాదు మేరకు కాగజ్‌నగర్ డీఎస్పీ కేసు నమోదు చేసి నింధితుడిని రిమాండ్‌కు తరలించారు.

News July 2, 2024

NLG: ముగిసిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. మొత్తం 150 మంది స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెడ్ మాస్టర్‌గా ప్రమోషన్ పొందారు. 345 మంది స్కూల్ అసిస్టెంట్లు వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. 450 మంది SGTలు స్కూల్ అసిస్టెంట్లుగా, LFL HMలుగా ప్రమోషన్ పొందారు. చివరి రోజు 1520 మంది SGTలు ఇతర పాఠశాలలకు బదిలీ అయ్యారు. కాగా నేడు వారంతా విధుల్లో చేరనున్నారు.

News July 2, 2024

HYD: ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్‌కు గోల్డెన్ పికాక్ పురస్కారం

image

హైదరాబాద్‌లో మెట్రో రైలును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించడంలో గల నిబద్ధతకు రైల్వేస్ విభాగంలో గోల్డెన్ పికాక్ పురస్కారాన్ని అందుకుంది. బెంగళూరులో జరిగిన ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ 25వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్లైమేట్ ఛేంజ్’ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

News July 2, 2024

HYD: ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్‌కు గోల్డెన్ పికాక్ పురస్కారం

image

హైదరాబాద్‌లో మెట్రో రైలును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించడంలో గల నిబద్ధతకు రైల్వేస్ విభాగంలో గోల్డెన్ పికాక్ పురస్కారాన్ని అందుకుంది. బెంగళూరులో జరిగిన ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ 25వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్లైమేట్ ఛేంజ్’ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

News July 2, 2024

MBNR: నేటి నుంచి సెమిస్టర్-6 ప్రయోగ తరగతులు

image

డా.బీఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ(సైన్స్, కంప్యూటర్ విభాగాలు) మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 2 నుంచి సెమిస్టర్-6 ప్రయోగ తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ డా. జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. తరగతులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. విద్యార్థులు మ్యానువల్ పుస్తకాలు, ఫీజుల రసీదులు వెంట తీసుకురావాలని అన్నారు.

News July 2, 2024

ఉమ్మడి పాలమూరుకు 131 మీసేవ కేంద్రాలు

image

ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు ప్రతి పల్లెలో మీసేవ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు 131 మీసేవ కేంద్రాలు మంజూరు చేసింది. ఒక్క MBNR జిల్లాకే అత్యధికంగా 70, వనపర్తి జిల్లాకు అత్యల్పంగా 4 కేంద్రాలు మంజూరయ్యాయి. ‘మహిళా శక్తి’ పేరుతో మంజూరు చేస్తున్న మీసేవల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించబోతున్నారు. ఇంటర్, ఆపై చదివిన మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు.

News July 2, 2024

ఖమ్మం: ముగిసిన ఉపాధ్యాయ బదిలీలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. జిల్లాలోని 1,375 పోస్టులు ఖాళీగా ఉండగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 1,105 మంది ఉపాధ్యాయులను బదిలీల ద్వారా భర్తీ చేశారు. మిగతా 270 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలతో మోక్షం లభించగా, విద్యార్థులకు న్యాయమైన బోధన అందే అవకాశం ఉందని విద్యాశాఖ చెబుతుంది.