Telangana

News July 1, 2024

BREAKING: HYD: ఉప్పల్‌లో MURDER  

image

ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన HYD ఉప్పల్ PS పరిధిలో ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన మంజుల(40) భర్త గతంలో చనిపోయాడు. కాగా ఆమె ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో పని చేస్తోంది. ఈ క్రమంలో యజమాని పెన్నాం చంద్రమౌళి(47)కి ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల ఆమె మరొకరితో చనువుగా ఉందని తెలుసుకున్న చంద్రమౌళి తట్టుకోలేక మంజులను కారుతో ఢీకొట్టి చంపేశాడు. కేసు నమోదైంది. 

News July 1, 2024

BREAKING: HYD: ఉప్పల్‌లో MURDER  

image

ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన HYD ఉప్పల్ PS పరిధిలో ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన మంజుల(40) భర్త గతంలో చనిపోయాడు. కాగా ఆమె ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో పని చేస్తోంది. ఈ క్రమంలో యజమాని పెన్నాం చంద్రమౌళి(47)కి ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల ఆమె మరొకరితో చనువుగా ఉందని తెలుసుకున్న చంద్రమౌళి తట్టుకోలేక మంజులను కారుతో ఢీకొట్టి చంపేశాడు. కేసు నమోదైంది. 

News July 1, 2024

MLA వంశీకృష్ణ, భార్య, కొడుకు, కుమార్తె.. అంతా డాక్టర్లే

image

అచ్చంపేట MLA వంశీకృష్ణ కుటుంబంలో అంతా డాక్టర్లే ఉన్నారు. వైద్యులుగా రాణిస్తున్న వారు.. పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ ఆదుకుంటున్నారు. ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి స్వయంగా ఎమ్మెల్యేనే 465 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. వంశీకృష్ణ( సివిల్ సర్జన్), ఆయన సతీమణి అనురాధ(గైనకాలజిస్ట్), కుమారుడు యశ్వంత్ కుమార్(ఎంబీబీఎస్), కూతురు యుక్తాముఖి(ఎంబీబీఎస్)గా ఉన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

News July 1, 2024

ఉమ్మడి జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా నర్వలో 39.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా దగడలో 37.0 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా సిరివెంకటాపూర్ లో 36.5 మి.మీ, గద్వాల జిల్లా త్యాగదొడ్డిలో 32.3 మి.మీ, నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 27.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 1, 2024

NZB: ముసురుతో రైతుల్లో మురిపెం..

image

నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం మొదటిసారి ముసురు ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం మొదలైన వర్షం కొనసాగుతూనే ఉంది. జిల్లా అంతటా రుతు పవనాలు విస్తరించడంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. నెల రోజులుగా వానలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. కానీ, ఇప్పుడు ముసురుకోవడంతో రైతులు మురిసిపోతున్నారు.

News July 1, 2024

బదిలీల కోసం ఎక్సైజ్ కానిస్టేబుల్స్ ఎదురు చూపు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖలో సీఐలు, ఎస్ఐలకు స్థాన చలనం కలిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోను నూరుశాతం సీఐలు, ఎస్ఐలకు బదిలీలు జరిగాయి. ఏడేళ్లుగా ఖమ్మంలో 7, భద్రాద్రి జిల్లాలో 6 ఎక్సైజ్ స్టేషన్ లో పరిదిలో 38 మంది హెడ్ కానిస్టేబుల్స్, 133 కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు.

News July 1, 2024

బేల: జాతీయ రహదారిపై టమాట లారీ బోల్తా

image

టమాట లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటన బేల మండలంలోని పాటన్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల ప్రకారం.. రహదారిపై ప్రమాదకరంగా గుంతలు ఉండటంతో లారీ డ్రైవర్‌కు రాత్రిపూట కనపడక ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ప్రాణహాని జరగలేదు. కాగా.. టమాట లోడ్ పల్టీ కొట్టడంతో తీవ్ర నష్టం జరిగిందని రైతు వాపోయాడు. సంబంధిత అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.

News July 1, 2024

400 కిలోమీటర్ల రోడ్లకు రూ.143 కోట్ల అవసరం !

image

ఉమ్మడి జిల్లాలో రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన రోడ్ల మరమ్మతుల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 400 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు 143 కోట్లు అవసరం ఉందని రోడ్ల భవనాల శాఖ అధికారులు అంచనా వేశారు. టెండర్లు పిలవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం మారడంతో నిధులు మంజూరు అవుతాయని, భావిస్తున్నారు.

News July 1, 2024

NLG: జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు

image

నల్గొండ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలం షురూ ఆరంభంలోనే డెంగీ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదు కావడం డెంగీ వ్యాప్తి ఉద్ధృతికి అద్దం పడుతోంది. నల్గొండ నియోజకవర్గంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

News July 1, 2024

నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త చట్టాలు: వరంగల్ సీపీ

image

నేటి నుంచి మూడు కొత్త చట్టాలు(BNS, BNSS & BSA) అమల్లోకి వస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆపరాధ న్యాయవ్యవస్థలో సంస్కరణలు చేయడానికి, మూడు కొత్త చట్టాలు, (1) భారతీయ న్యాయ సంహిత, (2) భారతీయ నాగరిక సురక్షా సంహిత, (3) భారతీయ సాక్ష్య అధినియం అమలులోకి వచ్చాయని తెలిపారు.