Telangana

News July 1, 2024

మంచిర్యాల: స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశానికి ఎంపిక పోటీలు

image

2024-2025 సంవత్సరానికి స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాల ఎంపిక కొరకు ఈ నెల 3, 4 తేదీల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా క్రీడా శాఖ అధికారి కీర్తి రాజవీర్ తెలిపారు. ఓయూ క్యాంపస్, హన్మకొండ, ఖమ్మం, వనపర్తి, సరూర్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అకాడమీల్లో ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 1, 2024

బిక్కనూర్‌లో బాలిక ఆత్మహత్య

image

బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూర్‌లో చోటుచేసుకుంది. పెద్దమల్లారెడ్డి గ్రామంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద పని చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన హరిబాబు కుమార్తె సాయి(15) సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు SI సాయికుమార్ తెలిపారు. మతిస్తిమితం బాగా లేక గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరేసుకున్నట్లు వెల్లడించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News July 1, 2024

కథలాపూర్: బైక్ ఇవ్వలేదని విద్యార్థి సూసైడ్

image

బైక్ ఇవ్వలేదని విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన కథలాపూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. పోసానిపేటకు చెందిన మారు మణిదీప్ (14) జూన్ 24న స్కూలుకు వెళ్లడానికి ఇంట్లో ఉన్న బైక్ ఇవ్వాలని వాళ్ళ అమ్మని అడగ్గా ఆమె ఒప్పుకోలేదు. దీంతో అతను గడ్డిమందు తాగాడు. అతనిని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 1, 2024

రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చిండు: కేటీఆర్

image

రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జగిత్యాలలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారని పార్టీ ఫిరాయింపులను రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలను దమ్ముంటే పదవికి రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్నారు. ప్రజలు అప్పుడు తేలుస్తారని చెప్పారు.

News July 1, 2024

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంపై అధ్య‌య‌నం

image

మధిర: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఇత‌ర రాష్ట్రాల‌కు అధికారుల‌ను పంపించి అధ్య‌య‌నం చేయించి త్వ‌ర‌గా ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వాల‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హౌజింగ్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేద‌ల‌కు కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డానికి ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 3500 ఇండ్ల చొప్పున‌ బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించింద‌న్నారు.

News July 1, 2024

NZB: బస్సు ఢీ కొని యువకుడి మృతి

image

బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మోస్తా మండలంలో చోటుచేసుకుంది. సోమవారం బైక్‌పై నిజామాబాద్ వెళ్తున్న సాయికిరణ్‌ను గోపూర్ శివారు వద్ద ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు అంబులెన్సు‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు వర్ని పోలీసులు తెలిపారు.

News July 1, 2024

HYD: సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లోకి రావొద్దని ఆందోళన

image

రాజధానిలో BRS పార్టీ నుంచి‌ కాంగ్రెస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. పలువురి చేరిక పట్ల హస్తం శ్రేణులు‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గంలో‌ అధికార పార్టీ కార్యకర్తలు‌ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో‌ చేరొద్దని నినాదాలు చేశారు. ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇదిలా ఉంటే పార్టీ మారడం లేదని సబిత ఇప్పటికే స్పష్టం చేశారు.

News July 1, 2024

మక్తల్: సైబర్ కేటుగాళ్లకు ఝలక్ ఇచ్చిన టీచర్

image

మక్తల్‌కి చెందిన ఉపాధ్యాయురాలు జయశ్రీ సైబర్ నేరగాళ్లకు ఝలక్ ఇచ్చారు. నేరగాళ్లు జయశ్రీకి ఫోన్ చేసి ’ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ పేరు మీద ముంబై నుంచి థాయిలాండ్‌కు డ్రగ్స్ కొరియర్ వెళ్లింది‘ అని చెప్పారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని కోరారు. క్రైమ్ బ్రాంచ్‌లో తన అన్న పని చేస్తున్నాడని, ఫోన్ నంబర్ ఇవ్వాలని టీచర్ కోరింది. దీంతో కేటుగాళ్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.

News July 1, 2024

HYD: సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లోకి రావొద్దని ఆందోళన

image

రాజధానిలో BRS పార్టీ నుంచి‌ కాంగ్రెస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. పలువురి చేరిక పట్ల హస్తం శ్రేణులు‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గంలో‌ అధికార పార్టీ కార్యకర్తలు‌ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో‌ చేరొద్దని నినాదాలు చేశారు. ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇదిలా ఉంటే పార్టీ మారడం లేదని సబిత ఇప్పటికే స్పష్టం చేశారు.

News July 1, 2024

డాక్టర్ల సేవలు చిరస్మరణీయం: మంత్రి దమోదర్ రాజనర్సింహ

image

డా.బీసీ రాయ్ జన్మదినం సందర్భంగా డాక్టర్స్ డే జరుపుకోవడం చాలా సంతోషకరమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కొనియాడారు. వైద్యరంగంలో డాక్టర్ల సేవలను వెలకట్టలేమని కరోనా మహమ్మారి సమయంలో డాక్టర్లు వారి ప్రాణాలను అడ్డుపెట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని, వారి సేవలను గుర్తిస్తూ డాక్టర్స్ డే నాడు అవార్డులు అందిస్తున్నామని తెలిపారు. సందర్భంగా రాష్ట్రంలోని డాక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.