Telangana

News July 1, 2024

తంగళ్లపల్లి: హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దర్యాప్తు చేశారు. నివేదిక ఐజీకి పంపగా దాని ఆధారంగా మల్టీ జోన్ -1 ఇన్‌ఛార్జి ఐజీ సుధీర్‌బాబు సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

News July 1, 2024

దస్తురాబాద్: ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి

image

బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన దస్తురాబాద్ మండలం మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎంబడి లావణ్య, మల్లేశ్ దంపతుల చిన్న కుమారుడు రాజ్ కుమార్ (13) సోమవారం ఇంటి అవసరాల కోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి నీరు తీసుకువచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ఎస్ఐ శంకర్ తెలిపారు.

News July 1, 2024

నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రి పదవి: దామోదర రాజనర్సింహ

image

నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన పేర్కొన్నారు. పలువురి మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందని, మంత్రి సీతక్కకు హోం శాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉందన్నారు.

News July 1, 2024

ADB: సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు

image

సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ 2025 (ప్రిలిమ్స్, మెయిన్స్) పరీక్ష కొరకు ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు ఆదిలాబాద్ బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా జులై 3 వరకు గడువు ఉండగా జులై 7 వరకు పొడిగించారు.

News July 1, 2024

రిటైర్మెంట్ వృత్తికే కానీ వ్యక్తిత్వానికి కాదు: సీపీ

image

ఖమ్మం: రిటైర్మెంట్ వృత్తికే కానీ వ్యక్తిత్వానికి కాదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులను సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించి ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలన్నారు.

News July 1, 2024

‘రేపటి కోసం’ అంటూ HYD సిటీ పోలీసుల పోస్ట్

image

హైదరాబాద్‌ సిటీ పోలీసులు‌ ట్రాఫిక్ నిబంధనలపై‌ వినూత్నంగా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇటీవల రాంగ్‌ రూట్‌లో వెళ్లే‌ వారిని అప్రమత్తం చేసిన పోలీసులు.. తాజాగా సోషల్ మీడియాలో‌ ట్రెండింగ్ పోస్ట్ పెట్టారు. జనంలో ఆదరణ పొందిన కల్కి సినిమాలోని నినాదాన్ని ఎంచుకున్నారు. ‘హెల్మెట్ ధరించండి. సురక్షితంగా డ్రైవ్ చేయండి. రేపటి కోసం‌’ అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. SHARE IT

News July 1, 2024

‘రేపటి కోసం’ అంటూ HYD సిటీ పోలీసుల పోస్ట్

image

హైదరాబాద్‌ సిటీ పోలీసులు‌ ట్రాఫిక్ నిబంధనలపై‌ వినూత్నంగా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇటీవల రాంగ్‌ రూట్‌లో వెళ్లే‌ వారిని అప్రమత్తం చేసిన పోలీసులు.. తాజాగా సోషల్ మీడియాలో‌ ట్రెండింగ్ పోస్ట్ పెట్టారు. జనంలో ఆదరణ పొందిన కల్కి సినిమాలోని నినాదాన్ని ఎంచుకున్నారు. ‘హెల్మెట్ ధరించండి. సురక్షితంగా డ్రైవ్ చేయండి. రేపటి కోసం‌’ అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.
SHARE IT

News July 1, 2024

వెల్దుర్తి: వైన్స్‌‌కు కన్నం.. నగదు చోరీ

image

వెల్దుర్తి మండల కేంద్రంలోని తిరుమల వైన్స్‌లో సుమారు రూ. 55 వేల నగదు చోరీ జరిగింది. రాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగలు వైన్స్ వెనుక వైపు కన్నం వేసి వైన్ షాపులో ఉన్న నగదు చోరీ చూశారు. అలాగే వెల్దుర్తిలో దంతాన్‌పల్లికి చెందిన శేఖర్ కిరాణా దుకాణం, చందుకు చెందిన మొబైల్ షాప్‌లో చోరీ చేసేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 1, 2024

మహబూబాబాద్: ప్రాణాల మీదికి తెచ్చిన సర్పంచ్ పదవి !

image

చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక, తెచ్చిన అప్పులను తీర్చలేక మనోవేదనతో సర్పంచ్ భర్త మృతిచెందిన ఘటన మహబూబాబాద్ (M)లో చోటుచేసుకుంది. తూర్పుతండాకు చెందిన కృష్ణ.. సర్పంచ్ ఎన్నికల్లో తన భార్యను పోటీచేయించాడు. గెలిచిన అనంతరం జీపీలో అప్పులు తెచ్చి అభివృద్ది పనులు చేయించాడు. దీంతో చేసిన పనులకు బిల్లులు రాక, ఎన్నికల సమయంలో పోటీచేసేందుకు తెచ్చిన అప్పులు తీర్చలేక మనోవేదనతో నేడు కృష్ణ మృతి చెందాడు

News July 1, 2024

జగిత్యాల: సంజయ్ దమ్ముంటే పదవికి రాజీనామా చెయ్: కేటీఆర్

image

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. సోమవారం జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంగిలి మెతుకులకు ఆశపడి తన స్వార్థం కోసం BRSను వదిలిపోయి దొంగల్లో కలిశాడని ఆరోపించారు. ఆయన పోవడంతో జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నారు. గాలికి గడ్డపారలు కొట్టుకపోవని గడ్డిపోచలు మాత్రమే పోతాయన్నారు.