India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గద్వాల పట్టణంలోని గజ్జెలమ్మ వీధి గోకరమయ్య కట్ట వద్ద రాత్రి పెళ్లి వేడుకలో డీజే పాటల కోసం 2 వర్గాలు కట్టెలు, రాళ్లతో దాడి చేసుకున్నాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు. పది మందిని అదుపులోకి తీసుకుని, మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు.
ఐటీఐలో ఏదైన ట్రేడ్‌కు సంబంధించి మూడేళ్ల అనుభవం కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్ పొందేందుకు ఈనెల 12లోపు వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఐటీఐ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అర్హులని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ముంబై ఉగ్రదాడి నిందితుడు రాణాను ఎట్టకేలకు ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో HYDకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాగా.. అజ్మల్ కసబ్ దగ్గర నాగోల్ చిరునామా, అరుణోదయ కాలేజీ పేరు ఉన్న బోగస్ ఐడీలు బయటపడ్డాయి. ఆ కార్డుల్లో నగర చిరునామాలు ఉండటంతో ముంబై పోలీసులు HYD చేరుకుని దర్యాప్తు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ‘HYD’ అనే ఉగ్రవాదుల వ్యాఖ్యలు కలకలం రేపాయి. నిపుణుల భాషా విశ్లేషణతో వారు పాక్ అని తేలిపోయింది.
ముంబై ఉగ్రదాడి నిందితుడు రాణాను ఎట్టకేలకు ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో HYDకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాగా.. అజ్మల్ కసబ్ దగ్గర నాగోల్ చిరునామా, అరుణోదయ కాలేజీ పేరు ఉన్న బోగస్ ఐడీలు బయటపడ్డాయి. ఆ కార్డుల్లో నగర చిరునామాలు ఉండటంతో ముంబై పోలీసులు HYD చేరుకుని దర్యాప్తు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ‘HYD’ అనే ఉగ్రవాదుల వ్యాఖ్యలు కలకలం రేపాయి. నిపుణుల భాషా విశ్లేషణతో వారు పాక్ అని తేలిపోయింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ నెల 19న నిర్వహించే ఉపగ్రహ సాంకేతిక దినోత్సవంలో భాగంగా నిర్వహించే ఆర్యభట్ట స్వర్ణజయంతి ఉత్సవాల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆన్‌లైన్లో ఈ నెల 17లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. www.aryabhata.indiaspaceweek.org వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ అభివృద్ధి చేయాలని, ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంట విలువ పెరుగుతుందన్నారు. భవిష్యత్ అంతా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానిదే అన్నారు. రైతులకు చేయూతనందించాలని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలని కోరారు.
ప్రపంచంలోని టాప్ 100 విమానాశ్రయాల జాబితాలో మన దేశంలోని 4 విమానాశ్రయాలకు స్థానం దక్కింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రావెల్ రేటింగ్ సంస్థ స్కైట్రాక్స్ ప్రకటించిన ర్యాంకుల ప్రకారం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 56వ స్థానంలో నిలవగా.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం 32వ స్థానంలో నిలిచింది.
జనగామ జిల్లా పాలకుర్తిలోని గుడివాడ చౌరస్తాలో నలుగురు మైనర్లు ఒకే బైక్‌పై ప్రయాణిస్తుండగా ఎస్సై యాకూబ్ హుస్సేన్ వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి పలు సూచనలు చేశారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోని రేషన్ షాపుల్లో బియ్యం కొరత ఏర్పడింది. రేషన్ కార్డు దారులు రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకునే వెసులుబాటు ఉండటంతో గ్రామాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి పలు పనుల నిమిత్తం పట్టణాల్లో నివసిస్తుంటారు. అలాంటి వారు కూడా పట్టణంలోని పలు షాపుల్లో సన్నబియ్యం తీసుకోవడంతో బియ్యం కొరత ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో ఇంకా 31,22,941 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.
వయోవృద్ధులు, వికలాంగుల కోసం ఈ నెల 11న శుక్రవారం (నేడు) రోజున ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు విచ్చేసి గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక శ్రద్ధతో అర్జీల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.