Telangana

News July 2, 2024

కరీంనగర్: బస్టాండ్ సమీపంలోని యూనియన్ బ్యాంకులో మంటలు

image

కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్‌లో సోమవారం రాత్రి 11:30 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. కొద్దిసేపటికి బ్యాంకు నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు సమీపంలోని ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని అదుపుచేశారు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 2, 2024

నిజామాబాద్ జిల్లాలో 1,321 మంది ఉపాధ్యాయుల బదిలీ

image

జిల్లా వ్యాప్తంగా 1,321 మంది ఎస్టీటీలను బదిలీ చేస్తూ డీఈవో దుర్గాప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ గతేడాది జనవరిలో ప్రారంభం కాగా సోమవారంతో ముగిసింది. వారితో పాటు మరో 46 మంది భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయులను బదిలీ చేశారు. 2021లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 25 ఆధారంగా ఈ ప్రక్రియ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

News July 2, 2024

ట్రాక్టర్ ను ఢీ కొట్టిన లారీ: యువకుడు మృతి, మరొకరికి సీరియస్

image

సదాశివనగర్: సదాశివనగర్ మండల కేంద్రంలోని సత్య పీర్ల దర్గా సమీపంలో 44 వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం కామారెడ్డి నుంచి నిజాంబాద్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. ఘటన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

News July 2, 2024

వరంగల్: పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లుగా దరఖాస్తులు

image

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలల్లో హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులకు పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లుగా పనిచేయడానికి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రాంతీయ సమన్వయ అధికారి ఎన్.విద్యారాణి తెలిపారు. పీజీలో సంబంధిత సబ్జెక్టుతో పాటు బీఈడీ ఉన్న అభ్యర్థులు హన్మకొండలోని RCO ఆఫీస్‌లో ఈనెల 3లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 4న డెమో ఉంటుందన్నారు.

News July 2, 2024

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి

image

ఖమ్మం: ఇళ్లు లేని వారికి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన అన్నారు. సోమవారం గృహనిర్మాణాలపై సంబంధింత అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2024-2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు.

News July 2, 2024

NZB: ప్రజావాణి కార్యక్రమంలో 130 ఫిర్యాదులు

image

నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 130 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేశారు. కాగా అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News July 2, 2024

రాజకీయాలకు అతీతంగా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేద్దాం: సీతక్క

image

ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో అధికారులకు సహకరించే బాధ్యత ప్రజాప్రతినిధులదని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సోమవారం జిల్లా పర్యటనలో నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి అంకిత భావంతో జిల్లాను అభివృద్ధి చేద్దామన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా పని చేయాలని, అధికారులు ప్రజలతో మమేకమవలని సూచించారు.

News July 2, 2024

MBNR: కోయిల్ సాగర్‌ను పరిశీలించిన కలెక్టర్..!

image

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ఆనకట్ట ను కలెక్టర్ విజయేందిర సోమవారం సందర్శించారు. డ్యాం పరివాహక ప్రాంతం, డ్యాం నిండితే ప్లడ్ వాటర్ ఏ మేరకు ప్రవహిస్తుంది, కుడి, ఎడమ కాల్వల ద్వారా ఎంత ఆయకట్టుకు సాగు నీరు అందుతుందనే వివరాలు ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

News July 2, 2024

ప్రజావాణి ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం : కలెక్టర్

image

ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన NKPలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫిర్యాదులను పరిష్కరించాలని చెప్పారు.

News July 2, 2024

ఇంటికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని ప్రజావాణిలో ఫిర్యాదు

image

తమకు ఇంటికి వెళ్లేందుకు దారి ఇవ్వాలంటూ నిరుపేద మహిళ కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. రామాయంపేట మండలం శివాయపల్లికి చెందిన సత్తెమ్మ, ఆమె కూతురు శ్రీలత 30 సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం చేసుకున్నామని, గతంలో ఉన్న రహదారిని గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య, ఎల్లయ్య అనే వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని, తద్వారా తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చర్యలు తీసుకోవాలని కోరారు.