Telangana

News July 1, 2024

కొనసాగుతున్న సొరంగం పనులు

image

సీతారామ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి చేర్చి సుమారు 2.52లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్త ఆయకట్టుకు నీరందించవచ్చన్న ఉద్దేశంతో పాలేరు లింక్ కెనాల్ నిర్మిస్తున్నారు. ఇందులో ఆఖరి ప్యాకేజీ అయిన నం.16లో 8KMల మేర సొరంగం కాలువ(టన్నెల్) తవ్వుతున్నారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వద్ద సొరంగం ప్రారంభమై కూసుమంచి మండలం పోచారం వద్ద ముగుస్తాయి.

News July 1, 2024

వరంగల్ నగరంలో వ్యక్తి దారుణ హత్య

image

గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన వరంగల్ పట్టణ కేంద్రంలోని బట్టల బజార్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎల్లంబజారుకు చెందిన పూసల భద్రయ్య(55) రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 1, 2024

నిర్మల్: ఘనా దేశంలో జిల్లా వాసి మృతి

image

నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన బరిగల వెంకటేశ్(34) బతుకు తెరువు కోసం ఘనా దేశానికి వెళ్లాడు. అక్కడ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. ప్రభుత్వం స్పందించి వెంకటేశ్ మృతదేహాన్నివీలైనంత తొందరగా స్వగ్రామానికి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

News July 1, 2024

NLG: ఈ కళాశాలలో సైనికులు READY

image

నల్గొండ NG కాలేజీ నుంచి ఏటా 15 మందికి పైగా విద్యార్థులు దేశరక్షణ సేవలకు అర్హత పొందుతున్నారు. కళాశాలలోని NCC విభాగంలో శిక్షణ పొందుతూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి రక్షణ రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ ఏడు సైతం 16 మంది ఆర్మీకి ఎంపికయ్యారు. విద్యార్థుల్లో ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్నామని ప్రిన్సిపల్ డా.ఉపేందర్, NCC ఇన్ ఛార్జి సుధాకర్ చెబుతున్నారు.

News July 1, 2024

NZB: మురుగు కాలువలలో పడి యువకుడి మృతి

image

నిజామాబాద్ నగరంలోని రెండో టౌన్ పరిధిలో గుర్తు తెలియని యువకుడు మురుగు కాలువలో పడి మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రెండో పోలీస్ స్టేషన్ ఎస్సై రామ్ అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 1, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరల వివరాలు..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.19 వేలు పలికింది. ఏసీ 341 రకం మిర్చి రూ.17,000, వండర్ హాట్(WH) మిర్చికి రూ.16,000 ధర వచ్చింది. కాగా, గత శుక్రవారంతో పోలిస్తే తెజ, 341 మిర్చిలు రూ.500 పెరగగా.. వండర్ హాట్ మిర్చి ధరలు రూ.1000 తగ్గింది.

News July 1, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు సోమవారం ఉదయం వెల్లడించారు. ఏసీ మిర్చి ధర రూ.20,000 జండా పాట పలుకగా పత్తి రూ.7,300 జెండా పాట పలికినట్లు వెల్లడించారు. పత్తి ధర మొన్నటి కంటే 50 రూపాయలు పెరగగా ఏసీ మిర్చి ధర నిలకడగా కొనసాగుతోంది. పత్తికి రేటు పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 1, 2024

NGKL: ఆస్పత్రి నుంచి ఈశ్వరమ్మ డిశ్ఛార్జి

image

నాగర్‌కర్నూల్ జిల్లా మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ పూర్తిగా కోలుకోవడంతో నిమ్స్ నుంచి డిశ్ఛార్జి చేశారు. కొందరి పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను గత నెల 23న నిమ్స్‌లో చేర్చారు. 8 రోజులు చికిత్స అనంతరం డిశ్ఛార్జి చేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఆమె వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి జూపల్లి రూ. లక్ష చెక్కును ఆమెకు అందజేశారు.

News July 1, 2024

NGKL: నేటి నుంచి అభయారణ్యంలో ప్లాస్టిక్ నిషేధం

image

అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమ్రాబాద్ అభయారణ్యంలో జూలై 1 నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు మన్ననూర్ ఎఫ్ఆర్ఓ ఈశ్వర్ తెలిపారు. పర్యావరణం పరిరక్షణ, వన్య ప్రాణుల వనగడను దృష్టిలో ఉంచుకొని అభయారణ్యంగా గుర్తించి ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడరాదన్నారు. వాటర్ బాటిళ్లు, బిస్కెట్ కవర్లు, పాలిథిన్ కవర్లు పడేయవద్దని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు అన్నారు.

News July 1, 2024

HYD: బోనాల పండుగ.. MLA రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

image

ఈనెలలో బోనాల ఉత్సవాల నేపథ్యంలో హిందూ ప్రజలను ఉద్దేశించి HYD గోషామహల్ MLA రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బోనాల ఉత్సవాల్లో ఎట్టి పరిస్థితుల్లో హలాల్ జరగడానికి వీలు లేకుండా చూడాలన్నారు. మేకను, గొర్రెను బలిచ్చేటప్పుడు హలాల్ చేయనీయొద్దని, హిందూ పద్ధతిలోనే చేయాలన్నారు. ఒకవేళ బలిచ్చే వారు ముస్లిం అయితే అతడు తన మనసులోనైనా సరే ఆ గొర్రెను అల్లాకు సమర్పిస్తున్నానని చెబుతాడని ఆయన ఆరోపించారు.